నుడి-15
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: జనవరి 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5
6 7 8
9 10 11 12 13
14 15 16 17 18
19 20 21
22 23
24 25 26 27 28
29 30 31 32
33 34 35
36
37 38
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. రాక కోసం మనం ఆగం కనుక, చివరి వలయాన్ని ధ్వంసం చేసి నూతనంగా ఆవిష్కరించుకోవాలి (4)
3. పతంగ్ పలిటంగా పరివర్తన చెందిన ఫలితం (2, 2)
5. ముఖం మార్పిడి మూలంగా ఏర్పడుతుంది ఇది. దీనితోడిది మరువం (3)
6. దీనికి ముందు మధు ప్రత్యక్షమైతే అది ఆరోగ్యానికి మంచిది కాదంటారు! (2)
7. కొమ్మును విరగ్గొడితే ఆకులను చూపించే కూతురు! (2)
9. రాతగాని కోసం రాయనన్నతను రాతను బహిష్కరించి సర్దుబాటు చేసుకోవాలి (3)
12. నాయకుల తలనే మార్చాలి మనం (3)
14. వెనక్కి వస్తే పోట్లాడే ఇది ఎల్లుండికి నిన్ననో ఏమో! (2)
15. ఆలకించు. ఇది చాలావరకు ఒక లోహంలాగా వినిపిస్తుంది! (3)
17. చంద్రగుప్తుని తల్లి సుగ్రీవ సోదరుడు లేకుండా సంతోషించాలి! (2)
19. మంచి సినిమా పాటలో దీని తర్వాత మంచి రోజు వస్తుంది (2)
20. విత్తనం జరిగింది కాని, సరి స్థానాలు లేకుండా వెనుతిరిగింది! (2)
22. పరభాషలో ‘వీల్లేని’ చక్రవాకము బహుశా సెలయేరై దర్శనమిస్తుంది (2)
23. కత్తికి ముందుండే విశేషణం (2)
24. మొదటి విభక్తి ప్రత్యయములు రెండే చూడుము! (2)
26. సన్నని రెమ్మ కోసం కొండతో కలిసి వచ్చేది లేకుండా కోరినవట (3)
28. తెలంగాణ కష్టం (2)
29. మూలం కోసం కురువే కుడినుండి ఎడమకు రావాలి (3)
31. రిపీట్ అయినది లేకుండా తనదయిన మిశ్రమం లవర్ ను చూపిస్తుంది (3)
33. ఆడవాళ్ల ఉపవస్త్రం ఆంగ్లేయుల శ్వాసకోశమా?! (2)
35. సగం పరిమళాన్నిచ్చే మత్తు పానీయం (2)
36. యాదిలో నా కులం (3)
37. పాట సులువుగా మూడింట రెండొంతులు పరిణామం చెంది ప్రేలుడు పదార్థాలనిచ్చింది (4)
38. టక్కరి మగువ? (4)
1. ఆ బాధ బాధే (4)
2. ఎట్నుంచి చూసినా ఒకేవిధంగా కనపడే తోట (3)
3. పాట యొక్క గ్రాంథిక రూపం (3)
4. ద్రవ్య ముద్రణాలయం పూలకొస మీద పైకి సాకటం! (2, 2)
6. నది చీలిక నచ్చుతుంది చాలా మందికి హైదరాబాద్ లో (2)
8. ముక్కంటి ఇక్కడ సాక్షాత్కరించింది సగమే. శీర్షాసనం వేసిన నటి కూడా సగమే (2)
10. తెలంగాణ యాసలో పైకి ‘వెళ్తున్న’ అంటున్న ఈయన 9 అడ్డం లాంటి వాడు (3)
11. పదేపదే ‘కాల్చేసుకునేందుకు’ ఉపయోగపడే ఉపకరణం! (3)
13. చీకటి మతము మార్పు చెందటం అవసరం (3)
14. ఇది విజృంభించే ఫలమా? (2, 2)
15. పువ్వులో వెనుతిరిగిన కలే పాత్రికేయుడిని చూపిస్తుంది! (4)
16. ఫుల్ స్టాప్ పెట్టుట కావచ్చు (4)
18. సభాసార తిరోగమన పర్యవసానమైన ఖలీభవం (4)
19. పార్వతిలో మూడింట రెండొంతులు ఆక్రమించిన శివుడా! (2)
21. తెలంగాణలో కొంచెం పాము పాకే శబ్దంలోని సగభాగం (2)
25. కాపునకు ముందొచ్చే మూడొందలు 30 నిలువును సూచించవచ్చు (3)
27. జవరాలు దాచుకున్నవి శాపాలకు విరుద్ధం! (3)
28. చిట్కాలకు ప్రసిద్ధుడైన ఇతడు చాలా వరకు షిర్డీ వాసి అనుకుంటా (3)
29. వేటలో సారు అలసిపోవడం/విసుక్కోవడం (4)
30. పాలకులందరూ 33.33 శాతం ఒక కమ్యూనిటీ! (2)
31. నవ్వు లేని నవ్వు మొదట్లో తేలికైన భూమి (2)
32. చిలవంత సర్దుబాటుతో శిరసును వొగ్గి... దీని తోక మాయమైతే స్మరించం (2, 2)
34. యాగాలు క్రమం తప్పితే సంభవించే క్షతులు (3)
35. పాటలో 19 అడ్డం తర్వాత వచ్చే దినం మంచిది (3)