‘ స్వాతికుమారి బండ్లమూడి ’ రచనలు

మానస వెతుక్కున్న చిలకల చెట్టు!

మానస వెతుక్కున్న చిలకల చెట్టు!

“లోపలి మాట” కొత్త శీర్షిక ప్రారంభం
కవిత్వం నిరంతర సాధన ఫలం. ప్రతి కవికీ తనదయిన వాక్యసాధన కోసం అహోరాత్రాలు తపించాల్సి వుంటుంది. కేవలం పొగడ్తలే ఈ సాధనలో పనికి రావు. వాక్య రహస్యం చెప్పే విమర్శ కవిని ముందుకు నడిపిస్తుంది. ఇంకా పదునయిన కవిత దిశగా నడిపిస్తుంది. అలాంటి దారిదీపం ఈ ‘లోపలి మాట’ శీర్షిక. ఒక కవిత తీసుకుని అందులోని లోటుపాట్లని వివరించే శీర్షిక. ప్రతి రెండో శుక్రవారం మీ కోసం!


———————————————————————————————————————–

భావుకత్వపు పందిరి కింద ప్రేమ, ప్రకృతి, జ్ఞాపకాలు, వియోగం అనే నాలుగు స్తంభాలాటలో తమ అనుభూతులను కవిత్వంతో దాగుడుమూతలాడించిడం చాలామంది కవుల్లాగే మానసకూ ఇష్టమైన…
పూర్తిగా »

భ్రష్టయోగి

తిరిగి దొరకడానిక్కాక వెతికించుకోవడానికే
తప్పిపోయిన ఒక పద్యంకోసం
రోజులతరబడీ, రాత్రులవెంబడీ
ఆకలీ ఆహారమూ తనకు తనే అయి
రాసుకున్నాడేవో కొన్ని సౌందర్యోన్మత్త గీతాల్ని…

కిటికీ అంచులు ఏటవాలు నీడల్ని ఇంటిగోడలపైకి జారవిడుస్తూ
ఏకాంతంలో బద్ధకంగా చల్లుకున్న దిగులు గింజల చుట్టూ
బూడిదరంగు పావురాలు రెక్కలు ముడుస్తూ తెరుస్తూ మసలినప్పుడు
పాదాక్రాంతమయ్యాడు ఆ మచ్చికైన హేమంతపు సాయంత్రాలకి…

పగడపు గోరింట పాదాలు ఇసుకలో గీసిన ఇంద్రధనస్సుని
తాడుపైన గారడీలాంటి చూపులతో కౌగిలించబోయి
అగ్గిపుల్లని చూసి అణువణువూ జలదరించిన అగ్ని పర్వతంలా
చర్రున వెనుతిరిగాడు అక్కడొక మల్లెల మంటను రాజేస్తూ…

జీవన్మరణాలు చెరిసగాలైన…
పూర్తిగా »