‘ నందకిషోర్ ’ రచనలు

ఆరోమలె

ఆగస్ట్ 2016


ఆరోమలె

తను ఏం మాట్లాడకున్నా నాకు మాత్రమే అర్థమవుతుంది ప్రపంచంలో. తన భాషేంటో, తన కలలేంటో, తన ప్రతీ శ్వాసా నాకేదో చెప్తూనే ఉంది. మన్నింపులు ఒదగని గాలేదో ఇద్దరి మధ్యలో వీస్తూనే ఉంది. మృదువుగా ఆమె చేతులు పట్టుకున్నా. మునుపటి మోహమేదీ లేదు ఇద్దరిలో. కళ్లలోకి చూసుకునేంత ధైర్యం రాలేదు. తనకి తినిపించాలని, నుదుటిపై ముద్దిచ్చిపోవాలని అర్థమవుతోంది. కానీ, సినిమా కాదని, ఎప్పుడెవరొచ్చి పిలిచేది తెలీదని, అవకాశమే లేదని కూడా అంతే స్పష్టంగా...
పూర్తిగా »

Into the World

ఆగస్ట్ 2016


నేనెవరనేది నువ్వెవరనేది
చెప్పాలనుకున్నాను
పదాలు ఏరి మనం ఏమయేది
ఇతరులకి ఏంటనేది
మృదువైన భాషలోకి
అనువదించాలని చూసాను.

ఒక సుదూరంలో
పెదవి విప్పి గుసగుసగా
మాట కలుపు తరుణంలో
హఠాత్తుగా ఒక పిల్లగాలి
కిటికినీ దాటుకుని దూసుకొచ్చింది
ఇద్దరిమధ్యలో వీచిపోయింది
విలువైన పదాల్ని ఎత్తుకెళ్ళింది


పూర్తిగా »

ఎప్పట్లాంటిది కాదీ వాన…

జూలై 2016


స్నానం చేసి బయల్దేరితే మనసొచ్చేది కాదు. హయ్ హయ్. తడిస్తె ఎంత బాగుంటుంది. మీ ఇంటికి తడిసిపోతూ రావడం ఎంత బాగుంటుంది. వేన్నీళ్ళ స్నానం, నువ్విచ్చే కాఫీ.. అబ్బా!

ఎప్పట్లాంటిది కాదీ వాన- నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. మళ్ళా ఇవ్వాళే. ఇంట్లో ఎవరు లేరని దానికీ చెప్పావూ?

నవ్వొద్దు. నిజంగా ఎప్పట్లాంటిది కాదీ వాన. వచ్చిన దారిలో ఒక్కడూ కనపడలేదు. ఒక్క తాబేలు, కొన్ని నీళ్ళూ.

***

చిన్నప్పుడంటే గుర్తొచ్చింది.

పొద్దుపొద్దునే మట్టి గోడ తవ్వి నీళ్ళాడిన కుందేటి పిల్లకి ఇది ఎన్నో కాన్పని అమ్మనడిగానా! అమ్మ నన్నేం కొట్టలేదు. అన్నిటిని చూపుడు వేలితో లెక్కపెట్టించింది. ఇంకా ఉడకబెట్టిన…
పూర్తిగా »

Weightlessness

ఈదురుగాలి
అగ్నిశిఖ
కల్లోల సముద్రం
విరిగిపడే ఆలోచనలు
కెరటకెరటకెరటాలుగా
అన్నీ ఒక్కసారే ఇప్పుడు
నాడుల ఉప్పెనలో...

కాసేపన్నా ఉండాలి ఇద్దరం-
నీకోసం కాదు.
నాకోసమూ కాదు.
మాటల్లేని మన సంభాషణ కోసం
దుఃఖాన్ని పాడుకునే చూపులకోసం.

పూర్తిగా »

నాకు తెచ్చిస్తావా?

నీకు తెలుసుగా..హృదయాలు వర్షించిన రాత్రి,భావాల ఉధృతిలో తేలివచ్చిన పదాలవి. నువ్వూ, నేనూ ఒకరిలోకి ఒకరం కొట్టుకుపోతే శూన్య జలపాతంలోకి దూకిపోయిన పదాలవి.
పూర్తిగా »

YOU

నువ్వేకదా?
కిన్నెర మెట్ల మీద నిద్రపోయే నిశ్శబ్ధానివి?
చేయి తగిల్తే ఉలిక్కిపడే శబ్ధానివి?
చెట్లన్నీ పెనవేసుకునే స్తబ్ధమైన మోహానివి
పువ్వుల ధ్యానానివి?

అవున్నువ్వే
పైరగాలి గుసగుసవి.సంపెంగ పరిమళానివి నువ్వే.
ఎలుగెత్తిన పక్షివి. ఎగసిపడిన అలవి నువ్వే.
చినుకంత వర్షానివి, ముత్యమంత సముద్రానివి నువ్వే.
హృదయమ్మీది నదీ చారికవు.
చెక్కిలిమీది కన్నీటి ధారవు నువ్వే.

పూర్తిగా »

The Rain

ఏప్రిల్ 2016


వర్షం

తీవ్రంగా గాయమై
మౌనంగా నువ్వెదురైనప్పుడు
వర్షం

ఛందస్సుని విరిచి విరిచి
రాసుకున్న పాటలా
అల్లరి అల్లరిగా వర్షం
తుంపర తుంపరగా వర్షం

కాగితాలు సర్దుకున్నాక
పిల్లనగోవి ఎత్తుకున్నాక

గుక్కపెట్టు శబ్దమై
చిక్కుబడ్డ రాగమై

ఇద్దరమూ కలిసిపోయి
తడిసిపోయే వర్షం
పక్కన నువ్వున్నావని
అలిగిపోయే వర్షం

దుఃఖంతో తడిపి తడిపి
వెలిసిపోయే వర్షం

-నందకిషోర్

The Rain

When you are deeply hurt
You have no words left

Forgot the grammar
Lost the language

Missed a beat

పూర్తిగా »

అనుకోకుండా 36

జనవరి 2016


ఎలా ముగించాలో తెలీదు. అక్షరం కదిలిపోకుండా, చేతులు వణికిపోకుండా, ఊపిరి అదుపుతప్పి దిగమింగుకున్న దుఃఖం ఒలికిపోకుండా

వెన్నెలస్నేహితా!

సమస్త జీవరాశికి ఒక ఆత్మ ఉన్నందుకు, దాని శరీరాన్ని నీకూ నాకూ సమంగా పంచి ఇచ్చినందుకు- దగ్గరగా, ఇంత దగ్గరగా, నేనంటూ లేనంత దగ్గరగా నిన్ను చేరుకున్నందుకు దుఃఖం.

సమస్త శూన్యానికి ఒక దేహం ఉన్నందుకు, దాని దేహం అనంతమంతా విస్తరించి ఉన్నందుకు- దూరంగా, ఇంత దూరంగా, నువ్వసలే కనపడనంత దూరంగా నిన్ను విసిరేసినందుకు దుఃఖం. మనల్ని చెల్లా చెదురు చేసినందుకు దుఃఖం.

వెన్నెలస్నేహితా!

రాళ్ళే మిగిలుంటాయ్. ఇక్కడ, మనిషిగా మాట్లాడలేని, పశువుగా సంచరించలేని, పువ్వుల నీడలో రమించలేని శాపగ్రస్త లోకంలో-

తడిరాళ్ళమీది మెరుపుల్ని ఏరినందుకు, తళుక్కుమన్న…
పూర్తిగా »

ప్రేమకథ

ఏప్రిల్ 2015


ప్రేమకథ

అనగనగా ఊరి చివర ఒక మసీదు. అక్కడే ఒంటరిగా ఒక సాయెబు. ఎక్కడ్నుండి వచ్చాయోగాని, ఒక పావురాల జంటని చూసి అతడికి ముచ్చటేసింది. అవి దిక్కులేక చక్కర్లు కొడుతుంటే బాధేసింది. వాటిని చేరదీసి,తనకి సహాయంగా ఉంటూ, ఏదో ఒక పనిచేస్కొని బతకమని చెప్పెళ్ళాడు. గూడు దొరికినందుకు పసిగువ్వలు చాలా సంబరపడ్డాయ్. మలుపుకున్న కలని మళ్ళీ గీయడం మొదలెట్టాయ్.

ప్రతిరోజూ పావురాళ్ళ కువకువల్తోనే మసీదుకి తెల్లారేది. వాటికి నమాజు చదవడం రాదు!అసలు మతమంటే కూడా తెలీదు!మట్టికి మొక్కి చేతులు జోడించేవి.కలిసి బతికేలా దీవించమని వేడుకునేవి.

పొద్దయ్యాక-గింజలకోసం ఒక్కోటి ఒక్కోదిక్కుకి ఎగిరెళ్ళేవి. పొద్దంతా పనిచేసేవి. అవి రెక్కలు విసిర్తేనే వాటి ప్రపంచమంతా గాలివీచేది. పొద్దుపోయాక-గాలిని కొంచెం దాచుకుని…
పూర్తిగా »

చిన్నమాట

మార్చి 2015


చిన్నమాట

“క్రిష్ణలో ఎందుకు.. వెన్నెల్లో చేస్తాను.” టక్కుమని చెప్పేసింది.

తనంతే. సూటి మనిషి. ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా చెప్పేస్తుంది సమాధానాలు. ఇంక మళ్ళీ నేను తనని స్నానం చేయమని అడగలేదు. కళ్ళు మూసుకున్నా నేను చూడలేంది, ఆమె దాచగలిగేది ఏదన్నా ఉంటదా అని ఒక ప్రశ్న-
ఆమె కార్ డోర్ని ఒక్కతోపు తోయగానే ప్రశ్న చెదిరిపోయింది. ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఇది వరసగా మూడో రోజు.. మేమిలా రోడ్ల వెంట, ఊర్ల వెంట తిరుగుతూ ఉండటం.

1

ఎలా మొదలైందనుకున్నావు? అబ్బా.. అది చిత్రంలె. మొదటి రోజు మేం కలిసినపుడు రైలుబండొకటి మా ఇద్దరి మధ్యలోంచి వెళ్ళిపోయింది. ఇదిగో-…
పూర్తిగా »