‘ సుజాత ’ రచనలు

ఒక సామాన్యుడి అసాధారణ విజయం

మే 2013


ఒక సామాన్యుడి అసాధారణ విజయం

ఆకుపచ్చని కాశ్మీరపు తివాచీ మీద మంజరి శరీరం వెల్లికిలా పడి ఉంది. పడక గదిలోకి ఉన్న కిటికీ పూర్తిగా తెరిచివుంది. టెలిఫోను కిందపడి ముక్కలయిపోయింది… అల్లంత దూరంలో పసుపుపచ్చని మందుబిళ్ళలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

మంజరి మరణానికి కారణమేమిటని కాదు నా ప్రశ్న. అసలిలాంటి అమానుషమైన ముగింపు జరగటం నాకిష్టం లేదు. తన సౌందర్య తీవ్రతతో దేశదేశాలను తపింపచేసిన మంజరి శరీరం, నిర్జీవంగా కాశ్మీరపు తివాచీ మీద పడి ఉండటంలో ఏదో అపశృతి ఉన్నదనిపించింది నాకు. ఆమె సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలు, సిరిసంపదలు ఆమె నీ కొసకు తరుముకొచ్చాయనిపించింది.

అనన్యమైన ప్రతిభా సంపదలున్న వ్యక్తి మీద జీవితం ఏదో రూపంలో కసి తీర్చుకొంటుందంటారు.

మంజరి విషయంలోనూ…
పూర్తిగా »

రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే

మే 2013


రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే

ఒక మనిషి ఒక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడనుకోండి. మొదటి వాక్యం అర్థమైతేనే రెండో వాక్యంలోకి వెళ్తాడు. మొదటి పేరా అర్థమైతేనే రెండో పేరాలోకి వెళ్తాడు. మంచినీళ్లు తాగుతూ ఉంటే అవి కడుపులోకి ఎలా దిగిపోతాయో, పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లోని విషయాలు అలా మెదడులోకి వెళ్లిపోతూ ఉండాలి” –కదా ! అయితే ఇదే ఈ కథ సారాంశం!

కుట్ర కథ గురించి : రంగనాయకమ్మ గారు భాష విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే !! ఏది రాసినా సులభమైన రీతిలో, క్లిష్టమైన విషయాలు సైతం పాఠకుడికి త్వరగా అర్థమయ్యేలా సులభ రీతిలో విడదీసి వివరిస్తారు. సరళమైన వాడుక భాష వాడతారు.…
పూర్తిగా »

సరి కొత్త భావాల్ని స్ఫురింపజేసే కథ “కురూపి”

ఏప్రిల్ 2013


సరి కొత్త భావాల్ని స్ఫురింపజేసే కథ “కురూపి”

కుటుంబరావు గారి పాత్రల్లో అసాధారణ సౌందర్య వతులూ, మేధా సంపన్నులు ,ఆరడుగుల అంద గాళ్ళు ఉండరు. మన చుట్టూ ఉండే సాదా సీదా మనుషులు,వాళ్ళ మానవ సహజమైన కక్షలు, కార్పణ్యాలు, కుళ్ళూ, కుట్రా,ప్రేమా, మోహం అన్నీ ఉంటాయి. మొత్తం మీద జీవితం  స్పష్టం గా ప్రతి బింబిస్తూ  కనిపిస్తుంది . అందుకే ఆయన కథలు చదువుతుంటే అదేదో పెద్ద సాహిత్యం టాగ్ తగిలించిన పుస్తకాలు చదువుతున్న ఫీల్ రాదు. గొప్ప విశ్లేషణ… ప్రతి రచనలోనూ  వరద కృష్ణమ్మ లాంటి ఫ్లో గుక్కతిప్పుకోనివ్వకుండా అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తుంది. దాదాపు 8000 పేజీల సాహిత్య సృష్టి!

ఇప్పటికీ చదివినపుడల్లా విస్తు పోతుంటాను. అంత సాహిత్యాన్ని  ఎలా సృష్టించారని!…
పూర్తిగా »

ఒక మిస్టీరియస్ మునెమ్మ!

మార్చి 2013


ఒక మిస్టీరియస్ మునెమ్మ!

తెలుగు నవలా సాహిత్యం లో మునెమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కథా నాయిక అంటే మునెమ్మ! ఒంటి చేత్తో  కథను నడిపిస్తూ, ఆమె ధైర్య సాహసాలకు, నిబ్బరానికి చకితులవుతున్న పాఠకులను చేయి పట్టి కథ చివరంటా లాక్కు  పోతూ…తను మాత్రం స్థిత ప్రజ్ఞురాలై నడిచిపోతుంది. డాక్టర్ కేశవ రెడ్డి గారి సంచలనాత్మక నవల మునెమ్మ 2007 లో చతురలో మొదట ప్రచురితం అయ్యాక..హైద్రాబాదు బుక్ ట్రస్ట్ విడిగా పబ్లిష్ చేసింది.

బహుళ ప్రజాదరణ పొందిన ఈ నవల అంతే స్థాయిలో విమర్శలకు కూడా గురైంది. రచనా శిల్పం గురించి మునెమ్మ చిత్రణ గురించి, పత్రికల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి. కొన్ని మరీ…
పూర్తిగా »

ఈ కథల్లో కన్నీరు అంటే కరుణ!

ఫిబ్రవరి 2013


ఈ కథల్లో కన్నీరు అంటే కరుణ!

రోడ్డు మీద నడుస్తుంటాం, ఆఫీసులో పని చేస్తుంటాం,.ఏదో ఒక వూరు వెళ్తాం….! ఈ సందర్భాలు అన్నింటిలోనూ కళ్ళ ముందు ఎంతో మంది మనుషులు కనిపిస్తారు. వారిలో కొందరు మనల్ని ఆకర్షిస్తారు. కొందరితో మాట్లాడతాం. కొందరితో స్నేహం కూడా చేస్తాం! మరి కొందరిని అసలు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, గమనించకుండా వదిలేస్తాం..!! అదిగో ఆ వదిలేసిన వాళ్ళే సుబ్బ రామయ్య గారి కథలకు వస్తువులుగా తిరిగి మనకు పరిచయం అవుతారు. మనసులోకి వచ్చిన ఒక ఆలోచనో స్పందింప జేసే ఒక సంఘటనో కాక, తన చుట్టూ ఉన్న మనుషుల్లోంచి సమాజం సులభంగా విసర్జించి పారేసిన వారిని తాను ఎన్నుకుని పరిశీలిస్తూ..ఆ అభాగ్యులతో పాటు ప్రయాణిస్తూ మనల్ని కూడా…
పూర్తిగా »

నేలని నమ్ముకున్న వాళ్ళ కథలు!

జనవరి 2013


నేలని నమ్ముకున్న వాళ్ళ కథలు!

కొన్ని పుస్తకాలు ఎంచేతో జీవితం మీద గొప్ప ఇష్టాన్ని కలిస్తాయి.  పుస్తకం ముగిసి పోయాక గొప్ప ఆలోచనలు అలా చుట్టు ముడతాయి. ఆ ఆలోచనలు అలా ముసురుకుంటూ ఉంటే , ఆ ఇష్టం తాలూకు మైకంలో అలా ఉండి పోవాలనిపిస్తుంది. అలాంటి పుస్తకాల్లో చేరేదే ఫ్రెంచ్  నవల “భూమి”!  La Terre  పేరుతో దీన్ని ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా ఎంతో శ్రమకోర్చి…రాశారు.
ఇది రైతుల కథ. రైతులకు భూమి మీద ఉండే ప్రేమ, వ్యవసాయం మీద ఉండే వ్యామోహం,పాషన్ ఇవన్నీ కూలంకషంగా , క్షుణ్ణంగా చదివి రాయడం అంటే  సామాన్య మైన విషయం కాదు. వ్యవసాయ  స్వరూపాన్నే కాక, అప్పటి సామాజిక,…
పూర్తిగా »