‘ అరిపిరాల సత్యప్రసాద్ ’ రచనలు

కోపకచ్చ

కోపకచ్చ

అర్థాలు అడగకుండా వుంటానంటే ఒక కథ చెప్తాను.

వాతాపి అని ఒకడుండేవాడు. వాడు చేసేది ఓ పెద్ద కంపెనీలో పెద్ద వుద్యోగం. పెద్ద వుద్యోగం చేసేవాడిని వాడు వీడు అనకూడదు కదా. అందుకని ఆయన, వారు లాంటి పదాలు వాడదాం ఇక నుంచి.

ఏం? ఆయనగారు ఉద్యోగం చేస్తున్నారు కదా. అందువల్ల నెల నెలా జీతం వస్తోంది. ముఫై వేల ఐస్ క్రీమ్ లు జీతంగా ఇచ్చేవాళ్ళు. నెల ముఫై రోజులు అది కొంచెం కొంచెంగా కరిగిపోతూ వుండేది. శనాదివారాలు కాస్త ఎండ ఎక్కువ కాసేది. ఓ నాలుగు ఐస్ క్రీములు ఎక్కువ కరిగిపోయేవి. నెలాఖరుకు వచ్చేసరికి రెండో మూడో పుల్లైసులు మిగిలేవి.

ఇలా…
పూర్తిగా »

డీవోయం

డీవోయం

సరిత నాకు జాయిన్ అయినప్పటి నుంచీ తెలుసు. ఇంకా చెప్పాలంటే జాయిన్ అవడానికి ముందే తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయిని రిక్రూట్ చేసిన పానెల్ లో నేను కూడా వున్నాను.

సీనియర్ అసోసియేట్, డాక్ ప్రాసెసింగ్ డిపార్ట్ మె౦ట్.

మెయిల్ చివర వున్న సిగ్నేచర్ చూసి “ప్రమోషన్ కూడా వచ్చిందన్నమాట” అనుకున్నాను.

నేను మొన్నటి దాకా రిక్రూట్మెంట్ మాత్రమే చూస్తుండటంతో ఆ వివరాలు ఏవీ తెలియలేదు. ఈ మధ్యనే రీ స్ట్రక్చరి౦గ్ చేసి నన్ను జనరలిస్ట్ ఎచ్ఆర్ లో వేశారు.

మెయిల్ మొత్తం మళ్ళీ చదివాను. డాక్ ప్రాసెసింగ్ వీపీ వర్థమాన్ నేగీ మీద కంప్లెయి౦ట్.

అతనికి వ్యతిరేకంగా మాట్లాడటం అంత తేలికైన విషయం…
పూర్తిగా »

వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్

వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్

అంకుర్

మొదటిసారి అలా అనిపించగానే భయం వేసింది.

నేను వాళ్ళింటికి వెళ్ళిన తరువాత చాలాసేపు రష్మీ గురించే మాట్లాడిందావిడ.

“పేరుకే కూతురు. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్” అంటుంటుంది ఎప్పుడూ. “ఎలా వుందో ఏమిటో మలేషియాలో” అని కూడా అంటూ వుంది. అప్పటికి రష్మీ మలేషియా వెళ్ళి రెండు రోజులే అయింది.

కొద్దిసేపటి తరువాత నా కళ్ళముందు వున్న మాధవి స్థానంలో రష్మీ కనపడటం మొదలైంది. అప్పుడే భయం వేసింది.

నాలుగు నెలల క్రితం రష్మీ ఇంటికి రమ్మని చాలా బలవంతం చేసింది. అప్పటికి మేము ప్రపోజ్ చేసుకోని వారం కూడా కాలేదు. అంత త్వరగా ఇంట్లో వాళ్ళకి తెలియడం ఎందుకు అంటే –…
పూర్తిగా »

బ్యాక్ స్పేస్

బ్యాక్ స్పేస్

సైలెంట్ మోడ్ లో వున్న మొబైల్ ఫోన్ గర్‍గర్‍ర్ అని శబ్దం చేసింది. రేఖ దగ్గర్నుంచి మెసేజ్. సమాధానం ఇవ్వాలా వద్దా? టైప్ చేసి పంపకుండా ఆగిపోయాను. బ్యాక్ స్పేస్ నొక్కాను. ఒక్కో అక్షరం చెరిపేసుకుంటూ వెనక్కి వెనక్కి వెళ్ళింది కర్సర్. నాలుగో గ్లాస్ విస్కీ గొంతులో నుంచి జారింది. మొదటి పెగ్గులో వున్న వెచ్చదనం దాంట్లో లేదు. ప్రేమకి విస్కీకి వున్న కామన్ లక్షణం అదేనేమో! నా బతుక్కి కవిత్వం ఒకటి. థూ..!! సెల్ ఫోన్ వైపు చూశాను. ఇంకా వెలుగుతూనే వుంది. "ఎక్కడున్నావు?" అని అడుగుతోంది. ప్రశ్న సంభాషణగా మారుతుందేమోనని ఎదురు చూస్తోంది.
పూర్తిగా »

యు ఆర్ సెలక్టెడ్

యు ఆర్ సెలక్టెడ్

“డామ్లిన్నున్ లాయింగ్టంబమ్” సీవీ మీద వున్న ఆ పేరును రెండు మూడుసార్లు మళ్లీ పలికితేగానీ నోరు తిరగలేదు అర్చనకి. ఆ పేరుగల వ్యక్తి లోపలికి వచ్చాడు.”గూర్ఖా లాగా వున్నాడు” ఆమెకు వచ్చిన మొదటి ఆలోచన. పక్కనే వున్న వైస్ ప్రసిడెంట్ సావంగికర్ చిన్న గొంతుతో “అరే షాబ్ జీ” అని అర్చన వైపు చూసి కన్నుకొట్టి నవ్వాడు. ఇంటర్వ్యూ మొదలైంది.

అతనిది మణిపూర్ లో ఇంఫాల్ దగ్గర చిన్న ఊరు. పెద్ద కుటుంబం. చిన్న సంపాదన. వుండీ, లేక ఎంతో కష్టపడి ఎం.బీ.యే. దాకా వచ్చానని చెప్పాడు. ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నాడు కానీ ఎంతో జాగ్రత్తగా వింటే కానీ అది ఇంగ్లీషని అర్థం కావడం లేదు.


పూర్తిగా »

దైనందినం

దైనందినం

తలుపు మీద దబదబమని చప్పుడైంది. ఉలిక్కిపడి లేచాడు లవ్. కళ్ళు పూర్తిగా తెరిపిడి పడలేదు. మళ్ళీ దబదబమని చప్పుడైంది. రెండు క్షణాలు అలాగే వుండిపోయాడు. తరువాత అర్థమైంది. ఆ రోజు ఆదివారమనీ, తాను తొమ్మిదైనా ఇంకా నిద్రపోతూనే వున్నాడనీ.

ఆ తలుపు కొడుతోంది తన అత్తగారేనని కూడా అతనికి తెలుసు. వెళ్లి బెడ్ రూమ్ తలుపు తీసాడు.

“క్యా హై మాజీ?” అన్నాడు కళ్ళు నలుపుకుంటూ.

అతనికి తెలుగు అర్థం కాదు. ఆమెకు తెలుగు తప్ప వేరే భాష రాదు. “టిఫిన్… టిఫిన్… రెడీ..” అంది చేత్తో తింటున్నట్లు అభినయిస్తూ. నిజానికి ఆమె మాట్లాడిన రెండు పదాలు ఇంగ్లీషు పదాలే కాబట్టి అతనికి అర్థం అవుతుంది.…
పూర్తిగా »

కబ్జా

కబ్జా

విజయ దాన్ని చూడగానే కోపంతో ఉగిపోయింది. అన్నాళ్ళుగా తనకు అందాల్సిన సుఖాన్ని బలవంతంగా లాగేసుకున్నారన్న భావన ఆమెను కుదిపేసింది. కోపంతో పళ్ళు పటపట కొరికి చేతిలో చీపురును కిందపడేసింది. పైకి దోపిన చీర కుచ్చిళ్ళను కిందకు జార్చి పరుగులాంటి నడకతో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది.

నిజానికి ఆ ఇంటిని ఇల్లు అనడానికి కూడా మనసొప్పదు విజయకు. ఉండేది ఒకటే గది. దానికి ఆనుకోని వుండే వంటగదిని కూడా ఒక గది కింద లెక్కేస్తే రెండు గదులు. ఈ చివరి నించి ఆ చివరకు పద్దెనిమిది అడుగులు. ఇంకో వైపు ఇరవై అడుగులు. అందులో, ఒక మూల వుండే టీవీ, ఇంకో గోడవైపు వుండే…
పూర్తిగా »

అసమర్థుని ప్రేమయాత్ర

అసమర్థుని ప్రేమయాత్ర

ఆమె చనిపోయింది.

అవును అంతే…! ఆమె చనిపోయింది… ఆ చిన్న వాక్యంలోనే గూడుకట్టుకోని వుంది నా విషాదమంతా. పన్నెండేళ్ళ సావాసానికి, ప్రేమకి చరమగీతం పాడేసి వెళ్ళిపోయింది గీత. వెన్నలలో తడిసిన మా మనసుల తడి ఆరకముందే చీకటైపోయింది. నా చెవిలో గుసగుసగా చెప్పిన రహస్యాలకి అర్థం నేను తెలుసుకునేలోపే తనే ఒక రహస్యమైపోయింది.

నేను అలాగే నిలబడి చూస్తున్నాను.

ఇప్పుడు నా ఎదురుగా వున్నది ఒకప్పుడు నేను చూసిన గీత కాదు. అప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు కళ్ళ కింద ఆ నల్లటి చారలు లేవు, మందు తాగి తాగి ఉబ్బిపోయిన కళ్ళు లేవు, సిగెరెట్లతో నల్లబడ్డ పెదాలు లేవు. అప్పట్లో ఆమె ముఖంలో ఈ…
పూర్తిగా »