‘ సంపాదకులు ’ రచనలు

హంసిని 2013 అవార్డుల విజేతలు

16-ఏప్రిల్-2013


హంసిని 2013 అవార్డుల విజేతలు

“వాకిలి’ పాఠకులకు సుపరిచిత అక్షర స్వరం మోహనతులసి ఈ ఏడాది మరో అవార్డు గెల్చుకుంది. ప్రతి యేటా ఉగాదికి ప్రకటించే హంసిని అవార్డు తులసికి లభించింది. గత ఏడాది తులసికి ఇస్మాయిల్ అవార్డు కూడా లభించింది.  హంసిని వెబ్ సాహిత్య పత్రిక కవిత్వానికిచ్చే మిగిలిన రెండు బహుమతులు డాక్టర్ గరిమెళ్ళ నారాయణకీ, మామిడి హరికృష్ణకీ లభించాయి. ఈ ముగ్గురు కవుల గురించీ ఇవీ న్యాయనిర్ణేతలు రాసిన వ్యాఖ్యలు:

 “మెలకువ’లో రాసుకున్న ఉద్వేగ వాక్యాలు మోహన తులసి కవితలు

          క్లుప్తతా, తేలిక భాషలో గాఢమయిన భావనల వ్యక్తీకరణా, సరళంగా విచ్చుకునే తాత్విక స్వరం…ఇవీ తులసి కవిత్వాన్ని పట్టిచ్చే మూడు లక్షణాలు. తులసి కవిత్వం ప్రకృతి గురించి పాడినట్టే…
పూర్తిగా »

ఏప్రిల్ వొకటి విడుదల!

ఏప్రిల్ 2013


ఏప్రిల్ వొకటి విడుదల!

చార్లీ చాప్లిన్ సినిమా మొట్ట మొదటి సారి ఎప్పుడు చూశానో గుర్తు లేదు.

ఆ మాటకొస్తే,  ఆ తరవాత చాప్లిన్  ఏ సినిమా ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తు లేదు.

అందులో నేను మళ్ళీ అనుభవించలేని పసితనమేదో వుంది, అది నన్ను కవ్విస్తుంది, నవ్విస్తుంది. ఏడ్పిస్తూ నవ్విస్తుంది. నవ్విస్తూ ఏడ్పిస్తుంది. నవ్వుకీ, ఏడ్పుకీ మధ్య వుండే ఈ స్థితేదో నాకు కావాలి, నన్ను కుదురుగా వుండనివ్వడానికి!

నేను కుదురుగా లేను అనుకున్న స్థితిలో చాప్లిన్ ని వెంటనే ఆశ్రయిస్తాను.  వొక్కో సారి తన మూకీ భాషలో, ఇంకో సారి కేవలం చేష్టలే భాష అయిన ఘోషలో నన్ను వెంటనే నిటారుగా నిలబెట్టేస్తాడు చాప్లిన్.

ఇప్పుడు…
పూర్తిగా »

ఆమె: ఆకాశంలో కాదు, ఈ నేలలో సగం!

మార్చి 2013


ఆమె: ఆకాశంలో కాదు, ఈ నేలలో సగం!

“Every writer needs another set of eyes.”

అన్నాడట The Atlantic పత్రిక సంపాదకుడు విలియం విట్ వర్త్ ఒక సందర్భంలో! ఇప్పుడు అదే మాటని తెలుగులో స్త్రీల సాహిత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు గుర్తు చేసుకోక తప్పడం లేదు. తెలుగు సాహిత్యానికి కొత్త చూపునిచ్చి, కొత్త దిగంతాన్ని చూపించిన  స్త్రీల సాహిత్యం నిజానికి 1980ల తరవాతనే మొదలయింది. అప్పటి వరకూ పురుష నేత్రాలతో మాత్రమే అక్షరాల్ని చూడడం అలవాటయిన లోకానికి ఇంకో జత కొత్త కళ్ళు తప్పనిసరయ్యాయి. అయితే, ఇప్పటికీ ఈ కొత్త వాస్తవికతని చూడలేకపోవడమూ, చూసినా చూడనట్టు వుండడమూ అలవాటయిన అంధత్వం లేకపోలేదు. ‘అబ్బే…సాహిత్య వాక్యానికి లింగబేధం ఆపాదించలేమని’ కుటిల వచనాలు పలికే మగదొరలదే ఇంకా…
పూర్తిగా »

ఇదిగిదిగో రెండో అడుగు!

ఫిబ్రవరి 2013


ఇదిగిదిగో రెండో అడుగు!

‘వాకిలి’లో మా మొదటి అడుగు మాకు తృప్తినిచ్చింది. మీ నించి లభించిన ప్రతిస్పందన, మీరు చూపించిన ప్రేమ మాకు కొండంత అండని భరోసాగా ఇచ్చింది. మారుమూల తెలుగు పల్లెల నించి దూరదేశాల దాకా కూడా ఎందరో ‘వాకిలి’ లో తమ ప్రవేశాన్ని అందమయిన/ ఆహ్లాదకరమయిన అనుభవంగా చెప్పారు. ఎందరో రచయితలు మా తొలి అడుగులో అడుగు కలిపి ఇక ముందు వాకిట్లో మనమంతా కలిసే వుంటామని, హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే ఆరోగ్యకరమయిన, స్నేహపూర్వకమయిన వాతావరణం వాకిట్లో కనిపిస్తోందని అన్నారు.

ఇలాంటప్పుడు రెండో అడుగు వేయడానికి కాస్త బెరుకుగా వుంటుంది. మీలో మొలకెత్తిన కొత్త ఆశల్ని నిలబెట్టుకోగలమా,మీలోపల ననలెత్తిన కొత్త అభిరుచి చిగుర్ల వూపిరి కాపాడుకోగలమా…
పూర్తిగా »

కనుక్కోండి చూద్దాం!

ఫిబ్రవరి 2013


కనుక్కోండి చూద్దాం!

 

ఈ ఫోటో లో ఎవరెవరున్నారో కనుక్కోండి చూద్దాం!

 

ఫోటో క్రెడిట్: ఆచార్య రవ్వా శ్రీహరి (www.ravvasrihari.com)


పూర్తిగా »

జనవరి 2013 సంచిక: మాట్లాడుకుందాం రండి!

జనవరి 2013


జనవరి 2013 సంచిక: మాట్లాడుకుందాం రండి!

ఈ ‘వాకిలి’ ఒక కల.

ప్రతి పత్రికా- అది అచ్చులో అయినా, అంతర్జాలంలోనయినా- అందమయిన కలతోనే పుడుతుంది.

‘వాకిలి’ కల మీతో అరమరికలు లేని సాహిత్య సంభాషణ! ఎలాంటి మొహమాటాలూ లేని, అచ్చంగా సాహిత్య విలువల మీది ప్రేమతో మాట్లాడుకోవడం! విమర్శనీ, ప్రశంసనీ సమహృదయంతో ఆహ్వానించే సహనాన్ని పెంచడం! జీవితంలోని కొత్త కోణాల మీద నిజాయితీతో నిండిన వెలుగుని ప్రసరించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే సాహిత్య సమూహాన్ని సమీకరించడం!

గత ఇరవయ్యేళ్లుగా తెలుగు సాహిత్యం సంశయ యుగంలోంచి నడుస్తోంది. ఏది సాహిత్యం అనేది పెద్ద సంశయం! అనేక రకాల సాహిత్య ధోరణులు కొన్ని సార్లు ఊపిరాడనీయని సందిగ్ధంలోకి  కూడా తోస్తున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ వాద ధోరణులు…
పూర్తిగా »