అలుపెరుగని దూరాలకు పరుచుకున్న
ఆరావళీ వరుసలు
ఎప్పటెప్పటి నిశ్శబ్దాన్నీ చుట్టుకున్నట్లున్నాయి.
ముద్ర వెయ్యకుండానే మాయమయే
మబ్బుదొంతరలు
సముద్రాన్ని ఆవాహన చేసుకుంటూ ఆవులిస్తూ సాగిపోతున్నాయి.
పశ్చిమంగా హద్దుగీస్తున్న
అరేబియా సముద్రం
పరుగెత్తే కాలానికి రేయింబవళ్లు పహరా కాస్తున్నట్లుంది.
తీరాన్ని వదిలి అద్దరికీ ఇద్దరికీ మధ్య
పరుగెత్తే మోటారు లాంచీలు
పరవశంతో ప్రవహించే కూనిరాగాల్ని
కడలి ఒడిలో ఒడుపుగా లాక్కెళుతున్నాయి.
ఆటవిడుపుగా జాతరకి బయలు దేరిన
పల్లెవాసుల పకపకల మాటున
పరిమళించే ముచ్చట్ల సవ్వడులు
అలలై కదులుతున్నాయి.
ఆ వార- బీడుభూములు, ఉప్పు కయ్యల సాక్షిగా
దేవాలయపు గంటల మోతలు నేపథ్య సంగీతమైతే,
ఈ వార- గిరగిర తిరిగే గాలిమరలు తోడురాగా
మట్టిపొత్తిళ్ల నిండా పచ్చదనాలు చిగుళ్లెత్తుతున్నాయి.
గమ్యంవైపు ఆగిసాగే నిస్సహాయపు బరువులతో
ఇసుక సెగల్ని మరింత ఎగదోసే ఎడారి ఓడలు
ఓయాసిస్సుల వెంట గంభీర మౌనముద్రల్ని వదులుతూ
ప్రకృతిలో ద్వైతాద్వైతాల వేదాంతాన్ని నిట్టూర్పుల మధ్య నెమరేస్తున్నాయి.
ఆరావళీ వరుసలు
ఎప్పటెప్పటి నిశ్శబ్దాన్నీ చుట్టుకున్నట్లున్నాయి.
ముద్ర వెయ్యకుండానే మాయమయే
మబ్బుదొంతరలు
సముద్రాన్ని ఆవాహన చేసుకుంటూ ఆవులిస్తూ సాగిపోతున్నాయి.
పశ్చిమంగా హద్దుగీస్తున్న
అరేబియా సముద్రం
పరుగెత్తే కాలానికి రేయింబవళ్లు పహరా కాస్తున్నట్లుంది.
తీరాన్ని వదిలి అద్దరికీ ఇద్దరికీ మధ్య
పరుగెత్తే మోటారు లాంచీలు
పరవశంతో ప్రవహించే కూనిరాగాల్ని
కడలి ఒడిలో ఒడుపుగా లాక్కెళుతున్నాయి.
ఆటవిడుపుగా జాతరకి బయలు దేరిన
పల్లెవాసుల పకపకల మాటున
పరిమళించే ముచ్చట్ల సవ్వడులు
అలలై కదులుతున్నాయి.
ఆ వార- బీడుభూములు, ఉప్పు కయ్యల సాక్షిగా
దేవాలయపు గంటల మోతలు నేపథ్య సంగీతమైతే,
ఈ వార- గిరగిర తిరిగే గాలిమరలు తోడురాగా
మట్టిపొత్తిళ్ల నిండా పచ్చదనాలు చిగుళ్లెత్తుతున్నాయి.
గమ్యంవైపు ఆగిసాగే నిస్సహాయపు బరువులతో
ఇసుక సెగల్ని మరింత ఎగదోసే ఎడారి ఓడలు
ఓయాసిస్సుల వెంట గంభీర మౌనముద్రల్ని వదులుతూ
ప్రకృతిలో ద్వైతాద్వైతాల వేదాంతాన్ని నిట్టూర్పుల మధ్య నెమరేస్తున్నాయి.
నిమిత్త మాత్రంగా
నిటారుగా నిలబడిన ఆకాశం
అంతలోనే ఆ క్షితజరేఖ వైపుగా ఒంగిందెందుకని?!
(ద్వారక, గుజరాత్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కలిగిన ఆలోచనలు)
ప్రకృతి ని ఎంతో అందంగా వర్ణించేరు.జీవితన్న్ని ఎంతో హడావిడి గా పరుగులు పెడుతూ గడిపెస్తున్న ఈ కాలం లో ప్రకృతి ని చూసే టైం లేదు మనకి. అరేబియా సముద్రాన్ని మరియు ఆరావళి పర్వతలని ఎంతో అద్భుతం గా వర్ణించేరు. చెట్లు ఎండే పోయాయి, సముద్రంలో నీళ్ళు లేవు అనే కాలం ఇది. ఎంత మంది ఇలా చూడ గలరు మనలో.
అనురాధ గారు మాకు కూడా వారి కవిత తో గుజరాత్ darsanam cheyincheru. Adbhutamaina సరళి తో కమ్మటి కవిత andinchinanduku చాల థాంక్స్!!
నేను ఆరావళి పర్వతాల్ని, గుజరాత్ ని సందర్సించినా అవి అంత అందమైనవని ఎప్పుడు గుర్తించలేదు. అదేనేమో కవికి కామన్ మాన్ కి తేడా?! ఎంత బాగా వర్ణించారు -ఉప్పు కయ్యలు, మట్టి పోతిల్లు!! ముఖ్యంగా ఆంధ్ర దేశానికి దూరంగా ఉంటూ, తెలుగుని మరచిపోతున్న మా లాంటి వాళ్ళకి ఈ వర్ణన ఉల్లాసంగా ఉంది. ఎడారి వోడలు లాంటి పదాలు చిన్న తనాన్ని, స్కూల్ పుస్తకాలని గుర్తు చేసేయి. ఈ కవిత చదివేక మళ్లీ ఆ ప్రదేశాలు చూడాలనిపిస్తోంది.ఎలాంటి అనుభూతిని అందించిన అనురాధగారికి నా హృదయపూర్వక అభినందనలు.
అద్భుతమైన కవిత …. కాదేది కవితకనర్హం ఎంత నిజమో !!
ఆదరి ఈదరి కి మధ్య పరిగెత్తే లాంచీలు – అయి వుండాలి అనుకుంటున్నా
ఏది ఏమైనా చక్కటి కవిత యిట్టె రాయగాలిగేరు అనిపించింది
ప్రక్రుతి తాలూకు అందాలు ఈ రకంగా మనకు వినిపించారు
ధన్యవాదాలు