విక్షేపణ పొందిన రంగుల
ఇంద్రధనుస్సు ఒక అనిశ్చితం-
రంగులన్నీ చెదరిపోయి
మిగిలిన తెల్లటి స్ఫటికం
అభావంలా గోచరించే సత్యం-
సమాంతర రేఖలకో
ఖండన బిందువునేర్పరచాలని
అనుకోవడం ఓ పిచ్చితనమే
విస్తృతమై ఆవరించిన విశ్వంలో
కలవని దారులెపుడూ
తెరవబడే ఉంటాయి-
అంతరమార్గాల అవలోకనాలలో
ఏర్పడే దిక్కులన్నీ
విభేదించిన మనసులై
ప్రయాణిస్తాయి-
భావనల ప్రస్తారాలలో
సంభవించే కలయికలలో
నువ్వూ- నేనూ- ఈ ప్రపంచం
ఎవరికి వారే వేరువేరై!
లోతైన నిర్భావ ప్రసరణ . ఏదో వెలితిని తోడుకుంటూ
Thank Martin garu
చాలా మంచి కవిత. నన్ను నిరంతరం వెంటాడుతున్న కవిత.
మంచి పోఎటిక్ స్ట్రీక్ ఉంది. అభినందనలు శశిశ్రీ గారూ..
-భాస్కర్
Thank you sir
మీ కవిత్వంలో ఎక్కువగా కన్పించేది మేథమేటిక్స్. అది ఈ కవిథలోనూ సుస్పష్టం. భలేగా ఉండింది చదువున్నంత సేపూ
ధన్యవాదాలు వాసుదేవ్ గారు