‘ నందకిషోర్ ’ రచనలు

భూమధ్యరేఖ

భూమధ్యరేఖ

కాశిగాడిగురించి మాట్లాడమంటే చాలా మాట్లాడొచ్చు.. అందరిలో కలిసిపోతాడు. అన్నం మెతుక్కి అతుక్కుపోతాడు. ఎవన్నీ వదలకుండా love you లతో హింసపెడతాడు. ఎటువంటి మనుషుల్తో అయినా అల్లుకుపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సర్దుకుపోవడం తెల్సినవాడిగా కనిపిస్తాడు. "చేపలకి ఎవడైనా వలవేస్తాడు, సముద్రానికే వలవెయ్యాలి" అన్నట్లు ఉంటుంది వాడి వ్యవహారం. అదే అదే. వాడి ఫ్రెండ్ లిస్ట్ సంగతి చెప్తున్న. తనని ఎవరు ఏమనుకుంటున్నారనే స్పృహలేకుండా ఎంతమందినైనా ప్రేమించగలవాడు, ఎవరు అన్నం పెట్టినా మర్చిపోకుండా కన్నీళ్ళతో అమ్మని తల్చుకునేవాడు, అదేంపెద్ద విషయం కాదన్నట్టు ఎంతదూరమైనాపోయి మనుషుల్ని కలిసొచ్చే ఓపిక ఉన్నవాడు కాశిలో ఉంటాడు. ఎంతకి అంత ఎటకారంగా సమాధానం చెప్పేవాడూ వాడిలోనే ఉంటాడు.
పూర్తిగా »

Labelle

నవంబర్ 2014


Labelle

యవ్వనపుకళ- గాలిలో దూసుకుపోతూ వచ్చి తాకినపుడు ఆమెని చూసాను.

***

ఇంత రాత్రి, ఇంత చలిలో, కుదురుగా ఉండకుండా- రాత్రిలోకి తనని ఎందుకు వెదజల్లుకోవాలని ప్రశ్నించుకున్నాను. ఆమెని చేరుకున్నాను. యవ్వనభారాన్ని ఎక్కడ దింపుకోవాలో, చలిగాలికి వణికిపోతే ఏ గూటికి చేరాలో తెలీదని చెప్పుకున్నాను.

ఆమె నవ్వింది. పున్నాగ పువ్వులంటే ఇష్టమని చెప్పింది. నిశ్శబ్దాన్ని ముక్కలు చేసేందుకు ఏ పక్షి పాడలేదని బాధపడుతూ నన్ను దగ్గరికి పిలిచింది.

***

నవ్వుతున్న పున్నాగ పువ్వులా తన చేతిలోకి జారాను. క్షణమాత్రం ఆలస్యం చేయకుండా, ఆమె నా తల తుంపి ఎటో ఊదుకుంటూ పోయింది.

 


పూర్తిగా »

అనుకోకుండా

అక్టోబర్ 2013


అనుకోకుండా

చాలా చాలా అనుకుంటాం

దూరంగా ఉండగలమనీ, దూరాన్ని తుంచగలమనీ, ఏదనుకుంటే అది ఎప్పుడైనా చేయగలమనీ…
అన్నీ మాటలే. విరహపు బాధ జీవితమంతా విస్తరించాక-ఏం మాట్లాడాలో అర్ధం కాదు. ఏది చేయాలన్నా మనసురాదు.
గుండెలు పగిలి ఏడ్చేదాకా ఏ ఒక్కరోజూ నిద్రపట్టదు. ఏ ఒక్కరోజూ కలలు తీరవు.
లయించి లయించి ఒరిగేదాకా ఏ ఒక్క క్షణమూ తృప్తినివ్వదు.

వెన్నెలస్నేహితా!
లయతప్పడమొక అదృష్టం. పసిపిల్లలకూ మనకే పట్టే పట్టరాని అదృష్టం.
హృదయం లయతప్పితే పాట స్వరం తప్పుతుంది.అనుభవాల్లాంటి చరణాలన్నీ అప్పటికప్పుడే అంతమైపోతాయ్.
పల్లవించే బతుకురాగం పాడీ పాడీ అలిసిపోయాక- ఊపిరి నిన్నూ నన్నూ నిశ్శబ్ధం చేస్తుంది.

వెన్నెలస్నేహితా!
ఊపిరివృత్తంనుంచి…
పూర్తిగా »

మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

జనవరి 2013


మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

“పత్రనేత్రాల పరిశీలనతో ప్రపంచపు
నలుదిశలూ పరికిస్తూ మెదిలినా
నాకో గమనింపు ఉంది
వేళ్ళెప్పుడు నేలలోనే ఉండాలని” (2)

“మట్టివేళ్ళు” పేరు వినగానే మొదట స్పురించే వాక్యాలివి. “మట్టివేళ్ళు” కవి కట్టాశ్రీనివాస్ మొదటి కవితా సంకలనం.మట్టిపరిమళాన్ని గుండెల్లో నింపుకొని,గమనింపునెప్పుడూ మర్చిపోకుండా,పచ్చని చెట్టుగా ఎదుగుతూ వచ్చిన  కవి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.కాంతిని ఆవహించుకోగల శక్తితోపాటే చలించడం అతని సహజ స్వభావం.అయితే వ్యక్తిగా ఎంత పారదర్శకంగా చలిస్తాడో,కవిగాను అంతే పారదర్శకంగా చలిస్తాడతడు.

జీవితంలో నిత్యం తారసపడే సందర్భాలే కట్టా శ్రీనివాస్‌కి కవిత్వ వస్తువులు.తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.అర్ధంలేని abstractని ఉపయోగించడు.కొన్నిసార్లు మనసు,కొన్నిసార్లు స్నేహం,చాలసార్లు మానవత్వం అతని కవితల్లో ప్రదర్శింపబడతాయ్. అందరికి అనుభవంలో…
పూర్తిగా »