‘ నందకిషోర్ ’ రచనలు

ఎండ మీద ఒట్టు

ఏప్రిల్ 2017


ఎండ మీద ఒట్టు


ఇంటికి రానీయని ఆట పేరు వేరు.ఊరవుతలకుర్కిచ్చె సెలవు పేరు వేరు. పొద్దున్నే తట్టిలేపే మనిషి పేరు వేరు.రాత్రైతే భయమేసే చీకటి పేరు వేరు. ఏమీ ఉండదు నేర్చుకునెట్ది. గీరలు మార్తయి-బండిదోలుడు మారదు;పైసలు మార్తయి-చేయి చాచుడు మారదు;దెబ్బలు మార్తయి- తగిలిచ్చుకునుడు గంతే;సాయితలు మార్తయి- సాయంజేసుడు గదే..

లాగు పొడుగైతది. దినం పొడుగైతది. ఎండ ఇంకింత ఎక్వనేగొడతది. మనుషులు ఇంకింత కొంచెపడుతుంటరు. ఒక్కపూట బళ్ళో నేర్శిన ఈత బరిబాతల నిన్ను బయటకు ఈడ్వదు.ఒక్కశిత్తమనుకుని చేశిన దొంగతనం కట్టేశిన చెట్లకి కనికరం ఉండదు. వయిలు ముట్టకుండా రాశిన పరీక్ష, సొప్పబెండుదెచ్చి చేశిన గాలం..సాకలి సదువుని బండకేశికొట్టదు. గొంతులగుచ్చుకొని మాట్లాడనీయదు

అనుకుంటంగాని- తాకుడుగాల్లోడు యెటు అడుగేస్తే ఏంది. తపాలాలు…
పూర్తిగా »

జతకూడిన సంగతి రాయకూడదనుకుంటాగానీ…

మార్చి 2017


జతకూడిన సంగతి రాయకూడదనుకుంటాగానీ…

నీకు తెలిసుండదు. నువ్ రాగానే పొత్తికడుపులో ఒక చీకటిగుహ పొడుచుకువచ్చి, నువ్వందులోకి మెల్లిగా పాకుతూ వచ్చి… నిదురకు ఒరిగినట్టు, నీ నిద్రతో నా శరీరం నిండిపోయినట్టు…
పూర్తిగా »

రూమి కవితలు

జనవరి 2017


రూమి కవితలు

When I Am with You

నువ్వు నేను కలిసామంటే
రాత్రంతా నిద్రరాదు.
చిత్రం!
నువ్వు రాని రాత్రి
ఎందుకో నిద్రకూడా రానేరాదు.
నిదురపోనివ్వని ఆనందాన్ని
సృష్టించినవాన్ని ఏమని కొలవను?

No better love

కారణమడగని ప్రేమకంటే
గొప్పదేది లేదు.
ప్రణాళికలేని పనికంటే
తృప్తినిచ్చేదీ లేదు.

ఇష్టంగా
ఒక మాట చెప్పనా?

తెలివినీ ఆలోచన్నీ వదిలెయ్యడంకంటే
తెలివైన ఆలోచన ఇంకోటి లేదు.

మూలం: రూమి
అనువాదం: నందకిషోర్


పూర్తిగా »

రూమి

డిసెంబర్ 2016


“The Grasses” by Rumi

ఏ గాలైతే
చెట్లని పెకిలించివేస్తుందో
అదే గాలి
గడ్డిని మురిపిస్తుంది.
దివ్యమైన అదే గాలి-
నిలువ సత్తువలేనీ
ఒదగక ఉండలేనీ
గడ్డిపూల వినమత్రకి
జోలపాడుతుంది.

***

కొమ్మలు ఎంత మొద్దుబారినా
గొడ్డలిపెట్టుకు ముక్కలవుతాయ్.
ఆకులది అదృష్టం.
వాటినది ముట్టుకోదు.
హోరుగాలి వాటినసలే
ముట్టుకోదు.

***

ఏ గాలైతే
ఉఛ్ఛ్వాస నిశ్వాసలై దేహంలో గమిస్తుందో
అదే గాలి
ఆత్మలో ప్రతిఫలిస్తుంది.
దివ్యమైన అదేగాలి-
కోపమై,శాంతమై
నశింపజేస్తూ,జీవింపజేస్తూ
ఆత్మ నిత్యత్వాన్ని
గుర్తుచేస్తుంది.

***


పూర్తిగా »

అంతా ఒకేసారి

నవంబర్ 2016


అంతా ఒకేసారి

నాలుగంటే నాలుగు వానచినుకులు చేరినందుకు సరస్సు పొత్తిళ్ళనిండా నీలికలువలు పూసి ఉండటం నువ్వెప్పుడూ చూసి ఉండవు. నాలుగు రోజుల పరిచయానికే తమ సమస్తాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన మనుషులగురించి నేనూ ఏమీ మాట్లాడి ఉండను. నిజానికి ఉన్నారు. దేవదారు నీడల్లో తలదాచుకుంటూ ఒంటరిగా ఓపిగ్గా ఎదిగొచ్చిన వాళ్ళున్నారు. వెనకనుండి పట్టుకునో,కాళ్ళకి చుట్టుకునో నిలువెత్తు దేహంపై ఎగబాకినవాళ్ళున్నారు.
పూర్తిగా »

Why?

నవంబర్ 2016


Why the words lock themselves up when you are with me
But break free to run behind you as you walk past me
Am n’ t I wrong in
Feeling they belong to me
….
While they actually
Trail you
Like clouds carrying the oceans in me!

నిశ్శబ్దమైన పదాల్లో ప్రాణం చేరుతుంది.
నువ్వు పక్కనుండి లేచి వెళ్ళగానే
స్థాణువైన ఊపిరిలో చలనం కలుగుతుంది.
నువ్వు చేయి వదిలి, కొంచెం దూరం

పూర్తిగా »

కొంచం నిజం

అక్టోబర్ 2016


అబ్బ… నిజం. పుట్టినపుడు కూడా ఇంత ఏడ్వలేదు. ఇందాక చెప్పాను కదా. అందర్ని ఆమెకోసం వదిలేసినందుకు ఆమె కూడా వదిలేసిపోయిందని. అంతే.

ఆ తర్వాత ట్యాక్సి వాడు మిగిలిన డబ్బులకోసం నానా తిప్పలు పెట్టాడు. నా జేబు ఖాళీ. అసలే వాడి తలనొప్పిరా దేవుడా అంటే మాటిమాటికి ఆ పోలిసోడి ఫోనొకటి. హ్మ్. నీకొచ్చిన ఆలోచనే నాకు వచ్చిందిలే. చివరికదే చేసా. ఆ సింకార్డ్ తీసి నా కొత్త ఫోన్ కాస్తా ఆ డ్రైవర్‌గాడి చేతిలో పెట్టి ఏ పాట పాడుతూ అడుక్కుంటే ఎక్కువ డబ్బులొస్తాయా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెనక్కి నడిచా.బై ద వే. ఈ గొడవకి ముందంతా మేం పాటలు పాడుకుంటూనే ఉన్నాం.


పూర్తిగా »

It’s Time

అక్టోబర్ 2016


సంధ్య ఆకాశాన్ని చీల్చుకుపోయింది.
గాలి సముద్రాన్ని పిలుచుకు వచ్చింది.

ఎండి రాలిన ఆకుల్లో ఎన్నడూ లేని గలగల.
ఎరుపెక్కిన గగనంలో ఎప్పుడూ లేని మిలమిల.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

జ్ఞాపకాలు వెలిసిపోయిన, నీడలింకా కదలాడుతున్నాయ్.
జాడలింకా చెరిగిపోకున్నా, అడుగులన్నీ తప్పిపోతున్నయ్.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

పనులన్నీ పూర్తి చేసాను. పుస్తకం మూసివేసాను.
నీకేదన్న రాద్దామని పదాలకోసం వెతుక్కున్నాను.
ఖాలీ కాగితం చించుకున్నాను.
పొద్దున లేసి చదువుకుంటావని బల్ల మీద దాన్ని ఉంచిపోయాను.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

ఏ దారిలోనూ మనం ఎదురుపడవద్దని,
ఏ సరిహద్దులో కంచె కావొద్దని,పూర్తిగా »

ఎనఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్

సెప్టెంబర్ 2016


అరణ్యాల్ని దాటి వచ్చి అప్పటికప్పుడే ఎందుకు పారిపోయేదీ, గాయాల పరిమళంతో గాలినెందుకు నింపిపోయేదీ చెప్పేసాను. పసిదాని పాదాల మీద నిలిచిపోయిన అమ్మ చూపు గురించి, ఆకాశపు నీలి నదిలో దూకిన చేపపిల్ల చివరగా అన్న మాట గురించి ఇంకెప్పుడైనా చెప్తాను. నిజమే కదా అడిగావు? సరే! అలవాటైన పూలభాషలో-
పూర్తిగా »

The (this) moment of silence

సెప్టెంబర్ 2016


కొండల మీదుగా, లోయలమీదుగా,
పచ్చపచ్చని పొలాల మీదుగా,
ప్రతీ సంధ్యలో ప్రయాణం చేస్తామా?!
బరువు, బాధ్యతల ఇరుకైన ఇంట్లో తలుపు నెమ్మదిగా తెరుచుకున్నట్లు,
చీకటినంతా ఎవరో ఖాళీ చేసినట్లు అనిపిస్తుంది.
దిక్కులుదాటి ఎగురుతున్నట్లు,
దిగంతరేఖని దాటుతున్నట్లు అనిపిస్తుంది.

పూర్తిగా »