‘ ప్రసూన రవీంద్రన్ ’ రచనలు

పరిపూర్ణం

పరిపూర్ణం

ఆమె కెరటాల వైపు చూపించింది. పైకెగసిన ప్రతి కెరటం తీరాన్ని తాకడంలేదు. కొన్ని కెరటాలు తమలోకి తాము ముడుచుకుంటున్నాయ్. కొన్ని తమని తాము శోధించుకున్నట్టుగా కనపడుతున్నాయ్. ఆ కెరటాల వెనుక చిన్నగా అలలు కదుతున్నాయ్. ఆకాశం మీదున్న ప్రేమ దేహంపై మెరిపిస్తూనే ఏ ఉద్వేగానికీ లోనవనట్టుగా. ఏ వత్తిడికీ తమ అస్తిత్వాన్ని కోల్పోనట్టుగా.
పూర్తిగా »

ఎలా? ఇలా…

ఫిబ్రవరి 2015


ఇక్కడంతే. అలలు నిశ్శబ్దంగానే మింగడానికి వస్తాయ్. ఇసుక నిర్మోహంగానే మెరుస్తుంది.

నా ఆకాశం అంతే. ఏ మేఘ శకలాలూ లేనప్పుడే జోరుగా వాన కురుస్తుంది.

నేల పొత్తిళ్ళలో నిశ్చలంగా ఉన్న నీటి పడెల్ని, పిట్టలా పొడుస్తూంటాను. ఒక యుగాంతం చివర్న నా సందేహాలన్నిటినీ వలయాలుగా విడగొట్టుకోడానికి.

అప్పుడు పొందే జ్ఞానం మొయ్యలేనంత బరువయ్యాక, పదాలు పట్టవని తెలుసుకున్నాక, ఒక నైరూప్య చిత్రంగా ఒలికిపోవడమే మంచిది.
ఎవరికీ అర్థం కాకపోవడమే మంచిది.

ఎప్పటికీ తడారని రంగుల్లో వేళ్ళు పెట్టి సున్నాలు చుడుతూ ఏ చిత్రాన్ని పాడతాను? గడిచిన శతాబ్దాల్ని లెక్కించుకునే నిట్టూర్పు శబ్దాలతో ఏ పాటని చిత్రిస్తాను?

అవును, నాలో నేనుండి ఎన్నాళ్ళయిందో మరి. ఎప్పుడొస్తావ్?


పూర్తిగా »

నువ్వూ, నేనూ..

నువ్వూ, నేనూ..

ఒక స్థిరమైన దూరంతో
ఒకరినొకరం వెంబడించుకుంటూనే ఉంటాం.

నిషిధ్ధ వేదనొకటి
ఆకాశపు పొరల కింద
మన ఛాయల్ని చెరుగుతూంటుంది.

అక్షరాల్లోకి అనువదింపబడలేని
అప్రకటిత సత్యమేదో
నీ కుంచెలోంచి అలవోకగా రాలి పడిపోతుంది.

నువ్వేసే వలలో చిక్కకూడదనుకుంటూనే
నీకోసం చీకటిని మింగేస్తూంటాను.

నా బాహువుల్లో బలం లేదంటూనే
నాకోసం వెలుగుని విసురుతావ్.

అనంతమైన దిగంత గానంలో
శ్రుతి లయలమై ఉండీ
అనాదిగా మన బంధంలో అదే ఆవేశం.


పూర్తిగా »

బాల్యం తిరిగొచ్చింది

ఎన్నేళ్ళ క్రితమో
నిర్దయగా నన్నొదిలిపోయిన బాల్యం
ఇవాళ నీ మెత్తని అరచేతిలోంచి
తిరిగి నాలోకి ప్రవహిస్తోంది.

నా వేలు పట్టుకుని నువ్వు నడిపిస్తుంటే
నిన్న అడుగులు నేర్చుకున్న నీ దగ్గర
ఇష్టమైన దారిలో నడవడం
ఇప్పుడే నేర్చుకుంటున్నాను.

చిట్టి చిట్టి పదాలు నీకు నేర్పుతూనే
నానార్ధాలకో విపరీతార్ధాలకో బెదరడం మానేసి
భావాలకి రెక్కలిచ్చి
పెదవులపైకి ఎగరేయడం నేర్చుకుంటున్నాను.

అంతర్జాలంలో వలేసి
నీకోసం కొన్ని ఆటల్ని పట్టుకుంటాను కానీ
నువ్వు నాకు నేర్పే ఆటలాడాక
నింగి తారల్ని చూసి
విద్యుద్దీపాలెందుకు తలొంచుకుంటాయో
తెలుసుకుంటున్నాను.

అందరూ అన్నివైపులా చేరిపూర్తిగా »

వేసవి…

ఉదయ పుష్పం
రేకులు విచ్చుకుంటూ
కిటికీలోకి తొంగి చూస్తుంది.
ఆకాశం పారేసుకున్న పాత ఉత్తరాలు
చెల్లా చెదురుగా కనిపిస్తాయ్
వాటిలోనే ముఖం పెట్టి
నా నిద్రని తుడుచుకుంటాను.

కాలం దాచేసుకున్న వాసనలేవో
వేసవి గాలితో చెయ్యికలిపి
ప్రేమగా పలకరిస్తాయేమో
లిప్తకాలం రెప్పలకింద
ఆ పాత నేను

అంతలోనే
అల్లరి బాలుడిలా సూర్యుడు
నారింజ చొక్కా విప్పి చెరువులో విసిరేసి
నింగివైపు పరుగుదీస్తాడు

బధ్ధకాన్నొదిలిన చెట్లకూ, చిలుకలకూ
గడియారపు మెటికల విరుపులకూ
ప్రేరణనిస్తూ
తత్వవేత్తలా ఆకాశం
గంభీరంగా మారిపోతుంది.…
పూర్తిగా »

కొన్ని సమయాల్లో…

22-ఫిబ్రవరి-2013


తల నిండా పూలు తురుముకుని
ఆకాశాన్ని ఆశగా చూస్తున్న చెట్టుని
ఏ పాట పాడమంటాం?
ప్రతి ఒంపులోనూ
రచించలేని రాగాల కువకువలే

ఒంటి నిండా మెరుపులద్దుకుని
పరుగెట్టే సెలయేటిని
ఏ ఆట ఆడమంటాం?
ఉరికే ప్రతి మలుపులోనూ
తెరకెక్కించలేని భంగిమలే

జీవితమంత పరుచుకున్న ఆకాశంలో
లెక్కించలేనన్ని పాత్రల్లో
ఎప్పటికప్పుడు మారిపోతున్న బ్రతుకు లిపి

నేర్చుకున్నదేదీ అక్కరకు రాని సమయాల్లో
కనుపాపల్లో గీసుకునే
ఆకాశ చిత్రం మాత్రమే
నన్ను కొత్తగా వెలిగిస్తుంది.


పూర్తిగా »