‘ డా. కోగంటి విజయబాబు ’ రచనలు

నాన్నొస్తే..!?

నాన్నొస్తే..!?

పడమటి పొద్దు వాలిపోతోంది. సూర్యుడి సిందూరపు రంగు సాయంత్రపు చీకటితో కలిసి విచిత్రమైన వర్ణాన్ని పులుముకుంటోంది. గూళ్ళను చేరుకోవడం ఆలస్యమైన పక్షులు ఎదురుచూస్తున్న బిడ్డల కోసం వడిగా పరుగిడుతున్నై. పగలంతా పొదల్లో అఙాత వాసం చేసిన కీచురాళ్ళు రాత్రి సంగీతపు కచేరీకి గొంతు సవరించుకుంటున్నై. ఊరంతా సాయంత్రపు కట్టె పొయ్యిల పొగ చుట్టబెడుతోంది.

చిన్ని కల్పన తన నేస్తాలతో గుడిసె ముందట ఆడుకుంటోంది. ఆనందంతో మెరిసిపోయే కళ్ళు, ఎగిరిపడే పిలకజళ్ళతో కల్పన పేదరికాన్ని వెక్కిరించే మహలక్ష్మి లాగుంటుంది. ఎనిమిదేళ్ళ కల్పనకు నాన్నంటే ప్రాణం.

పూరింటిని ఆవరించిన చీకటిని తరమడానికై కల్పన తల్లి లాగే చిన్ని దీపం కొట్టుమిట్టాడుతోంది. పగలంతా ఆనందంగా నాన్న…
పూర్తిగా »

నీవే కదా?

ఒకసారి నడిచి వెళ్ళిన
నీ పాదముద్రల చల్లని స్పర్స
మనసున ఆరక ముందే మళ్ళీ
పరిమళించే కళ్ళతో
ఎలా బంధిస్తావో తెలియదు.
పరధ్యానంలో ఉన్న నన్ను
మౌనంగా నవ్వుతూ
మంత్రమేస్తావు

ప్రశ్నై కరిగేటంతలోనే
పక్కనే చేరి
పొంతన కుదరని
రంగుల చిత్రమై ఉక్కిరి బిక్కిరి చేస్తావు

ఎక్కడంటే అక్కడే
అదాటున
గుండె పూల గంపను అటూ ఇటూ కదిల్చి
నీ గులాబి చేతుల స్పర్శతో
కురిసీ కురియని మెత్తని రంగులనన్నీ
సుతారమైన వ్రేళ్ళతో అద్దు కుంటావు

మనసంతా చిత్రపటాన్ని చేసి
తెల్లని ఆనందాన్నిపూర్తిగా »

బంధం

బంధం

పుట్టింది మొదలు ఘడియ ఘడియనూ
ముడిపెడుతూ జీవనదిలా సాగుతూ పోయేది
ఈ దారమే!

అవ్యక్తంగా మొదలైన జీవితానికి
అమ్మ దిష్టి పూస కట్టినా,
కంట నలుసుతీసేందుకు
వేడి ఆవిరి ముద్దయ్యే
అమ్మ కొంగైనా,
ఈ దారమే!

మెడకు చుట్టుకున్నా
ఇంకొకరి మెడకు చుట్టినా
ఈ దారమే!

గుప్పెడంత
గూట్లో
రగులుతూ వెలుగు
నింపే వత్తీ ఇదే!

***

ఇది దారమే కాదు-
తీయని బాధ కూడా!

భావాల
మధ్య పెనవేసుకునేదీ
అహంభావాల కుదుపుల్లో
నలిగి చిద్రమౌతున్నదీ కూడా ఇదే!

పోగులు పోగులై విడిపోయేపూర్తిగా »