‘ డా. కాసుల లింగారెడ్డి ’ రచనలు

నేను తెలంగాణను-3

నేను తెలంగాణను-3

నిజాం ఖిల్లేదారు
ఖాన్‌ కలగన్న నగరాన్ని
ఉత్తర తెలంగాణ ఊపిరిని
నేను కరీంనగర్‌ను.

ఎనలేని ఘనకీర్తి హార ధారిణిని
ఎలగందుల ఖిల్లాను
కాకతీయ, బహమనీ
మొగల్‌,కుతుబ్‌షాహీ,అసఫ్‌జాహీల
అసమాన రాచనగరును
శతాబ్దాలుగా తరగని
శత్రుదుర్భేద్యపు ముద్రను.

పెదవాగు,బండవాగు,నక్కవాగులు నడిచొచ్చిన దారుల్లో
మ్రోయతుమ్మెద,వేములవాడ
ఇరుకుళ్ళ,హుస్సేన్‌మియాలు కలగూడిన గోదావరిమీద
ఎలగందుల పాదాలు కడుగుతూ
ఎడతెగని నేల దూప తీర్చే మానేరును.

నల్ల బంగారాన్ని
తీగల మీద పారించే శక్తి స్వరూపిణిని
లోకం మీద కప్పిన చీకటి దుప్పటిని చీల్చే
వెలుగుల విద్యుత్తును
మాంచెష్టర్‌ ఆఫ్‌ ఇండియాపూర్తిగా »

ఇప్పటి కవిత్వం – కొన్ని ప్రశ్నలు…?!

ఇప్పటి కవిత్వం – కొన్ని ప్రశ్నలు…?!

పారిశ్రామిక విప్లవం తెచ్చిన ఆర్థిక ప్రగతి, పారిస్‌ కమ్యూన్‌ ఎత్తిపట్టిన స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వాల భావజాలం, సృష్టి ఆవిర్భావానికి హేతుబద్ధత కల్పించిన జీవపరిణామ సిద్ధాంతం, నిలదొక్కుకున్న సూర్యకేంద్రక సిద్ధాంతం లాంటి ఖగోళశాస్త్ర పురోగతి పాశ్చాత్యదేశాల్లో ఆధునికతకు బాటలు వేశాయి. తాత్విక భూమిక మీద మార్క్స్‌,ఎంగిల్స్‌ల గతితార్కిక చారిత్రిక భౌతికవాదం ఊగిసలాటల్ని, భావవాదాన్ని తుడిచిపెట్టి ప్రాపంచిక దృష్టికి కొత్త వెలుగులు చూపింది. వలసపాలకులతో పాటు ఈ భావజాలం తెలుగు సాహితీరంగంలో ప్రవేశించింది. సాంఘిక సమానత్వాన్ని ప్రభోదించిన ఈ ఆధునిక భావజాలం ఫ్యూడల్‌సంబంధాలను దెబ్బకొట్టింది.

‘Fine art is the art of genious” అంటాడు కాంట్‌. కాని హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తిని కవినిగాని, కళాకారున్ని కాని చేసేది…
పూర్తిగా »

రోజు వారీ భాషకి దూరమవుతున్నామా?

రోజు వారీ భాషకి దూరమవుతున్నామా?

లోపలి మాట రాయాలనుకున్నప్పుడు అది నెగటి”వ్‌ షేడ్‌ లోనే వుండాలా? చెత్త కవితనే ఎన్నుకోవాలా? అట్లా కాకుండా ఒక మంచి కవితను తీసుకొని, అది అంతకంటె మంచిగ వుండే అవకాశాల్ని చూడొచ్చా? అనేది ఒక సందేహం. తెలుగు సాహిత్యంలో ఇప్పటికే విమర్శని అంగీకరించని వాతావరణం రాజ్యమేలుతున్న సందర్భంలో అది ఎట్లాంటి సంబంధాలకు దారితీస్తుంది. లబ్దప్రతిస్టులైన, అతి దగ్గరి వ్యక్తిగత సంబంధాలు గల వాళ్ళ రచనల పట్ల నా నిజమైన లోపలి మాటను బయటపెట్టడంలో నాకు ఒకింత అసౌకర్యం వుంది.అనుభవజ్ఞులు ఇప్పటికే ,నన్ను విమర్శా రంగంలోకి వెళ్ళవద్దనే సలహా ఇచ్చియున్నరు. ”ఇరువాలు” దున్నడం అలవాటైన వాన్ని కనుక ఇష్టమైన కవిత మీద ‘లోపలి మాట’ రాయడానికి సిద్దపడ్డాను.…
పూర్తిగా »

నేను తెలంగాణను-2

నేను తెలంగాణను-2

మబ్బుల మాటునుంచి
దుంకుతున్న చంద్రవంకల జలపాతం
ఎత్తిపోతల.

అనాది కాలంల
ఆచార్య నాగార్జునునికి ఆశ్రయమిచ్చి
బౌద్ధాన్ని బతికించిన బంగరుకొండ
నా నందికొండ
అతి పెద్ద ద్వీప ప్రదర్శనా దీపం.

నిండు కుడి పాలిండ్ల కుండతో
ఎండిన ఎడమ దాయితో
నిగనిగలాడుతున్న నిండుగర్భిణి
మహిమాన్విత మానవ కట్టడం
దేశ ఆధునిక దేవాలయం
నాగార్జునసాగరం.

ఆకుపచ్చ కొంగు కప్పుకున్న కచేరి కొండమీద
కొలువుదీరిన సంకెళ్ళ బావి
పోతన్నను సంకనెత్తుకొని లాలించిన
సర్వజ్ఞభూపాలుడి వసంతోత్సవ వేదిక
రాజులేలిన కొండ
గతించిన చరిత్ర నుదిటి సింధూరం
రేచర్ల…
పూర్తిగా »

నేను తెలంగాణను -1

దగాపడ్డ నేలను.
నయవంచకుల అంతర్గత వలసను
నేను తెలంగాణను.

క్షతగాత్ర సేనను
చెరబడ్డ గీతాన్ని
కాలపు రంపపు కోతకు
నెత్తురోడుతున్న దానను
నేను తెలంగాణను.

చాతుర్వర్ణపు కోరలుతీసి
చాపకూడుకు పీటవేసి
బసవడిమీద ద్విపద పురాణాన్ని ఊరేగించి
పండితారాధ్య చరిత్రమై వెలిగిన వీరశైవుడిని
ఆది కవిని
నేను పాల్కుర్కి సోమనాథున్ని.

ఇమ్మనుజేశ్వరాధముల’ ధిక్కరించి
కవితా సరస్వతికి అచ్చమైన తొవ్వ దీసిన
పరమ భాగవతోత్తముడిని
పోతానామాత్యుడిని
నేను బమ్మెరను.

నిజాం నవాబు బూజు దులప
జైలుగోడల మీద కురిసిన
అగ్నిధారను.
తిమిరంతో సమరానికిపూర్తిగా »

నేను-నా తోట-ఒక కోయిల

ఒంటరితనం
సర్రున దూరి
మెదడు సందుల్లోంచి బుసకొడ్తది

జ్ఞాపకం పొరలు చీల్చుకొని
ఎర్రరక్తకణం
బొర్ర విరుస్తది

తోడులేనితనాన్ని ఈడుస్తున్నప్పుడు
ఒక జామ కొమ్మ
వంగి భుజాన్ని తడుతది
రాత్రి ఒడిసి పట్టుకున్న మంచుముత్యాల్ని
తలంబ్రాలు పోస్తది

నిండుగా పూసిన
పేరు తెలువని పువ్వొకటి
తన్ను తాకమని
యవ్వన మకుటాల్ని చాస్తది

జీవన ప్రభాత వాకిట
రూపుదిద్దుకున్న పిందె
వయ్యారంగా వూగుతూ
ఆహ్వానం పలుకుతది

పంకిలమంటినా
పంకజమన్నా, పారిజాతమన్నా
పరవశత్వమే

నిద్రగన్నేరు
అనేక
నిదుర రాని రాత్రుల్ని
బహూకరిస్తది

కాగితపు…
పూర్తిగా »

అ’సంతోష’ం

తోటమాలి చేసిన ద్రోహానికి
చెట్టుమీది
కాయల అలక
మాగి మాధుర్యాన్ని నింపుకోవాల్సిన
పచ్చికాయలు
కచ్చగానే రాలిపోవడం

రేపటి విజన్‌ లేని
రెండు కాళ్ల సిద్ధాంత కబోది యాత్రికుడొకడు
సిగ్గువిడిచి విసురుతున్న చంద్రనిప్పులు
నా పల్లె గుడిసెల ఆశల్ని కాల్చి మసిచేస్తున్నప్పుడు
చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పలేక
‘చస్తున్నాం మీకోసం’

అలీబాబా
ఆరుగురు దొంగల
అవినీతి క్విడ్‌ప్రో కో యజ్ఞంలో
అమాయకులు నెయ్యిగా మండుతున్నప్పుడు
నడుస్తున్న ఓదార్పులేని రథచక్రాల కింద
ప్రజాస్వామ్య నేతిబీరకాయ పటాల్న పగిలినప్పుడు
చెట్టు వంగి
వేళ్ళను నరుక్కోవడం

‘చచ్చేది…
పూర్తిగా »