నుడి-5 (మార్చి 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 5' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: మార్చి 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6
7 8
9
10 11 12 13
14
15 16
17 18
19 20 21 22
23 24
25
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
3. ప్రసిద్ధ పాకిస్తానీ అమ్మాయి స్త్రీగా మారింది (3)
7. నడుమ వత్తుతో ఇంగ్లిష్ కోడి దొరికెను! (3)
8. వేమన పద్యంలో ఘాటైన వాసన కలది (3)
9. తల్లికన్న ఎక్కువ మేలు చేసే ఇది అప్పుడప్పుడు చాలా ప్రియం అవుతుంది (3)
10. ఈ పత్రిక ఇవాళ్టి వాస్తవం (2, 2)
12. రాజీవపత్రం తాలూకు మహిమాన్విత రాగాన్విత కుశలతా ప్రారంభాలు (4)
14. కర్తవ్యానికి ముందొచ్చేది ఏంటి? (1)
15. తంగా తంగా తంగా - మా ఇవి భారీ జంతువులు! (4)
16. అణువులను కలిగివున్న వీటిని పరమౌషధంగా వర్ణిస్తారు ఆయుర్వేద వైద్యులు (4)
17. అందిన తర్వాత అప్పటి వరకు రెండూ వొకటే (3)
23. సంగీతంలో ఈ కుతూహలం రాగమై వుంటుంది (3)
24. నాలుగో మార్పుతో ఏర్పడిన మెట్రో రైలు స్టేషను (3)
25. ఆ రోజు శ్రాద్ధం కావచ్చు! (3)
1. మోకాలి చిప్ప కాలిపోయినా అదే కావచ్చు (3)
2. బహుమతి వంటిది కనుక మొదట్లో పొడగించాలి (3)
3. స్త్రీల చీరల రవికల పొడవైన దారాల కొసలు (4)
4. మనం గత పరిణామానికి లోనైతే దీన్ని తొలగించడమే రేపిస్టులకు తగిన శిక్ష అంటున్నారు కొందరు (4)
5. భూమి కొలత అటుదిటుగా రాకముందు దిగువన అదృశ్యమైన ఎగువ నది! (3)
6. కెరటానికి ఇమ్ము కొమ్ము, తెమ్ము హయమ్ము! (3)
10. రమా! ముందరనే వుంటే తప్పా? (3)
11. తల కొట్టేసిన పాములు శైవ మతస్థుల్ని చూపిస్తాయి (3)
12. నడుమ తేలిక చేసి యిల్లంతా సర్దితే చాక్లెట్ లాంటిది దొరుకుతుంది! (3)
13. ఒకరకం పాత్రలు బహుశా జడ చివర్న వుంటాయి! (3)
17. కాబట్టి కకావికలైనది అంత చేదు! (4)
18. ఇంపైన పాట (2, 2)
19. నేరస్థులను పోలీసులు ఈ న్యాయపాత్రలో వేస్తారా?! (3)
20. కొమ్ము లేదు కనుక విలువైనది అసంపూర్ణం! (3)
21. మొదలు మనదే, కాని దిగులును సూచిస్తుంది (3)
22. జబ్బులు నడుమ తేలికై చెల్లాచెదరైతే వాటిలోనిదే ఒకటి వస్తుంది (3)