నుడి-9 (జూలై 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 9' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: జూలై 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6
7 8
9
10 11 12 13
14
15 16
17 18
19 20 21 22
23 24
25
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
3. బయటికి పొడుచుకొచ్చే భవన భాగం కావచ్చు (3)
7. నడుమ అదృశ్యమైనా చప్పుడే (3)
8. అయిసు ముక్కలోని ఇసుక! (3)
9. పేపరు పరుపే ఎలా అయిందో చావిడి అలా అయింది! (3)
10. వైవిధ్యం లేనిది వైవిధ్యంతో కంకే ఒర (2, 2)
12. వాపోయిన జవాను మధ్యలో తిరగేసిన వడ ఫలితంగా భయపడను! (4)
14. వేలల్లో ఒకటి! (1)
15. మాల తర్వాత నననన శిక్షలు! (4)
16. స్థిరత్వం కోసం వేరేవిధంగా ఉన్నాడని మార్పునకు లోను చేయాలి (4)
17. మతి లేని సుమతి ముందు అక్క చూపే ఆగ్రహం! (3)
23. రాగికి మార్పు చేస్తే డిమాండు లాంటిది వస్తుంది (3)
24. నివాసగృహాల సముదాయం దహించుకుపోనీ! (3)
25. అట్నుంచి పోరంబోకు రాము 246 త్యజించగా మిగిలిన దర్పణం! (3)
1. దీన్ని చెవుల్లో పోస్తే వినపడదంటారు (3)
2. మీ M.D. వినూత్నంగా ఇచ్చే ఆంగ్ల మాధ్యమం! (3)
3. కూపంలో తారుమారు చేసిన స్వప్నం ఫలితంగా చిన్నప్పుడే కవితలల్లే వాడు! (2, 2)
4. ఒకరకం ఆయుధం. కానీ ఇది నాది కాదు (1, 3)
5. ఏభయి మూడు మైనస్ ఏడు (3)
6. సమ్మతిని సూచించే మంచి వదనం (3)
10. తప్పు కానిదాని సౌందర్యమే అంగీకారం (3)
11. మరో 1 నిలువు లాంటివే. ఇవి మావైతే పండ్లనిస్తాయి (3)
12. పడుచు గంపోని నిష్క్రమణ తర్వాత పోనివ్వని జగం కుదురుకోవాలి (3)
13. నీవు ఉన్నచో వచ్చు తినుబండారమిది! (3)
17. అక్షరం అమర్చిన అర ముక్క (4)
18. పూర్వం గోలకొండను సంపాదకించిన వాడు! (4)
19. గిరుల ప్రారంభం చుట్టూ వల వేసి కుక్కను తేవాలి! (3)
20. చారికి అడ్డదిడ్డంగా చేసే ఊడిగం (3)
21. Car లేకపోవడం వేస్టే! (3)
22. ఈ రాజధానిలో ఆంగ్లేయుల డబ్బూ న్యాయమూ పక్కపక్కన ఉంటాయి (3)