నుడి - 4 (ఫిబ్రవరి 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 4' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6
7 8
9
10 11 12 13
14
15 16
17 18
19 20 21 22
23 24
25
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
3. మన మధ్య పాక్షికంగా ఉన్న గౌరవం (3)
7. నడుమ 3 అడ్డంకు నడుమ మార్పు (3)
8. ఒంటరిగ వెనక్కి వస్తే మొదట్లోనే వడ్డించేది! (3)
9. వాణిజ్యం మొదట్లో వత్తు తాలూకుది వుంది కానీ అసలుది లేదు (3)
10. మొదలు తప్ప మరేమీ మిగలని అటువంటి విక్రమార్కుల నీలాపనిందలు తిట్లు అధర్మాన్ని సూచిస్తాయి (4)
12. వదరుబోతుతనం పులిని చూసి మరో జంతువు పెట్టుకునేదాంట్లో ఎక్కువగ ఉంటుంది! (4)
14. సుగ్రీవ సోదరుడు లేకుండా రావాలి (1)
15. ఆడంబరములు ఆరలేదు కనుక ఇవి ప్రగల్భములు (4)
16. టక్ టక్ టక్ - వీటిని ప్లే చేసి తత్ఫలితంగా దర్శనమిచ్చే ఈమె మోసగత్తె! (4)
17. మనం లేని గమనం తర్వాత మరి ఎదురుగా వస్తే అది గొప్పతనమే (3)
23. ఇంకొంచెం తమరికి శూన్యాన్ని కలిపి సరి చెయ్యాలి! (3)
24. రోజా తిరగేసిన నిక్కరు పక్కన జాలి లేని జాబిలి! (3)
25. వాడి వున్న గోరు చివరలు ఆంగ్లేయుల భోజనాన్ని సూచిస్తాయి (3)
1. విలువైన రాయిని కలిగివున్న స్త్రీ (3)
2. వాపోయిన మనవాడు బతకడు! (3)
3. దోమలే ఏరియాలో ఏదో పోగొట్టుకుంటే ఈ వ్యాధి వస్తుంది! (4)
4. విలాసం కోసం నరంలో గాయపడాలి సరిగ్గా (4)
5. అద్భుతమైన పాత గాయకుడు సూచించేది సంజ్ఞలు కావచ్చు (3)
6. పువ్వు తారుమారు చేయాల్సింది క్షీరమట (3)
10. కుండ కానిదా ఈ నింద? (3)
11. నువ్వులు తిలకాలు కాలేదు (3)
12. ఇది 12 అడ్డపు లక్షణం అట (3)
13. అక్కడక్కడే తిరిగి కొసల్లో చెమ్మను చేర్చుకుంది (3)
17. గడిలో పైకి స్పృశించి దీన్ని విప్పడం కష్టం! (2, 2)
18. నీ నా కింద నీళ్లు చేరితే ప్రాణాలతో ఉండనివ్వరు! (4)
19. ఈవిడ కోసం వెల లేని కోవెల పక్కన మలి ప్రతిష్ఠాపనం చెయ్యాలి! (3)
20. కవితలు విధ్వంసమైతే వికృతమైన కథలు మిగులుతాయి (3)
21. తెలుగు నాడులో కుడినుండి ఎడమకు వచ్చిన సర్పాలు (3)
22. ఒకరకమైన మత్తు పానీయంతో చక్రవర్తి ఏర్పరచిన టెంటు (3)