‘ తల్లావఝల పతంజలి శాస్త్రి ’ రచనలు

వాల్‌ పోస్టర్

వాల్‌ పోస్టర్

గడ్డం మీద ఇంకా బొగ్గు మరకలు ఉండిపోయాయి. ఓ కంటి కొసన పుసులు వదల్లేదు. వెనక అరుగుమీద సగం పుచ్చిన చెక్క స్థంబానికి వీపు ఆనించి కూచునాడు మదార్ వలీ. సత్తుగిన్నెలోంచి గాజు గ్లాసులోకి టీ వడబోసింది బీ.

మోకాళ్ళమీద వంగి గ్లాసు తీసుకున్నాడు వలీ. కుర్చీ మీద కూచొని టీ తాగుతూ తమ్ముడి వైపే చూస్తోంది బీ. మదార్ వలీకి పదకొండేళ్ళుంటాయి. వాడికంటే ఏడెనిమిదేళ్ళు పెద్దది. ఎక్కణ్ణుంచో కాకి కోడిగుడ్డు డోల్ల తీసుకొచ్చి దొడ్లో పడేసింది. ఉదయం ఎనిమిది దాటిపోయింది.

టీ చప్పరిస్తూ వలీ అడిగేడు.

“నానెళ్ళాడా?”

తమ్ముణ్ణి చూస్తూ బీ తొట్రు పడి అంది.

“ఏమో నిషా దిగింది ఎళ్ళేడు. జేబులో ఇరవై…
పూర్తిగా »