సాయంకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, పగలంతా అలిసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా నిద్రదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్లనుంచి ఇళ్లవైపుకి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తల్చుకొని బాధని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరుల నిశ్వాసతో అంటిన పాపాన్ని కడుక్కుంటున్నాడు. పాకలలో అమ్మ పాలకోసం ఎదురుచూస్తూ న్న దూడలు పెద్దవిగా చేసిన గుండ్రటి కళ్లని చూసి, అంత అందంగా అవ్వటం ఈరోజు కూడా కుదరలేదనుకుంటూ ఆకాశంలో సూర్యుడు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్