‘ ఎలనాగ ’ రచనలు

డబ్బాల్లో మనుగడ

నవంబర్ 2013


డబ్బాల్లో మనుగడ

ఇల్లు అనే కిటికీలున్న పెద్ద డబ్బాలో కూరుకుపోయి నివసించటం, కారు అనే ఇనుప డబ్బాలో కూర్చుని కార్యాలయానికి వెళ్లటం, ఆఫీసుగది అనే నాలుగ్గోడల డబ్బాలో పీల్చి వొదిలేసిన గాలినే మళ్లీ పీలుస్తూ పన్చేసి, ఆపై మళ్లీ ఇనుప డబ్బాలో దిగబడి డబ్బాయిల్లును చేరటం… డబ్బాలుడబ్బాలుగా మనుగడ సాగిస్తున్న డబ్బారేకుల సుబ్బారావులం మనం! తలుపులు మూసీ, ఏసీలు వేసీ మోసం చేసుకుంటున్నాం మనల్ని మనమే. మలయమారుతాలు కలయదిరిగే ఊరి బయటి వాతావరణానికి నోచుకోక బలి అవుతున్నాం గదుల్లోపలి మలినమైన గాలికి. వెన్నెల సోకని వెలితిగదుల్లో ఎన్ని హంగులున్నా అవి పరవశకరమైన ప్రకృతిస్పర్శకు సరి అవుతాయా? చల్లని రేయిలో చంద్రుణ్ని చూసి చాలా కాలమైందనే సంగతినే మరుస్తాం. పిండారబోసినట్టున్న…
పూర్తిగా »

వృక్షం

అక్టోబర్ 2013


వృక్షం

మూలం: మరియా లుయిసా బొంబాల్ (చిలీ)
తెలుగు అనువాదం: ఎలనాగ

పియానో వాద్యకారుడు కూర్చుని, కృతకంగా దగ్గి, ఏకాగ్రతను ఆవాహన చేసుకున్నాడు. ఆ హాలును వెలిగిస్తున్న కరెంటు దీపాల గుచ్ఛం నుండి వెలువడే కాంతి సాంద్రత క్రమంగా తగ్గుతుం టే ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక సంగీత స్వరమాలిక అణకువ నిండిన సాహసవంతమైన చంచలతతో రూపం పోసుకుంటున్నది.

‘మోట్జార్ట్ స్వర రచన కావచ్చు’ అనుకున్నది బ్రిగిడా. ఎప్పటి లాగానే కార్యక్రమ వివరాల కార్డును తీసుకోవటం ఆమె మరచి పోయింది. ఈ సంగీతం మోట్జార్ట్ దో లేక స్కార్లాటిదో కావచ్చు అనుకున్నదామె. ఆమెకు సంగీతం గురించి అంతగా తెలియదు. అందుకు కారణం ఆమెకు…
పూర్తిగా »

పరిహారాత్మక తారక మంత్రం

09-ఆగస్ట్-2013


సంగీతాత్మకం కాని శబ్దాల పరంపరతో అవస్థ పడటం అనుదిన కార్యక్రమమైంది నాకు. బండరాళ్ల మీద దొర్లే బండిచక్రాల చప్పుడుకు భయకంపితుణ్నవుతాను. కాయితం చిరిగిన సవ్వడి నా కర్ణభేరికీ హృదయానికీ కలిగించే బాధ వర్ణనాతీతం. ఇనుప అలమరాల తలుపులు తెరిచిన చప్పుడు ఇనుమడింపజేస్తుంది నా చెవులనుభవించే చిత్రవధను. వంటింటి గిన్నెల శబ్దం నన్ను వణికించిన సందర్భాలెన్నో! మనుషుల అరుపులతో కినిసి మానని గాయాలతో పొగిలి మధన పడిపోతుంది మనసు. ఆటోరిక్షాల స్పీకర్ల కఠోర శబ్దాలు అశనిపాతాలై తగులుతుంటే సున్నితమైన శ్రవణేంద్రియాల మీద ఎన్నో గునపాలు దాడి చేసినట్టై సన్నగా మూల్గుతుంది హృదయం. వాహనాల రొదతో ఆహవ వాతావరణం ఆవహించినట్టై ఊహల ఉన్మీలనం ధ్వంసమౌతుంది. రకరకాల యంత్రాల చప్పుళ్లు…
పూర్తిగా »

ప్రార్థన

ఓ దీర్ఘ వర్ణనాధీశ్వరా
నేనెక్కడ మొదలెట్టాలో తెలియ జెయ్యి
నేను చెప్ప వలసినంత చెప్పాక
ఆపేలా చెయ్యి
అతిగా శబ్దించే నా కంఠస్వరాన్నీ
కీచుమనే నా గుసగుసల్నీ
క్రమబద్ధం చెయ్
తామసం నిండిన
ఆ దీర్ఘమైన పగటి వేళల్లో
నాకు పదాలను ప్రసాదించు
పోగొట్టుకున్న భూఖండాలను
నా నాలుక మీద పొందేందుకు
అనూహ్యానంద సంఘటనల తాలూకు
అనుగ్రహాన్ని అనుమతించు
నాకు నిశ్శబ్దం తాలూకు ప్రజ్ఞనిచ్చి
స్వేచ్ఛగా తేలిపోయేలా చెయ్ నన్ను

తెలుగు అనువాదం: ఎలనాగ
(జెరీ పింటో భారతీయ ఆంగ్లభాషా కవి. మీడియా…
పూర్తిగా »

పసిరిక పిట్టలు

సూర్యాస్తమయం తగిలి
కిటికీ మండుతోంది
కాని ఆమె దేన్నీ చూడ్డం లేదు
అసలామె నిజానికి అక్కడ లేదు

తల్పం మీంచి ఆమె గాల్లో పైకి లేచింది
ఆమె స్వప్నాల్ని పట్టుకోవడానికి
పక్కనే నిల్చున్నాడొక హిప్నొటిస్టు
ఆమె వణుకుతోంది
రాత్రి పూట నయనాలను
మూయడానికి జంకుతోంది

ఆమె కనురెప్పలు మండుతాయా
చక్షువుల్లోంచి చిత్తరువులు
తప్పించుకు పోతాయా
పసిరిక పిట్టల వంటి ఆమె కన్నులు
ఎగిరి పోతాయా

అప్పటి దాకా మెలకువగా వున్న హిప్నొటిస్టు
ఆఖరుకు నిద్ర లోకి జారుకున్నాడు
ఆమె గాల్లో తేలుతూ అటూ యిటూ కదుల్తోందిపూర్తిగా »

ఆల్కెమీ రహస్యం

24-మే-2013


మనసుకుండలో కవ్వం కదిలి
కడుపులో సుళ్లు తిరిగాకే
కవిత్వం ఒలకాలి బయటికి
హృదయాన్ని ఊగజేసే
భావతీవ్రతే పునాది అయి
అందమైన ఊహల సౌధాలు
తెలివిడి నేత్రాల ముందర
నిలబడాలి నిటారుగా
పొగలకుండా పగలకుండా
పులుగు పిల్ల రాదు గుడ్డు లోంచి బయటికి

శుష్కశూన్య ఇసుకతిన్నెల మీద
చిగురింతల ఆశలు వృథా అవుతయ్
బీడువడ్డ కవన మరుభూమిలో
పదడంబాల ఎరువులు పని చేయవు

ఆల్కెమీ రహస్యం అందరికీ తెలియదు
దుక్కి దున్ని పండించే కళాసేద్యం
పూల పరుపులు పరచిన బాట కాదు
మనోమాగాణికి ఆరుతడి పెట్టిపూర్తిగా »

ఇష్ట యాతన

19-ఏప్రిల్-2013


గుండె మీద నిరంతరం
ఒక బరువైన దిమ్మ
కుమ్ములో చెక్కిన మనసు
సన్నని సెగ మీద ఆగదు కాలుతూ
బొమికల లోతుల్లో వెలితిక్రిమి
ఎప్పుడూ కొరుకుతూ కదుల్తూ
చంపదు చావనివ్వదు
తరగని దాహం తీరదు ఎంత తాగినా -
సగం నిండిన కప్పునీళ్ల కనపడని యాతన
ఖాళీగా వున్న మరో సగం వెక్కిరించే భూతం
చిన్న ఉల్లాసాల బుడగల్ని చిట్లజేసే
పెద్ద వైఫల్యపు సూది
శూన్య ఎడారులకవతల మరులు గొల్పుతూ
సీతాకోక చిలుకల పంట

రాయకపోవటం బాధ
రాయటం ఇంకా పెద్ద ప్రసూతి బాధ

పూర్తిగా »