నుడి-12 (అక్టోబర్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 12' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: అక్టోబర్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6 7
8
9 10
11 12
13 14 15 16 17 18
19
20 21 22
23 24 25 26 27 28
29 30
31 32 33
34 35
36 37
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. సదా హోమాన సర్దుకున్న సమతా స్థితి (3, 2)
5. నయా నయా కాపల టైమ్ పాస్ కు దారి తీస్తుంది (5)
8. ఒక కవి కాలు దాదాపు మొత్తం మారిపోయి పటాపంచలైంది (5)
9. ఒకసారి ఆవడ తను తూర్పునుండి పడమరకు రాగా నడుమనే ఉండిపోయింది (3)
10. గ్రాంథికంలో వద్దు (3)
11. అహర్నిశలు రాత్రికి ముందు వైరాలు చోటు చేసుకోవాలి (3, 2)
13. వాయువు రివర్సులో రాలిపోగా రాలేదు, పోలేదు! (2)
15. ఇది పాల యిల్లా? (2)
16. ఇల్లు, దీపము (2)
18. శంకలో అనుస్వార స్థానచలనంతో ఏర్పడే ఏలుబడి కాలం (2)
20. కాలు లేని కాటికాపరితో రూలు లేని రూపాలు కలగలిసి ఏర్పడే పద్ధతి. ఇది మామూలే కూడా (4)
21. పాదం కింద పన్నెండంగుళాలు ప్రశ్నించు! (3)
22. అస్తవ్యస్తంగా కంద పేరి అవతరిస్తుంది దారిద్ర్యం (4)
23. ఆంగ్ల రంపాలు ఒక యేడాదికి సమానం (2)
24. ఈ దళాయతాక్షి కన్నులు తామరరేకుల వలె దీర్ఘంగా ఉంటాయి (2)
26. పరుసవేది మూలరచయితకు నడుము విరిగింది. గుండమ్మ కథ పాట పల్లవిలో రెండుసార్లు రావడం మనం గమనించవచ్చు (2)
27. ఈమె ప్రియుడి పేరుతో ఇప్పుడు సినిమా ఆడుతోంది (2)
29. విలువైన రాయితో యుద్ధం. ఇది రోజూ పెళ్లి తర్వాత వస్తుంది బహుశా! (2, 3)
31. ఇది లోహమా, పద్యాల్లో ఒక రకమా? (3)
33. తామరపూలు మధ్యమధ్య మాయమైతే చుక్కల్ని చూపిస్తాయి! (3)
34. అమ్మతమ్మునికి అటూయిటూ వర్షాలై అభినవ పోతనగా ప్రసిద్ధి చెందినాయన (5)
36. చక్రవాతము (5)
37. ఈమె గింగిర్లు తిరిగిన ముంగుర్లు కలదా? (5)
1. ఎత్తుపల్లాలు లేకుండా సకలం రాసేదాన్ని కోల్పోయి, తర్వాత తమ గాలం సర్దుకోవాలి (5)
2. ఇది ఆనకట్ట కనుక వాకింగ్ చేయను! (3)
3. ఇంటిది వెళ్లిపోయాక ఇందాకటిది మిగిల్చిన పాత్ర (2)
4. ఒక రకమైన ధాన్యమే కాని, ఆభరణాన్ని కోల్పోయిన అవి సెనగలు (4)
5. సగం బూటకాలు చూపించే అవయవం (2)
6. కృష్ణుని కులం (3)
7. క్యాష్ మనీ (3, 2)
11. సుంకము ఇంటిది కావచ్చు, ఇంకోటి కావచ్చు (2)
12. వరుసకు ముందొచ్చేది అదీ కాదు (2)
14. మరి లిక్కులు మార్చిన యిది ఓ ప్రఖ్యాత కవి రాసిన పుస్తకం (5)
15. ఉప్పూ కారం తక్కువైన కూర (3, 2)
17. తిరగేసిన పేడను రెండువైపుల నుంచి ఆక్రమించిన మంటలో చూపిస్తుంది ఒక ఊరిలో (5)
18. అయ్యప్ప భక్తుల గమ్యం కోసం ఆశ మరి బలైతే మధ్యన ఉన్నదాన్ని మార్పునకు గురి చెయ్యాలి (3, 2)
19. ఈ దండయాత్రలు ముస్లిముల గడ్డాలా? (3)
23. సీసా దాదాగా మారితే వచ్చేది సింపుల్ గా ఉంటుంది (5)
25. ఈ మాల చాలా మంది ఆధ్యాత్మికుల దగ్గర వుంటుంది (2)
26. అసంపూర్ణమైన కుండతో కలిసి స్కామునిచ్చే angle (2)
28. నష్టాలు ఉండి దీనికి వ్యతిరేకం (3, 2)
30. ఆరామికుడు రావాలంటే గరిట కొసకు రెండు వైపులా తోమాలి! (2, 2)
32. పరివర్తన చెందదు కాని, ఇక్కడ 36 అడ్డంలో సున్న మాయమై కొంత భాగం పరివర్తన చెందింది (3)
33. వేడిమిలా మారవలసింది పంతాలా? (3)
34. నడుము విరిగిన వానరం నెలలో నాలుగో భాగం (2)
35. ముఖపుస్తకంలో ఇటువంటివి చాలానే ఉంటాయి బహుశా (2)