‘ రవి వీరెల్లి ’ రచనలు

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

గొలుసు కవితలు

కవిత్వం ఎప్పుడూ ఒక ధార, ఒక ప్రవాహం. అనుభవం నుండి అనుభూతికి, సంఘటన నుండి సంస్పందనలోకి, మాట నుండి మనసుకి, మనసునుండి తిరిగి మనిషిలోకి నిర్విరామంగా నడుస్తూ, తాకుతూ, తడుపుతూ, తట్టి లేపుతూ కలుపుకుంటూ పోయే నిరంతర వాహిని కవిత్వం. కవిత్వం లోని ఈ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ..

ఒక చిన్న ప్రయోగం చేద్దామా? గొలుసు కవితలు రాద్దామా?
ఎక్కడిదైనా ఏదైనా ఒక కవితలోని ఒక వాక్యాన్ని తీసుకుని దాంతో మొదలెట్టి ఎవరైనా ఇక్కడ ఒక కవితను రాయండి. ఆ కవితలోని ఒక వాక్యంతో మరొకరు మరో కవిత… ఇలా ఒక భావం నుండి మరో భావం, ఒక వ్యక్తీకరణనుండి…
పూర్తిగా »

ఎర వేయని గాలం!

ఫిబ్రవరి-2014


ప్రతీ రోజూ తీసే తెరను ఆరోజు ఉతకడానికన్నట్టు, ఆదివారం పొద్దున్నే చెరువొడ్డు చేరతాడు సూర్యడు. పొగమంచుని అటూ ఇటూ ఊది నీటి అట్టడుగు పొరల్లోకి వేళ్ళు ముంచి చేపల్ని తట్టి నిద్ర లేపుతాడు.

నేనూ.. నా వెనకే అచ్చంగా నాలాగే నడుస్తూ వాడూ, చెరువొడ్డు చేరతాం. తపస్సు చేస్తున్న ఋషుల్లా ఒకరి వీపుకు మరొకరి వీపునానించి కాలానికే గాలం వేస్తున్నట్టు కూచుంటాం. నిశ్శబ్దాన్ని మోయలేక గాలి కూడా మాతో అలా చతికిలపడిపోతుంది కాసేపు. పండగకు ఇల్లుచేరిన పిల్లల్లా సందడి చేస్తూ, చేతన మరిచిన చెరువుకు కొత్త ప్రాణం పోస్తూ, చేప పిల్లలు రెండు జట్లుగా చీలిపోతాయి. అప్పటివరకు గలగలమన్న చెట్లు, ఆట మొదలయినట్టు గట్టు మీంచి…
పూర్తిగా »

బయల్దేరాలిక…

అక్టోబర్ 2013


నడుమొంగిన నిద్రగన్నేరు కొమ్మ కింద
ఎప్పుడో రాలే ఆ ఒక్క పువ్వు కోసం
కదలకుండా ఎదురు చూస్తున్న కోనేటిమెట్టులా
పిలుపుకు పడిగాపులు కాస్తూ
ఎన్నాళ్ళు?!

ఎన్నో దేహాల్ని పవిత్రం చేసి
పచ్చగా నవ్వుతున్న కాలం కోనేట్లోకి
పాత జ్ఞాపకంగా మిగిలిన రూపాయి బిళ్ళను గిరాటేసా.

పాటై చిగురించిన జీవితపు కొమ్మలోంచి
పండుటాకుల్లా ఒక్కొక్కటే రాలిపడే చరణాల్ని శృతి చేసుకుంటూ
తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని

విడిది పడవ వదిలి
వెళ్ళాలిక

సలపరించే ఆలోచనల్ని బుక్కపోసి
భావాల నొప్పిని పుక్కిలిస్తూ
నా నీలోంచి
ఉవ్వెత్తున ఎగిసే ప్రేమకెరటాల్ని ఈదుకుంటూ…

కాటగలిసిన…
పూర్తిగా »

నదితో నాలుగడుగులు

12-ఏప్రిల్-2013


1

మలుపు మలుపులో
మరో కొత్త పాటకు స్వరం దిద్దుకుంటూ
మంద్రంగా
సాగిపోతుంది నది.

రెప్పపాటి రోజుల్లా
ఒక్కొక్కటిగా ఒడ్డు చేరి నిష్క్రమించే
అలలు లెక్కిస్తూ కూర్చున్నా.

జవాబు చెప్పే లోపే ప్రశ్న మార్చే జీవితంలా
ఒకటి రెండై
రెండు నాలుగై
లెక్క తేలని అలలలలు.

2

రోజూ చదివే పుస్తకమేకదాని
బడికెళ్ళడం మానడుగా!
పుట మారుస్తూ
పొలిమేరల్లో సూర్యుడు.

కట్టు బట్టల్ని గుట్టపైనే వదిలేసి
నగ్నంగా నది నీట్లోకి దూకుతూ
సన్నటి ఈరెండ.

జారుతున్న పుప్పొడిపైటను సరిచేసుకుంటూ
గాలి విల్లు వొంచి
పరిమళాన్ని…
పూర్తిగా »

మొదటి వాక్యం

08-ఫిబ్రవరి-2013


అంతరంగాన్ని అతలాకుతలం చేసే
నీ ఉద్వేగపు తాకిడి లేనప్పుడు-
ఆక్షరాలు
ప్రేమగా అలాయ్ బలాయ్ ఇచ్చుకోవు.

ముద్రవేలుకి చూపుడువేలుకీ మధ్య
నించోనే నిద్రపోతున్న కుంచెను చూసి
ఫక్కుమని నవ్వి వెక్కిరిస్తాయి
నెత్తి కెక్కిన కొన్ని అనుభవాలు.

అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు
బయటికిరాలేని ఒకానొక బలహీనత ఒళ్ళో
బద్ధకం
ఏకాయెకి పరుపుబండై
కాళ్ళుసాపుకు పడుకుంటది.

శబ్దానికి మరో శబ్దానికి మధ్య
ఎప్పుడూ ఎంకిలా ఎదురుచూసే
నిశ్శబ్దం
ముఖం చాటేస్తది.

రాత్రంతా సోపతున్న
ఈస్ట్ మన్ కలర్…
పూర్తిగా »

దగ్గరి దూరాలు!

జనవరి 2013


ఏవీ
నీకన్నా ముందే
నీ రాకని లయగా మోసుకొచ్చే
నీ కాలిపట్టీల కూనిరాగాలు?

ఏవీ
నీలాకాశం చీర చివర
వెన్నెల జీరాడినట్టుండె
తెల్లలంగా కుచ్చులు?

ఏదీ
నీ ఉనికిని ఇష్టంగా
గాలిపల్లకిలో ఊయలూపుతూ మోసుకొచ్చే నీ పరిమళం?

ఎందుకు
ఎప్పుడూ మన చూపుల సయ్యాటల్లో దూరలేక సిగ్గుపడి పరిగెత్తే సమయం
ఇప్పుడు నీ కంటి కొత్త భాషకు అర్ధం తెలీక నివ్వేరపోతుంది?

గుప్పెడంటే గుప్పెడు మల్లె మొగ్గల్లో మత్తుగా విచ్చుకునేవి ఆ రోజులు.
గుంగిలి పూల బోకేల్లో మూగగా ముడుచుకుంటూ ఈ రోజులు.

అవే
వెలుగుకళ్ళ ఎదురుచూపుల పగళ్ళు.పూర్తిగా »

నన్ను మళ్ళీ నాతో కలిపింది కవిత్వమే!

జనవరి 2013


నన్ను మళ్ళీ నాతో కలిపింది కవిత్వమే!

చిన్నప్పటి నుండి నాకు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ రోజుల్లో మా ఊళ్ళో పుస్తకాలు అంత సుళువుగా దొరికేవి కావు. ఊళ్లోకి ఓ పుస్తకం వచ్చిందంటే ఆ పుస్తకం మీద ఎంతో మంది కళ్ళు ఉండేవి. ఆ పుస్తకం ఎలాంటిదైనా, ఎవ్వరిదైనా పర్వాలేదు బతిమాలి అడిగి తెచ్చుకుని చదివే వరకు మనసంతా దానిమీదే వుండేది. నవల, వీక్లీ, న్యూస్ పేపర్ లేదా ఎంత పెద్ద సంస్కృత గ్రంధం అయినా సరే, చదివి తీరాల్సిందే. ఆఖరికి కొట్టువాడు మిరపకాయ బజ్జీలకు కట్టిచ్చే చిన్న పేపర్ ముక్కను కూడా చదవకుండా వదలకపోయేది. మా బాపుకు పుస్తకాలంటే మహా ఇష్టం. బాపు ప్రోత్సాహం వల్లనే మాకు…
పూర్తిగా »

ఆఖరితనం

జనవరి 2013


1
ఎప్పుడో గానీ ఎదురయ్యే
ఆ చిన్న పలకరింతకు కూడా
సమాధానం సంధించే భిగువు
ఇప్పుడీ పెదాల్లో లేదు.

2
కలలు వలసబోయిన రెప్పల కింద
కన్నీటి బిందువు కూడా ఎదగనంటే

ఏ తోడూ లేని చిటికెన వేలును
ఊతకర్ర కూడా వెలేస్తే

వ్యాకోచించని ఊపిరితిత్తుల లోయలోకి
ఊయలూగ ప్రాణవాయువు కూడా రానంటే

అరిచేతుల్లోంచి అదృశ్యమైన అదృష్టరేఖలు
అదాటున దేహమంతా పాకి ప్రశ్నిస్తున్నట్టు

అందర్నీ దేవుని సన్నిధికి చేర్చిన గుడిమెట్టు
శిధిలమై దేవునికి దూరంగా రాలిపడుతున్నట్టు

మళ్ళీ మొదలైన
ఆఖరితనం.

3
చెయ్యందించి
చివరి బండెక్కించడానికి

పూర్తిగా »