నుడి-18
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: ఏప్రిల్ 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5
6 7 8
9 10 11 12 13
14 15 16 17 18
19 20 21
22 23
24 25 26 27 28
29 30 31 32
33 34 35
36
37 38
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. కాకి లోని కలవరపాటు ప్రపంచానికి దారి తీస్తుంది (4)
3. ప్రధానంగా ప్రతిష్ఠాత్మకమైన, సానుకూలమైన, దివ్యమైన, తంత్రభరితమైన అన్నిటి చేత ఇవ్వబడినది (4)
5. మెత్తని విశేషణంలో ప్రాథమికంగా దహించుకుపోయే స్త్రీ (3)
6. తిరగేసిన చిక్కులకు 38 అడ్డంలోని యాభై శాతాన్ని మినహాయిస్తే అది అదృష్టమండీ (2)
7. గృహస్థుడు రాబోయే కాలంలో మొదటి సగాన్ని మాత్రమే మిగుల్చుకోవాలి (2)
9. ఉత్తరభారతం లోని పాత ముఖ్యమంత్రి గారు చాలా వరకు మృదులం (3)
12. మామా, మామా, మామా - మరో భాష మాండలికంలో ఇవి సాధారణం (3)
14. అప్పునకు జత (2)
15. ఓ మనసా! రా. యిక్కడ మత్తుగొలిపే పదార్థముంది - ఇక్కడే (3)
17. ఆమ్రేడిస్తే చెవిలో చెప్పుకునేదాన్ని సూచించేది (2)
19. సీతాపతీ! మధ్యమధ్య రాకు మాతో (2)
20. ఒక విడుపులో ఒడుపును మాయం చేసి కైతగాడిని తీసుకురావాలి (2)
22. తల తెగిన శివాజి గుర్రం (2)
23 నడుమ ఖాళీ చేసిన పోరగాడు వెళ్లడు (2)
24. విరుద్ధంగా వచ్చెయ్. 38 అడ్డంలో చిచిచి - ఇవి లేకుండా వెనుతిరగాలి (2)
26. కాలరు మొదట్లో కొంచెం కత్తిరిస్తే కనిపించే రంగు (3)
28. గానం లేని పాటవాలు కొన్నిసార్లు ఏటతో కలిసి రావచ్చు (2)
29. తియ్యని పదార్థం కొస మార్పుతో కేక వేసె (3)
31. హిహిహి, వీటిలో ఒకటి అపస్మారంలో ఉంది కనుక, ఇది ఈశాన్య భారతంలో దర్శనమిస్తుంది (3)
33. సగభాగంలోని సగభాగం అటుదిటుగా వచ్చి తెచ్చిన ఉబ్బసం (2)
35. 7,7,7 - ఇటువంటివి కొన్ని సంవత్సరాలు (2)
36. ప్రసిద్ధ ఫిడేలు కళాకారుని ఇంటిపేరు ఎర్ర దేవాలయమా? (3)
37. చేప తన మునకలో పడిపోవడం (4)
38. ఇవి వెంట్రుకలు. చిచిచి - వీటిలో ఎదురుగా రాకు (4)
1. కిందినుండి పైకి వచ్చిన మునకలో చూచుట. ఆవున్నా లేకున్నా అదే అన్న మాట. (4)
2. అణచుకున్న నవ్వు తీరును సూచించేది (3)
3. ప్రతి భర్తలోనూ ఉండే నైపుణ్యం (3)
4. మొదట్లో వికారం చేరితే విగత భర్తృకలను చూపించే పోగులు (4)
6. కలిసిపోవడమే కానీ, నీలకాయం లోంచి నిష్క్రమించాలి (2)
8. మీవి కానివి మీదకొచ్చాయి (2)
10. పోలీసులకు అవసరమైన దీనికోసం మిశ్రమమైనవి చిన్న పాత్రలా? (3)
11. ఒక వంటకపు విశేషణానికి మార్పు చేయగా భయం లాంటిది ఏర్పడింది (3)
13. అదనంగా రెండు కొమ్ములను తగిలించుకున్న అస్థిసారం నీరసమైన ఏడ్పు లాంటిదాన్ని సూచిస్తుంది (3)
14. కుదురుగా రాసే మిస నో వంటిదే (4)
15. సంఘసంబంధమైన జిల్లా కలెక్టరు సారు ప్రాథమికంగా కలగాపులగమై, మాతో కలిసి రావాలి (4)
16. కిందనుండి పైకి కారు పోక యిటు పాము వేసేది మాయమైంది కాబట్టి, మిగిలింది ఇక యుద్ధమే (2, 2)
18. కృత్రిమ కేశగుచ్ఛాలు సక్రమంగా రావసలు (4)
19. ఆవారాలు భార్య లేకుండా పైకి వచ్చి చూపించేది రెడ్డిలాంటి విశేషణమా? (2)
21. రవి గాడు మధ్యమధ్యన మాయమయ్యాడు కనుక విడిచిపెట్టు (2)
25. పెళ్లి కాని అమ్మాయి. ఈమెకు మా రికమెండేషన్ అవసరం. వెతికితే ఇక్కడే దొరకొచ్చు (3)
27. గీతలకీ యిస్థారు తారుమారైన లెవెల్ లేకుండా (3)
28. అడవి పందిగారి భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు (3)
29. జాలి అనే వణుకు (4)
30. ఎండాకాలంలో ఎక్కువగా వస్తాయట ఈ గడ్డలు (2)
31. చికెన్ షాపులో, మంచానికి ఉంటాయివి (2)
32. ఈ జంతువులు మావే, మంత్రశక్తి కలవి (4)
34. వంచకుడి విశేషణం లేకుండా అస్తవ్యస్తంగా ముసలాయన ప్రదర్శించే నమస్కారం తెలుగువారిది కాదు (3)
35. లోన వ్యాకోచంతో ఏడ్చి...(3)