నుడి-14 (డిసెంబర్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: డిసెంబర్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6 7
8
9 10
11 12
13 14 15 16 17 18
19
20 21 22
23 24 25 26 27 28
29 30
31 32 33
34 35
36 37
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. చిత్రాల సొరుగు (3, 2)
5. మాయస్టోరీ కానిదా ఈ బేలతనం? (5)
8. మీసం రాక ఇట మేము తూలుతూ ఒకటి విడిచి ఒకటి ఏరుకుని గుదిగుచ్చగా కష్టాలు ఆవిర్భవించాయి! (5)
9. అపేక్ష కూలిన పేర్మి కూపే లేకుండా మారింది (3)
10. స్త్రీ, పుస్తకం వలన మార్పు చెందాలి (3)
11. కదలని పసి నడకే కకావికలు (5)
13. అటుదిటుగా వచ్చినవి ఎన్నో (2)
15. మాండలికంలో భృతి లేకుండా చేసే పని గ్రాంథికంలో ఎటువంటి సమానార్థకం? (2)
16. కొన్ని సార్లు గయ్యాళి తనతో పాటు తీసుకొచ్చే పెద్ద బుట్ట! (2)
18. ఎద్దుల మెడ మీద పెట్టేదీ ముస్లిం భాయి మాటల్లో నిప్పును పుట్టించేదీ ఒకటే కావచ్చు (2)
20. వస పాకే వ్యత్యస్తంతో ఉత్తీర్ణురాలవకే! (4)
21. ఉపాయాలలో ఒకటి చూపించే తేడా! (3)
22. ఈమె వయ్యారి కనుక, వేగంలో అచ్చు లేకుండా అలాగ వెనక్కి రావాలి (4)
23. దేవతల తల్లి కొంత వరకు ఇది కాదు (2)
24. ఈ గజ్జి మన సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తోంది (2)
26. గోతాము మధ్య ఖాళీ అయింది కనుక ఇది గారాబం (2)
27. కొంత ఒప్పారుచు చూపించే కాంతులు ఇక్కడ అసంపూర్ణం (2)
29. పాఠశాల యందలి గురువులు యమలులో వున్నచో ప్రాణములను లాగెడి సాధనములు వచ్చును! (2, 3)
31. కాపాడబడిన చిన్నపాటి సినీ తార (3)
33. కొమ్ములు లేని ఆవులు ఇటువైపునకు వ్యతిరేకం (3)
34. అప్పిచ్చేవారి దారుణమైన తల క్రూరమైన సగాన్ని వొదులుకుని కుదురుకోవాలి (2, 3)
36. పద్మరుచిని కలిగిన రాగం (3, 2)
37. ఔషధం తనకేనా అంటున్న నిజ యజమాని (2, 3)
1. పురాణంలోని ఒక గురుదక్షిణ సవ్యమైన బొలువేనట! (3, 2)
2. ఒకానొక తీగ (3)
3. నీతో కలిసి వస్తే నిస్సత్తువనిచ్చే ఇది తొమ్మిది రకాలుగా ఉండొచ్చు! (2)
4. నుడుల కోసమే పైకి కేలటమా? (4)
5. అంతు లేని అలసట ప్రథమాక్షర బహువచనం కాబోలు (2)
6. సదుపాయమున అర్ధభాగం లేదు కనుక, నది సాక్షాత్కరించింది (3)
7. ఇట్లా పోవడమంటే కాలడమే! (5)
11. అన్నీ ఒకటే అయిన కూతురు తాలూకు జాబితా పట్టుకుని..... (2)
12. పర్వతం వలయ సహిత ఆభరణం కావచ్చు (2)
14. ఆల్కెమీకి సంబంధించినది కొత్తగా రాసిన పరువే దిస (3, 2)
15. చివరకు కొత్త రూపంలో కాలేని ఎలకా కుట్టకే! (5)
17. అటుదిటుగా బట్ట పట్టుకో. కట్టుకుంటారు దీన్ని పూజా సమయంలో (2, 3)
18. వాచ్ మన్ మార్చవలసింది పరులా కాదా? (3, 2)
19. ఆనంద ప్రారంభ హ్రస్వీకరణానంతర క్రమీకరణ పర్యవసానం కొసరు వంటిది! (3)
23. చాలా అల్లకల్లోలంగా పామైన అర (5)
25. సంగీతంలో ఇది లేకుంటే.... ఎల్లలు లేని విలయమే (2)
26. హాకీ, ఫుట్ బాల్ లాంటి ఆటల్లో ఆంగ్లేయుల ‘ధ్యేయం’ ఇదే! (2)
28. మంచుదుక్కల మార్పుతో వచ్చేదాన్ని కంట్లో వేసుకుంటారు కాబోలు (3, 2)
30. ఇది క్షీరభాండం. ఇందులో సగం పైకి రావాలి కదా! (2, 2)
32. విక్కి తన ముప్పావు భాగం మార్పు చేసుకోగా అనంతంగా మిగిలినది (3)
33. ఆవున్నా లేకున్నా ఇది అనుమానమేనా? (3)
34. మా నిష్క్రమణ తర్వాత కార్ల కంపెనీ వెలువరించిన శబ్దం! (3)
35. ఈ తీగ మీద కవి శీర్షాసనం వేస్తే వైకల్యం వస్తుంది! (2)