నుడి - నవంబర్ 2015
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి నవంబర్ 'నుడి' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: నవంబర్ 20, 2015.
 
1 2 3 4 5
6
7 8 9 10
11 12
13 14 15 16 17
18
19 20 21 22
23 24
25 26 27 28 29
30
31 32

ఆధారాలు
అడ్డం నిలువు
1. సమయాన్ని చూపే సాధనం కోసం రండి, యాగ సవరణ చెయ్యాలి (4)
4. మొదలూ చివరా లేని భజన తర్వాత సక్రమంగా మారిన అపరాధ రుసుము (4)
6. పాడు వాముల కలగలుపుతో వీడు సర్పాలను ఆడిస్తాడు (3, 2)
7. వాటాకు అటూ యిటూ అనంతంగా కలుగు తలుపులు (4)
9. పుపుపు గుగుగు పక్షులు (4 )
11. అరవైలో సగం లేదు (1)
12 .ఈ మంతుడు ధనవంతుడు (1 )
13. పిట్టల్ని తరిమే సాధనం కోసం సగం సెలయేరు ముందు వేగాన్ని తీసుకురావాలి (4)
16. మనసుకు సంబంధించిన కంటి ఆనవాలు లేని కంకటి ముందు మాసిన తడబాటు (4)
18. దోమలాంటి దాని గోల (3, 2)
19. ఈ వాహనం లావుగా ఉండదు కనుక రైతుల రకాన్ని చూపిస్తుందేమో (2, 2)
21. నేటి యుగాన్ని సూచించే దీనికోసం లంక కాలి సర్దుకోవాలి! (2, 2)
23. ఈ మాత అల్లుడు (1)
24. π (1)
25. కంబాస్తమ క్రమీకరణ గ్రాంథిక తలకాయా? (4)
28. శివుని కోసం బతిమాలి చూసితిని (2, 2)
30. కుడిలో తిరగేసిన లాకులు ఉన్న విలాసవతి (5)
31. లోహ విహంగాలు మావి నాలుగే అనంతమై సర్దుకోవాలి (4)
32. వంకరటింకరగా మిగులున్నా ఇవి విష సర్పాలే (4)
1. కలగల్పి కన్నులతో చూపెట్టే సాహిత్య ప్రక్రియ (3)
2. ఏతాము లేని ఏరంతా పాములు… ఇవి కలపను ముక్కలు చేస్తాయి (3)
3. గ్రాంథికంలో ఉన్నాను (3)
4. గిరిజ కడుపు కరిగిపోయి భయం నెలకొంది (3)
5. కొనగలుగువాడు దాచుకున్న ఆభరణాలు (3)
8. జీలకర్రలాంటిది ఇచ్చి వేడిమిలాంటిది మార్పుకు లోనైంది (3)
10. పన్నగుని సిగలో పన్నగచ్యుతి నాట్యం చేసి...(3)
13. కరువొచ్చినప్పుడు బీదవాళ్లు కొందరు ఇది పోవలసే వస్తుంది (3)
14. ఆరు కీలలలో అటుదిటుగా వున్న గీత తెలుగువారిది కాదనుకుంటా (3)
15. క్షుధ కోసం ఆ కలివిడిలో విడిపోవాలి (3)
16. ఈ ద్రవ్యాల వాడకంతో నేరాలు పెరగొచ్చు కద మామా! (3)
17. పుర్రె తారుమారు చేసిన గుడిసె కింద సగం పొలం (3)
20. అర్థరహితమైన దీనికోసం కాస్తన్న కలగాపులగం కావాలి (3)
22. వాహన వదనం అని పొరబడకండి, ఇది ధనుస్సు (3)
25. పైకి అనంతంగా వినమని ఈ విజ్ఞప్తి (3)
26. తంబాకులు ముప్పావు భాగం కత్తులే (3)
27. కొన్నిసార్లు కుంటివి అయిన నెపాలు (3)
28. ఉష్ణం ప్రాధేయపడి కొనసాగింపబడింది (3)
29. ట్రిక్కులు కాదు, రైటు గుర్తులు (3)