‘ డా. కాసుల లింగారెడ్డి ’ రచనలు

ఏకాంత మధుసేవ

ఏకాంత మధుసేవ

సహచరులెవ్వరు లేకుండానే
పూకొమ్మల మధ్య
ఒంటరిగా కూర్చొని
మధుపాత్ర చేతికి తీసుకుంటాను

నేను చెయ్యెత్తి
చంద్రునికొక ఛీర్సుకొడతాను
అప్పుడు,
తను,నేను, నా నీడ
కలిసి ముగ్గురమవుతాము.

కాని,
చంద్రుడు త్రాగడు
నా నీడ నిశ్శబ్దంగా
నన్ను అనుసరిస్తుంది

నా నీడతో, చంద్రుడితో
నేను
సంతోషంగా
వసంతకాలపు అంచులదాకా
ప్రయాణిస్తాను.

నేను పాడితే
చంద్రుడు నాట్యం చేస్తాడు
నేను నృత్యిస్తే
నా నీడ కూడ నాట్యం చేస్తది.

మేము నిశ్చింతగా
జీవన సంతోషాల్ని పంచుకుంటాము
తాగిన తర్వాత
తమతమ…
పూర్తిగా »

ఒక కాలం కన్న కవి

ఒక కాలం కన్న కవి

ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఏ సమాజంలోనైనా కవులకు అత్యంత ప్రాధాన్యత వుంది. చాలా సందర్భాల్లో కవులు సమాజ గమనాన్ని నిర్దేశిస్తూ వస్తున్నరు. చరిత్ర పుటలు తిరగేస్తే కవులే తత్త్వవేత్తలు, తత్త్వవేత్తలే కవులుగా తీర్చిదిద్దబడ్డ వైనం గమనించవచ్చు. ఒక్క మినహాయింపును మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ప్లేటో గురించి – కవులని నిషేధించాలన డానికి ఆయన కారణాలు ఆయనకు వున్నయి. కాని కవిత్వం యొక్క ప్రాధాన్యత ఆయన తర్వాత కూడా కొనసాగింది. కారణం,

Poetry is simply the most beautiful, impressive and widely effective mode of saying things and hence its importance- Mathew Arnold

ఆధునిక వచన కవిత్వం…
పూర్తిగా »

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలపు కవి

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలపు కవి

ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. ఆత్మగౌరవ పోరాటాలు లావాలా ప్రవహిస్తున్న కాలం. అమూర్త వాగాడం బరంలోంచి చిత్రిక పట్టిన స్పష్టమైన కళల, కలల రేఖలు విచ్చుకుంటున్న కాలం. నన్నయ, చిన్నయల గ్రాంధిక వ్యాకరణాల సంకెళ్ళు తెంపుకొని స్థిరపడ,్డ గిడుగు పొడుగు భాష దృతరాష్ట్ర కౌగిళ్ళ దుర్మార్గాన్ని గుర్తించిన కాలం. తరగతిగది భాషను ధిక్కరించి ఇంటి భాషను నెత్తికెత్తుకుంటున్న కాలం. మనిషి ఆత్మన్యూనతల బురఖాల్ని చీల్చుకొని,అవమానాల మొండిగోడలు బద్దలుకొట్టుకొని తన్ను తాను నిఖార్సుగా నిలబెట్టుకుంటున్న కాలం. ఇగో, ఇట్లాంటి కాలపు ‘ఎగిలి వారంగ’ మన పొన్నాల బాలయ్య ‘దందెడ’ భుజానేసుకొని కవిత్వసేద్యపు దారుల్ల సాగుతున్నడు.

వలసవాదం, నయావలసవాదం, అంతర్గత వలసవాదం, మనువాదం, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఎన్ని రకాల…
పూర్తిగా »

అత్తర్ల గుబాళింపు ‘అధూరె’

అత్తర్ల గుబాళింపు ‘అధూరె’

స్త్రీ, దళిత, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు లేని అనేక ప్రతిబంధకాలు ముస్లిం మైనారిటీ వాదానికి ఉన్నాయి. దేశ స్వాతంత్య్రోద్యమ నాయకులుగా చలామణీ అయిన భారత దళారీ పాలకవర్గం వలసవాదుల బాట నడిచి కొంత, కుట్రలకు తలొగ్గి కొంత ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకొని దేశవిభజనకు చేతులెత్తినరు. విభజన జరుగకూడదని కాదు, అది మతప్రాతిపదికగా జరగడం దారుణం.అప్పుడు చెలరేగిన హింస, మారణహోమం, అమానవీయ ఘటనలు మళ్లీ అదే పాలక వర్గాలకు ఓటు బ్యాంకుగా మారినవి. వలసవాదులనుంచి విస్తరణవాదాన్ని ఒంటవట్టించుకున్న భారత పాలకవర్గాలు అటు కాశ్మీర్‌, ఇటు హైదరాబాద్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును భుక్తం చేస్తూ దురాక్రమణచేసి తమ అఖండభారతంలో కలుపుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ మిగిలిపోయిన ముస్లింలను…
పూర్తిగా »

నిఖార్సైన కవి నర్సింహారెడ్డి

నిఖార్సైన కవి నర్సింహారెడ్డి

ఉన్నతీకరించబడ్డ మాట కవిత్వ రూపమైతె, మెరుగైన సమాజం కోసం వ్యాప్తి చేసే భావధార దాని సారమౌతుంది. ఛలోక్తులు, చమక్కులు, తిట్లు శాపనార్థాలు తాత్కాలికంగా కవిత్వంగా చెలామణీ కావచ్చు.పేరు తేవచ్చు.కాని కవిత్వాన్ని సీరియస్‌గా తమ జీవితంలో భాగం చేసుకున్న కవులు భావజాలపరంగా, తాత్వికంగా తమని తాము వ్యక్తీకరించుకుంటరు. తమ కవిత్వం క్యారెక్టర్‌ను విశదపరుస్తరు.తెలుగు సాహిత్యంలో బాలగంగాధర తిలక్‌, పఠాభి, శ్రీశ్రీ,దాశరథి లాంటి అనేకమంది కవులు చెప్పుకున్నట్టు ఇగో మన ఏనుగు నర్సింహారెడ్డి కూడ చెప్పుకుంటున్నడు. ఆర్తి, నిజాయితీ, రాయకుండా ఉండలేనితనం ఈ కవిని ఇట్లా చెప్పుకునేట్టు చేస్తున్నవి.
‘వాదాల్లేని సృష్టించుకున్న వివాదాల్లేని

క్షణ క్షణం తగులుతున్న తాకుడురాళ్ళ పురులనుపరస్పరం సహకరించుకునే సమూహాల్లేని…
పూర్తిగా »

నేను – నా జ్వరము – ఆమె

ఏమైందనో, ఎప్పుడొస్తావనో
ఏదో ఒకటి
అడుగుతావనే అనుకున్నా

నా గుండె వాకిట్ల
ఏవో నాలుగు ఉపశమనపు మాటలు
చల్లుతావనే అనుకున్నా

ప్రమేయంలేని ద్వంద్వ యుద్ధంలో
పైరస్‌ పంచ్‌కు తూలి
బారికేడు మీద ఒరిగినప్పుడు
ఆసరాయై నిలబెడతావనే అనుకున్నా

ఎండి పిడుచ కట్టుకపోయిన నాలుకమీద
నాలుగు నీళ్ళ చుక్కలు
చిలకరిస్తావనే అనుకున్నా

దిగులు మేఘం దట్టంగా కమ్ముకొని
ఒంటరి చీకటి భయపెట్టినప్పుడు
కౌగిలివై కాస్తంత అభయమిస్తావనే అనుకున్నా

నా జీవితాకాశం మీద
సూర్యున్ని మబ్బు మింగేసినప్పుడు
చిరు దివ్వెవై దారి చూపుతావనే అనుకున్నా

జ్వరం వాసన దేహాన్ని ఆవరించినప్పుడుపూర్తిగా »

‘పడుగు’ కొత్త కాలమ్, ఫిబ్రవరి సంచిక నుంచి..

‘పడుగు’ కొత్త కాలమ్, ఫిబ్రవరి సంచిక నుంచి..

మమతలు,బంధాలు, ఆత్మీయతలు కాలం చేసినట్టే, తీరాల ఇసుకల మీది నురగల రాతలా కాలం చెరిగిపోయినట్టే, బహిరంతరాల్లో ఉద్యమాల ఉద్వేగాల ఉద్దీపనల్లో వెలిగిన కవిత్వం నీలో,నాలో సామాజిక ఉపరితలపు పొరల్లో, పునాదుల్లో మరణిస్తుందా? కొత్త శాస్త్రసాంకేతిక సంద్భాలు, కొత్త సామాజిక సంబంధాలు, కొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యాలు కొంత ఆజ్యం పోస్తున్నాయా? వస్తువినిమయ ప్రపంచంలో కవిత్వం కాలం చేస్తుందా? రాయడం, పత్రికాధిపతుల్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, జీతపు రాళ్ళను కరిగించి ప్రెస్‌ చుట్టూ తిరగడం, ఆవిష్కరణకు అందరి కాళ్ళు పట్టుకోవడం, కష్టపడి కాపీలను పంచడం, రివ్యూల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం కవుల్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తుందా?

సంస్కృత సమాసభూయిష్ట దుర్గంధసౌధాల్లోంచి, కులమతాల సంకుచిత చిదంబర రహస్య…
పూర్తిగా »

నా ఉద్విగ్న మానస సంభాషణ

నా ఉద్విగ్న మానస సంభాషణ

నాకు భాషమీద, భాషకున్న పరిమితులమీద అనేక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అవెప్పుడూ నేను వ్యక్తీకరించదలు చుకున్న పూర్తి భావనల్ని ప్రపంచానికి అందించడంలో విఫలమవుతున్నాయి. బహుశా ఇప్పుడు కూడా అట్లాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నాను. నా మిత్రులు ,కుటుంబ సభ్యులు చాలా మంది తరచూ నన్నొక ప్రశ్న వేస్తుంటారు.

అదేమంటే ‘నువ్వు కవిత్వమెందుకు రాస్తావ’ని. బహుశా ఇదే ప్రశ్న కొన్నిసార్లు నన్ను నేను వేసుకుంటాను. సమాధానం కూడ చెప్పుకుంటూ వుంటాను. అదేమంటే నేను రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనమెందుకంటే ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరపున నియమించుకున్న లాయర్‌ నా కవిత్వం.

“సహజ మానవునికి,…
పూర్తిగా »

నేను తెలంగాణను – 4

నాలుగు పాదాల ధర్మాన్ని
నాలుగు వందల ఏండ్ల నుంచి నిలబెట్టిన
భాగమతి ప్రేమ ప్రతీకను
కులీ కలల పుత్రికను
అనారోగ్య పీడనలనుంచి రక్షించే
ఉమ్మీద్‌వార్‌ను
నేను చార్మినార్‌ను
నేను హైదరాబాద్‌ను.

యురోపియన్‌ మొగలాయి
సంగమ కళతో
ఉత్తర దక్షణాల్లో
సలాబత్‌ జంగ్‌ పుదిచ్చిన
నాలుగేసి మహల్‌లను
చౌమల్లా ప్యాలెస్‌ను
నేను హైదరాబాద్‌ను.

వందమందిని ఒక్కసారి ఒదిగించుకునే
రోజ్‌వుడ్‌ మేజా బల్లతో
పాలరాతి పదసోపానాలతో
వెనెటియన్‌ షాండిలియర్‌లతో
వికార్‌ వుల్‌ వుమ్రా స్థిరపరిచిన
ప్రపంచ ధనైక నవాబు
అతిథి గృహాన్నిపూర్తిగా »

ప్రజలే విజేతలు

నా కనురెప్పల మీద పూచిన
ఒక ఆకుపచ్చని కల
శిశిరావరణంలో నేలరాలింది

అనేక వసంతాలుగా గట్టిపడ్డ
నాలుగుకోట్ల సామూహిక చిక్కటి ఆకాంక్ష
ఆధునిక శకుని అహంకార పాచికలకు
అడవి కాచిన వెన్నెలైంది

అవినీతి బురదలో మునిగి
అహంకార కళతో తంటుకొని
కుటిల ఇటలీ మన్మోహన గానం
అబద్దపు ఏకాభిప్రాయ చిదంబర రహస్యమైంది

మళ్లీ మళ్ళీ వంచించబడుతున్న నేల మీద
దారులెవ్వీ గమ్యాల్ని చేర్చడం లేదు
కులమతాల వెన్నెముక మీద గుద్ది
అవిప్పుడు పోరుపంక్తి భోజనశాలలైనవి

కాలం వసంతాల్ని కౌగలించుకునే వేళ
ధూంధాం దరువుల తెలంగానం తప్ప
కోయిల…
పూర్తిగా »