నుడి-21
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: జూలై 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5 6
7 8
9 10
11 12 13 14
15
16 17 18
19 20
21 22
23 24
25 26
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. ఆకులు లేనిదా ఈ అమ్మాయి?/అతివ? (3)
3. ఉదాహరణకు బంగాళాఖాతం - ఒక నీటికుప్ప (3)
5. చిన్నది, మేదరి అల్లేది (3)
7. నల్లి కతను మొదట్లో బరువు చేసి, క్రమీకరించి తెచ్చుకున్న సొంత అమ్మ (4)
8. నోట్లేస్కుంటం సూడుండ్రి, గది పొక్క వడి సక్కగ లేదు. సక్కగ జేశి సూపెట్టాలె. (4)
9. పొట్టి టీచరుకు ఇక్కడ వ్యత్యస్తంగా ఉంది (3)
11. చాలా వరకు మరను దాచుకున్న రక్షణ (3)
13. మాతో జత కలిసిన తుపాకి నిద్రతీరు (3)
15. కొత్త సంవత్సరం (3)
16. ఆ వదనానికి వ్యతిరేకంగా ఉండే దీనిలో మంచు ఉంటుంది బహుశా (1, 2)
17. పెన్ను రాకముందు వాడుకలో ఉండినది ఇదేనా? (3)
19. కొంత మా షర్టులో కొంత వినోదానికి కారణమయ్యేది (3)
21. రాజుగారి పుత్రిక కోసం మా వూరి పొలిమేరల ముందు వచ్చెయ్యకు (4)
22. అరుదైన పక్షుల హృదయం లేని రాల సంచయం సర్దుకోవాలి (4)
23. ఈ పుస్తకం ప్రశంసనిస్తుందనుకుంటా (3)
25. మోసాలకు దారి తీసే ఒక రకమైన చప్పుళ్లు (3)
26. ఒక అలంకరణ కోసం తప్పకుండా రాయాల్సిన వాటిలో మొదటిది లిఖించు (3)
1. M. V. కప్ప అసంయోజనంతో అటుదిటుగా ఏర్పరచిన వ్యాకరణ పుస్తకం (5)
2. లైటు లేని ఉపగ్రహం - దీన్ని కప్పుకోవచ్చు (2)
4. తెరిస్తే కాల్చివేసేది (3, 2)
5. తోక లేని చిన్న కుక్క (3)
6. చవకగా చివర కత్తిరించగా అవకతవకగా దీని తర్వాత లాలు కుండ సర్దుకుని రావచ్చు (3)
10. రజత శైలమా? పితృవనమా? (5)
12. ద్వయముకన్న పెద్దదాని కోసం చిత్రకాయము కాచి తొలగించాలి (3)
14. సాధారణంగా సగంతో కలిసివచ్చే వ్యాయామం రకం (3)
16. వయసే శిల అట కనుక, దానితోనే సిద్ధించాయట (5)
18. యిక పిలవాలి అనంతంగా. ఆనక కలగలిపి శతాధిక గ్రంథకర్త ఇంటిపేరును తీసుకురావాలి (5)
19. సమయానికి తల నరికి, తారుమారుగా ఉన్న చక్రవర్తిని అదృశ్యం చెయ్యాలి (3)
20. సేటు తాగేది ఒకటే కావచ్చు (3)
24. తలక్రిందులైనా తాత్పర్యం అదే పితామహా (2)