‘ మండువ రాధ ’ రచనలు

చందమామోళ్ళవ్వ

జూలై 2014


చందమామోళ్ళవ్వ

సాయంకాలం స్కూలు నుండి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మమ్మ అరుగెక్కి సన్నజాజి కొమ్మని వంచి పట్టుకుని మొగ్గలు కోస్తంది. పుస్తకాల సంచిని అరుగు మీద పారేసి “నేను కోస్తా అమ్మమ్మా! నేను కోస్తా!” అంటా రెండు పూలు కోసి ఇచ్చాను. అప్పటికే కింద పూలన్నీ కోసేసింది.

“అమ్మమ్మా! గోడెక్కి పైనున్న పూలు గూడా కోసేదా?” అన్నాను.

“ఆఁ ఎక్కు కాళ్ళు యిరుగుతాయి” అంటా గోడ మీద పెట్టిన పూల గిన్నె తీసుకుని అరుగు దిగింది. కిందే నిలబడి మమ్మల్ని చూస్తన్న మా అక్కాయిని వాటేసుకోని “అప్పుడు నీకు కుంటి పెళ్ళాం వచ్చిద్ది నా బంగారు మనవరాలికి రాజకుమారుడు వస్తాడు” అంది.

నాకు అప్పటికి ఏడేళ్ళు గూడా…
పూర్తిగా »

కర్తవ్యపాలనలోనే సత్యదర్శనం ఉందంటున్న విరాట్

ఫిబ్రవరి-2014


కర్తవ్యపాలనలోనే సత్యదర్శనం ఉందంటున్న విరాట్

అశాంతికి కారణమైన అహాన్ని చంపుకోవడానికి అన్నింటినీ త్యజించి ఏకాకులుగా జీవించే ఋషులు, మహర్షులు నడిచిన బాటలో నడవాలని మనం తపన పడతాం. అయితే ఇలా ఏకాంతవాసులుగా మారిన వారికంటే కర్తవ్య నిర్వహణ గావిస్తూ తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండే వారికే ఎక్కువగా సత్యదర్శనం లభిస్తుందని తెలియచేస్తుంది స్టీఫన్ త్సయిక్ కథ (నవలిక) ‘విరాట్’.

అన్ని బంధాలకు దూరంగా తనను తాను పోషించుకుంటూ స్వేచ్ఛగా ఉన్నాననుకుంటున్న వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నట్లు కాదు. ఇతరులకు సేవ చేసేవాడు, తన మన: శ్శక్తిని, శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసి ఫలితాన్ని భగవంతుని చేతికిచ్చేవాడే నిజమైన స్వతుంత్రుడని విరాట్ పాత్ర ద్వారా మనకి విశదపరిచిన త్సయిక్ ఆస్ట్రియా వాసి. యూదు జాతీయుడు. ఈయన…
పూర్తిగా »

అనుబంధం

నవంబర్ 2013


అనుబంధం

కాలేజీ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో మా అమ్మ క్రింద కూర్చుని ఉన్నదల్లా లేచి నాకు ఎదురొచ్చి నా బుగ్గలు పుణుకుతూ “అదృష్టవంతురాలివే తల్లీ. మామయ్య నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు” అంది. ‘నేనేందో ఆయనని చేసుకోవడానికి ఆరాటపడుతున్నట్లు చెప్తుందేమిటీ’ అని నాకు ఆశ్చర్యమేసింది. ఏదో చెప్పి ఉంటుంది మామయ్యకి అనుకుని మామయ్య వైపు చూశాను. తలదించుకుని కుర్చీలో కూర్చుని ఉన్న మామయ్య అమ్మ మాటలు విని, లేచి ఏదో పని ఉన్నట్లు బయటకు వెళ్ళిపోయాడు. అమ్మమ్మ కూడా మోకాళ్ళు పట్టుకుని మూలుగుతూ లేచి నుంచుని “ఎట్లయితేనేం తమ్ముడిని ఒప్పించావు. వాడి మనసు మారకముందే త్వరగా పెళ్ళి ఏర్పాట్లు చూడు” అంది అమ్మతో.


పూర్తిగా »

ప్రేమ జీవనం

ఆగస్ట్ 2013


ప్రేమ జీవనం

ప్రియమైన అమ్మకు -

ఆ వాక్యం రాయగానే రుక్మిణీ దేవి చేయి ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. చూపు మసకబారింది. ‘చిన్నప్పటినుండీ అతన్నే కోరుకున్నాను. మనసా వాచా అతన్నే ప్రేమించాను. అతని కోసం తపించాను. అతడు తనను విడనాడడని, తనే లోకంగా బ్రతుకుతాడనీ నమ్మాను. అందరినీ వదలి అతనితో లేచి వచ్చాను. ఈరోజు ఏమయింది? సత్యభామ మందిరంలో ఉన్నాడు’ – రుక్మిణీ దేవి మంచం మీద పడి రోదించసాగింది. నిన్నటి వరకు అతని బాహుబంధాల్లో ఇమిడిపోయి నిద్రించిన ఆమె ఒంటరితనంతో విలవిలలాడుతోంది. అతని స్పర్శ కోసం ఆమె తనువూ, మనసూ తపించసాగాయి.

‘ఆ ఆమెని కౌగిలిలోకి తీసుకుంటున్నప్పుడు అతనికి నేను గుర్తుకు వస్తానేమో! వస్తాడేమో’…
పూర్తిగా »

రెండో జన్మ

21-జూన్-2031


అన్ని గతాలూ ఊడ్చుకుపోయి
ప్రతినిమిషం ఒక మొదలూ-చివరా ఉన్న
ప్రత్యేక జీవితంలాగా వెలిగింది.

వెలిగిన క్షణాలకు ముందు గడిపిన
బాల్య జీవితపు వాసనలు, కర్మ వైఫల్య భయాలు
కరిగిపోవడం చూశాను.
ఏళ్ళకొద్దీ పాదుకుపోయిన సంప్రదాయపు
శృంఖలాలను తెగ్గొట్టలేక పడిన వేదనలు
కాలిపోవడం చూశాను.
ముల్లుల్లా గుచ్చుకుంటున్న
ఆశల ఆశయాల నాటకపు రంగ పాత్రలు
అదృశ్యమవడం చూశాను.

ప్రభాత వీచికల సుగంధం -
వర్ణశోభితమైన కొండ చరియ దర్శనం –
భాసిల్లిన గంగోత్రీ గానం -
సాకార ప్రతిపాదనలన్నీ నైరూప్యాలై
చివరికి మిగిలేది ఇదే ననడం చూశాను.


పూర్తిగా »