‘ స్వాతీ శ్రీపాద ’ రచనలు

మనమింతే

మనమింతే

రాలిపోయిన గతాన్నీ
దుమ్ముకొట్టుకుపోయిన స్వగతాలనూ
పునశ్చరణ అద్దాలలో పదిలపరచి
ప్రతినిమిషం అగుపించేలా
కనురెప్పలకే వేళ్ళాడదీసుకుంటాం

బుసలు కొట్టే అహం పడగ నీడ కింద అనుక్షణం
ఆచ్ఛాదనే లేని అంతరంగాలకు
పొరలు పొరలుగా పేరుకుంటున్న
నాగరికత చెద పుట్టల నాచుపొదలు చుట్టుకుంటూ
పడుతూ లేస్తూ కింద పడ్డా పై చేయి మాదంటూ
లేని మీసాలు సవరించు కుంటాం

ఊపిరి ఊసులాడే క్షణం నుండే
నా అనే ఐరావతాన్ని అధిరోహించి
బుడిబుడి రాగాల కపట నాటకాలు
నీలాంటి వారినీ నీలా లేని వారినీ
నీలోని నిన్నూతుడిచేసుకుంటూ
కాలికింద అగాదాల్లోపూర్తిగా »

హృదయ ఘోషకు, సమాజ భాషకూ చక్కని రూపం మౌనశ్రీ మల్లిక్ కవితా దీపం

హృదయ ఘోషకు, సమాజ భాషకూ చక్కని రూపం మౌనశ్రీ మల్లిక్ కవితా దీపం

యుగాన్ని శాసించేది కాలం కాదు కలం
జగాన్ని నడిపించేది ధనం కాదు కవనం

అంటూ దూసుకొచ్చిన కొత్త కవిత్వపు చిరునామా మౌనశ్రీ మల్లిక్.

ఆధునిక సంక్షోభాలనూ అతి సుందరమైన కవితలో చెప్పగల నేర్పు మౌనశ్రీది. కాదేదీ కవిత కనర్హం అతనికి. అయితే ప్రతికవితా చక్కని భావుకతా చిత్రం .ఒక గొప్ప రస సిద్ధి. వస్తు వైవిధ్యం, భావ సౌకుమార్యం, భాషా సముదాయం కూడగట్టుకుని కనిపించే అతని కవిత్వం అతిలోక సుందరి. మరణ రంగస్థల ప్రదర్శన అయినా అలిగిన గొంతు అయినా అతని కలానికి ఒక అలవోక గీత మాత్రమేరూపకాన్ని సాధికారికంగా ఉపయోగించే నేర్పరి.

యుగయుగాల విశ్వంభర సుడిగాలుల్లో చెలరేగిన
ధూళి కణాన్ని…
పూర్తిగా »

కొలకలూరి ఇనాక్ గారి ‘కొలిమి’

ఫిబ్రవరి-2014


కొలకలూరి ఇనాక్ గారి ‘కొలిమి’

కధ జీవితానికో మచ్చుతునక. ఆ జీవితం ఏమిటనేది ఒక్కో కధలో ఒక్కోలా రూపుదిద్దుకు౦టు౦ది. ఆ రూపు దిద్దుకోడంలో చదువరులను వలవేసి లాగి, ఉక్కిరి బిక్కిరి చేసే నైపుణ్యత, అక్షరాలూ ఉలిగా మారి శిల్పాన్ని చెక్కుకునే నేర్పరితనం సంతరించుకుని కధ ముగిసాక ఒక్క క్షణం మనసు చెమ్మగిలేలా కరిగి౦చేదే కధ కదా. పుట్టిన ఘడియ నుండీ చివరి శ్వాస వరకూ ఎన్నో సమస్యలు ఎన్నెన్నో పరిష్కారాలూ. అయితే పరిష్కార సూచనకే రచయిత కధ మాద్యమం ఎంచుకోనవసరం లేదు. చదివిన పాఠకులు తమను తాము పాత్రలతో , వాటి మనస్తత్వాలతో , సమస్యలతో , పరిష్కారాలతో బేరీజు వేసుకుని తమకు కావలసినది ఎంచుకుని అవసరం లేనిది త్యజి౦చగల సమర్ధులు.


పూర్తిగా »

ప్రాచీన కధా లహరికి ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల సరాగమాల డా. ముక్తేవి భారతి

ప్రాచీన కధా లహరికి  ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల  సరాగమాల డా. ముక్తేవి భారతి

తెలుగుతో పాటు చరిత్రలోనూ స్నాతకోత్తర పట్టభద్రులై భాష శాస్త్ర౦ అభ్యసించి చిలకమర్తి సాహిత్య సేవపై పరిశోధన చేసిన సరోజినీ నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతల నిర్వహణతో పాటు సవ్య సాచిలా సాహిత్య ప్రపంచంలోనూ మని రత్నంలా వెలిగారు. పరిశోధనా ప్రచురణలతో పాటు తొమ్మిది కధా సంపుటాలు ,ఎనిమిది నవలలు ,ఎనిమిది సాంఘిక నవలలు ,5మోనోగ్రాఫ్ లు ఒక కవితా సంకలనం నాలుగు వ్యాస సంకలనాలతో వివిధ పత్రికలలో ఎన్నో కాలమ్స్ రాసి , రాస్తూ సాహితీ సదస్సులలో నిరంతరం పాల్గొంటూ అత్యుత్తమ సత్కారాలు పొంది నిరంతరం సాహితీ క్షేత్రం లో విరాజిల్లుతున్న విదుషీమణి డా. ముక్తేవి భారతి.

చిరునవ్వుతో ఆప్యాయత కలగలిపి…
పూర్తిగా »

ఒక అంతరాత్మ

ఒక అంతరాత్మ

ఓ చిటికెడు దోర దోర అనుభూతిని
ఆరుద్ర పురుగులా మెత్తని వెల్వెట్ హృదయంలో
పదిలంగా చుట్టి
చుట్టూ నులివెచ్చని వెచ్చదనానికి
ఎండిన ఆకులూ అలమల్లాటి మాటలు పేర్చి
ఎన్నాళ్ళు వేచి చూడలేదు
పలకబారిన రసాల ఆస్వాదనకోసం?

కసిగాయలు కొరికి కసురుకున్న తమినోదార్చి
చేదెక్కిన అనునయాలు సహనంగా సరిచేసుకు
ఎన్ని చీకటి మడుల్లో వెలుగు విత్తనాలు నాటుకోలేదు
అప్పుడి ఇప్పుడో ఆగిపోయిన కాలం ముళ్ళమీద సుతిమెత్తని అనుభవాలు పరచి
ఎన్ని మార్లు నిన్ను నువ్వు
పూల తివాసీగా భ్రమపెట్టుకోలేదు

ఎండిపోయిన గాలి విత్తనాలై దూర దూరాలకు తరలిపోతున్న
అనుబంధాలకు వీడ్కోలు…
పూర్తిగా »

పొరలు

సెప్టెంబర్ 2013


పొరలు

విశాలి ఆలోచనా ధోరణేమిటో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు నాకు.

పోనీ అలాగని అదేం నిన్నమొన్న పరిచయమైన కొత్త మొహం కాదు. స్కూల్ రోజుల నుంచీ పెరుగుతూ వచ్చిన స్నేహం. ఎప్పుడు మొదటి సారి కలిశాం, ఎలా అన్నది అంతగా గుర్తులేదు కాని తరువాతెప్పుడో తెలిసింది యూ.కే.జి నుండి ఇద్దరం ఒకే స్కూల్, ఒకే సెక్షన్ అని. అది మొదటి వరస చివరన గోడపక్కన కూర్చుంటే నేను దాని వెనక వరసలో దాని వెనకాలే కూర్చునే దాన్ని. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, చాలా సార్లు టెస్ట్ లన్ని దాని దగ్గర నుండే కాపీ కూడా కొట్టేదాన్ని. ఏం చెయ్యను ? ఇంట్లో అమ్మ తన…
పూర్తిగా »

పరిమళాలు మిగిల్చిన మాలతి

23-ఆగస్ట్-2013


పరిమళాలు మిగిల్చిన మాలతి

ఒక యుగం ముగిసిపోయింది . ఒక రచనా కురువృద్ధు రాలు తెరమరుగయిపోయారు. 84 సంవత్సరాలు సాహితీ ప్రపంచపు సామ్రాజ్ఞి చాలిక సెలవంటూ తరలిపోయారు.

బాల్యంలోనే ప్రమదావనాలు చదివి వ్యక్తిత్వాన్ని దిద్దుకున్న నేను ఆవిడ శిష్యురాలిని. నిన్నటి వరకూ కూడా ఆవిడ పాత కెరటాల్లో ఓలలాడటం, నన్ను అడగండి అంటూ చెప్పే జవాబుల్లో లోకాన్ని దర్శించటం ఇప్పుడిప్పుడు జరుగుతున్నట్టే ఉంది. ఆవిడ ప్రతి నవలా ఎన్నిసార్లో చదివి ఉంటాను .

“అమ్మాయ్ , నేర్చుకుంటూ నలుగురికీ చెప్పడమే నేను చేస్తున్న పని. నీ చుట్టున్న ప్రపంచానికి నీ రచన ఒక మార్గదర్శి కావాలి, ఒక దీపం కావాలి . ఒక చేతి కర్ర కావాలి. ఒక ఊతమవాలి”…
పూర్తిగా »

బెంగ

09-ఆగస్ట్-2013


సౌకర్యాలు వడ్డించిన జీవితం
కళ్ళముందరే ఉన్నా
నోట్లో నీళ్ళూరడం మాట దేవుడెరుగు
తలతిప్పి చూసేందుకే వెగటుగా ఉంది

నిలువెల్లా దిగులు పేరుకున్న మనసు
అటు తెగించి వర్షించనూ లేక ,
ఇటు బరువును నిలవరించనూలేక
ఉండీ ఉండీ శ్రావణ మేఘమవుతోంది

నిస్సంశయంగా నిరామయంగా
కన్నతల్లి చీర కుచ్చిళ్ళ వెచ్చదనంలో
పదిలంగా తలదాచుకున్న బాల్యపు తమి
ఎన్నాళ్ళైంది మాతృ భూమి పచ్చని చేతుల్లో ఒదిగి

గాలి పరవళ్ళతో పోటీ పడినా
సప్త సముద్రాల ఎల్లలు కొలిచి గర్వపడినా
కాలి స్పర్శకైనా తగలని పరాయినేల
నల్లకళ్ళద్దాలు దాచేసిన చూపులైనా
ఎలా…
పూర్తిగా »

ఎన్నాళ్ళయిందో

ఉదయపు నిద్రలో జోగే ఆ బాల్యపు తార్రోడ్డు నిలువెల్లా
కెరటాల్లా పరచిన వలిపెపు మంచు తెరలపై
చినుకుల్లా రాలిపడే పున్నాగ దరహాసాలను
మసక చీకటి ఏకాంతాన మనసారా ఏరుకుని
ఎన్నాళ్ళయిందో

అనాది కాలపు ఆత్మవంచనలు పీల్చుకుంటూ
గొంతు దిగని అవమాన గరళాల్లో దహించుకుంటూ
తాగివాగే ప్రేలాపనల అంపశయ్యపై వెల్లకిలా పరచుకుంటూ
ఈ మధ్య కాలాన కాకెంగిలి చూపుల కల్మషాల్లో అభిషిక్తమైన
ఆత్మాభిమానం ప్రక్షాళించుకుంటూ
దిగంతాల వరకూ వెదజల్లిన పూరెక్కల సౌకుమార్యం
రాత్రికి రాత్రే కంటికి కనిపించకుండా
కడుపారా ఆరగిస్తున్నగొంగడి పురుగుల పిల్లలకు
బలిచేస్తూ ఎన్నాళ్ళిలాగ ?

అడుగడుగునా…
పూర్తిగా »

వెతికి వేసారి

నిశ్చలమైన ఉపరితలానికి
ఓ గాలి చిరు స్పర్శ
వలయాలు వలయాలుగా
పులకరింతలను పొటమరిస్తుంటే
ఆవిరైపోతున్న ఉనికి
నీడలు నీడలుగా
చూపుకందని దూరాలకు తరలిపోతూ ….

నిలువెల్లా కరిగి కరిగి
ప్రవహించటం మర్చిపోయిన నదినై
ఆకాశానికీ బీటలు వారిన భూమికీ మధ్యన
అదృశ్య రూపాలతో
కట్టిపడేసిన హరిత వనాన్నై
శూన్యంలో చూపులనూ చూపుల్లో శూన్యాన్నీ
భూమధ్య రేఖ నట్ట నడి భాగాన
విత్తనాన్ని చేసి పాతేస్తూ …

ఉదయానికీ అసుర సంధ్యకూ మధ్యన
ఊసుపోని చింపిరి జుట్టు గతంలోకి
వేసవి సాయంకాలాలు వేడికి సుళ్ళుతిరిగిన

పూర్తిగా »