నుడి - డిసెంబర్ 2015
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి డిసెంబర్ 'నుడి' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: డిసెంబర్ 20, 2015.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5
6
7 8 9 10
11 12
13 14 15 16 17
18
19 20 21 22
23 24
25 26 27 28 29
30
31 32
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. మొదలు లేని చారల వంక మరోలా మధుర ధ్వని (4)
4. కవిత్వంలో ఉండాల్సిన ఫిలాసఫీ ‘స్టోరీ’ (4)
6. ఒకసారి వెళ్లి మళ్లీ వెళ్లడం మరణించడమే! (5)
7. మంచి కన్నులు గల స్త్రీ మధ్యలో అటుదిటుగా చలో అంటుంది (4)
9. ముందొకరికి ఎదురొచ్చి, తర్వాత మరొకరికి ఎదురొస్తే సమస్యే అనుకుంటా (4)
11. కులప్రసక్తి లేని షోకుల ప్రదర్శన (1)
12. రాజ్యాలలో కనపడే అల్లె తాడు (1)
13. అనగలిగిన 1456. ఈ వేళనె చూడాలీ అని పాట (4)
16. కష్టం అటుదిటు కాగా వచ్చే చప్పుడు (2, 2=4)
18. మాము వలన మరో రూపంలో చలించునది (5)
19. కొందరు కృద్ధులు ఇలా ఉడికిపోతారు (2, 2=4)
21. ఈ కరం ఎడమది కాదు కనుక తాగెయ్ (4)
23. పరమోత్కృష్ట కేంద్రకమైన పాత కవి (1)
24. పోరాటం మధ్యన వచ్చెయ్ (1)
25. పాపీ! కల మార్చు. పసిపాపలకు ఇది అవసరం కావచ్చు (2, 2)
28. జపాల తంతు అనంతం, కొత్తరూపం. జోగ్ ఒక ఉదాహరణ (4)
30. తండ్రిగారి అడవి శ్మశానం (2, 3=5)
31. మూడింట రెండొంతులు సరిగ్గా సెలవడిగితే రైతులకు అవసరం (4)
32. గాలివాన కకావికలు చేస్తే బాధ పడ్డావా? (4 )
1.గ్రామ్యంలో గ్రామీణ నిరుపేదల ఖర్చు (3)
2. మాచన మాను వంచేస్తే మోసమే (3)
3. పోలు (1, 1, 1)
4. చర్మానికి రాక్షసి (3)
5. ఉరి తీసేవాడు తలకు శత్రువా? (3)
8. ప్రాంగణం పైకొచ్చిన కౌగిలిలో ముప్పావు భాగం సవరణ (3)
10. గిట్టుట కాదు, సమీపించుట (3)
13. సగానికి లోయ (3)
14. నవ్యత యావత్తు అదృశ్యమైననూ కొత్తదిగనే యుండును (3)
15. వాదన సాధనమే కాని వంపు తిరిగి వుండదు (3)
16. డప్పులాంటి దానికోసం వత్తు లేకుండా పైకి కుమ్ముట (3)
17. వంటపాత్రను చూపేది ఒకడా యిద్దరా? (3)
20. ఈ చెట్టు తల్లుల తడబాటు (3)
22. కలపడమా? కొంచెం మరిచేరు పాపం (3)
25. దివంగతుడైనవాని శరీర వర్ణన (3)
26. ఆవు ఒక గుడి లేకుండా కలిపి మార్పు (3)
27. అడవి పైన కొంత మీద సువాసన గలది (3)
28. పాత నటికోసం అల్లకల్లోలమైన జనము (3)
29. తన్నెదవా, నూలు పోగా? (3)