కథ

కారు పున్నమి

కారు పున్నమి

మెమోరియల్ డే వీకెండుకి అభినవ్ ని చూసుకునేది నావంతొచ్చింది. స్లీపింగ్ బేర్ డూన్స్ చూడ్డానికి వెళ్దామని ప్లాన్ చేశాను. ఈ సారి ట్రిప్ అంతా, ఎక్కడా ఏ ఒడిదుడుకులు రాకుండా రిజర్వేషన్లూ, అక్కడికెళ్ళాక ఏ పూట ఏమేమి చెయ్యాలీ అన్నీ జాగ్రత్తగా తయారు చేశాను, మధ్య మధ్యలో అభినవ్ ని కూడా వాడి ఇష్టాయిష్టాలు కనుక్కుంటూ. వాడికీ పన్నెండేళ్ళొచ్చాయిగా. తనే అన్నాడు, హైకింగ్ చేద్దామని.

వాళ్ళమ్మ శుక్రవారం ఎప్పుడైనా వచ్చి వాణ్ణి పిక్ చేసుకోమన్నది . అసలు శుక్రవారం శలవ తీసుకుందామని ప్రయత్నించాను కానీ క్లయంట్ స్టేటస్ మీటింగుకి నేను లేకుండా కుదరదని బాసు పట్టు పట్టాడు. అంత ముఖ్యమైన మీటింగు సరిగ్గా లాంగ్ వీకెండుకి…
పూర్తిగా »

రంగ పిన్ని ఆకాశం

జూలై 2013


రంగ పిన్ని ఆకాశం

నాకు రంగ పిన్ని అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టమంటే అమ్మ కన్నా ఇష్టం . అమెరికా నుంచి సెమిస్టర్ break కోసం ఇండియాకి వచ్చిన మర్నాడే , పిన్ని ఇంటికి వెళ్ళాలి అన్నంత ఇష్టం . అమ్మ చంపేస్తుందని ఆగాను గానీ, లేదా అక్కడే దిగేదాన్ని. అందుకే అమ్మ చెప్పిన మాట విని , తాగుతున్న ఫిల్టర్ కాఫీ గొంతులో గరళం అయిన ఫీలింగ్ వచ్చింది . ” రంగ విషయం ఏమీ తెలీదురా .. మారిపోయింది పూర్తిగా, నాకేం నచ్చలేదు ” అన్నది అమ్మ. ” అదేంటమ్మా అలా అంటావ్? రంగ పిన్ని ఏం చేసింది? బాబాయితో ఏమన్నా గొడవా ? ”…
పూర్తిగా »

గజల్

గజల్

‘అప్పటికే ముగ్గురొచ్చారు. దాని ఒళ్ళంతా నీరసంగా ఉంది బాబు. అది చిన్న పొల్ల ఏదో పొట్ట కూటికే మా తిప్పలు గాని, దాని ఒళ్లమ్మి మిద్దెలు కట్టాలని నాకు లేదు నాయన. ఈ పొద్దుకు దాన్ని వొదిలెయ్..’
‘లేదండి నేను తనని ఇబ్బంది పెట్టను. కాసేపు తనతో మాట్లాడి వెళ్తాను.’
‘సరే అది పడుకుంది. అదో ఆ గదిలో..’
మక్కా పావురాలు ఇక్కడదాక వస్తాయి కాబోలు. గోడలు మొత్తం రెట్టలమయం. పాతికపైనే గురుకు గురుకుం అంటూ గూన పెంకుల చివర కొనలను, బట్టలారేసే దండాలను తాపీగా ఆక్రమించేసుకొని, నైజం ఆనవాలని కొద్దో గొప్పో చాటి చెప్తూ, శిధిలానికి చేరువలో, నవీనానికి దూరంలో,…
పూర్తిగా »

తోడు

తోడు

“This was many years back …” అంటూ మొదలుపెట్టాడు కెవిన్. నేను అప్రయత్నంగా నా చేతిలో ఉన్న సెల్‌ఫోను నొక్కి టైము చూసుకున్నాను. కెవిన్ ఇలా మొదలుపెట్టాడంటే ఆ మొనోలాగ్ కనీసం ఒక గంటసేపైనా ఉంటుందని తెలుసు. అది ఎక్కువగా తన జీవితంలో జరిగిన సంఘటనలతో, ఆత్మస్తుతీ, పరనిందా కలిపి సాగుతుంది. ఇదివరకు చెప్పిన విషయాలే వందోసారో, నూట పదోసారో మళ్ళీ అంత కొత్తగానూ చెప్పబోతాడు. ఈ టీములో ఐదారేళ్ళ సర్వీసులో ఇలాంటి అనుభవం ఎన్నోసార్లు ఎదురయింది. కానీ, బాసు కదా, ఏమీ అనటానికిలేదు. దీన్నుంచి బయటపడే మార్గం ఒక్కటే .. ఆయనకైనా, నాకైనా ఫోను వస్తే, సంభాషణ తెగిపోతుంది. అక్కడినుంచి మెల్లగా జారుకోవచ్చు.…
పూర్తిగా »

మహాశ్వేత

జూలై 2013


హేమంతంలో ఒక సాయంకాలం. దారికి అటూ ఇటూ పసుపు పొలాలు,అరటితోటలు,వాటి పరాగం.అద్దాలు దించి ఆ గాలిని గుండెనిండుగా తీసుకుంటే శక్తి వచ్చినట్లనిపించింది అతనికి.ఈ ప్రయాణం బొత్తిగా కొత్తవూరికయితే కాదు ,కాని ఎన్నేళ్లో అయిపొయింది వచ్చి.చదువంతా మహానగరాలలో, పరదేశంలో. తర్వాత వుద్యోగం ఢిల్లీలో. ఏవో కొన్ని ఉన్నభూములనీ చూస్తూవస్తున్న బాబాయి కాలం చేశాక రాక తప్పలేదు ఇప్పుడు. వచ్చే ముందు ఫోన్లలో పరిస్థితులు కనుక్కున్నాడు,ఆ వ్యవహారమంతా ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఆరేడు నెలలు పట్టేటట్లుంది.
ఒక పెద్ద పట్టణానికి దగ్గ్రగా వున్న ఈ పల్లెటూళ్లో ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం వుందనీ,అక్కడ కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ అధ్యాపకుడిగా కావాలనీ విన్నప్పుడు యథాలాపంగా పెట్టిన దరఖాస్తుకి వాళ్లు…
పూర్తిగా »

పాలగుండెలో ఏదీ దాగుందో..!!

చిన్నప్పటి రోజులు చాలా అందంగా వుంటాయని..మళ్లీ అవి వచ్చేస్తే ఎంత బాగుండు!! అని మనం చాలాసార్లు అనుకొంటుంటాం. ఒక్కోమారు,అలా అనుకోవటం నాకెందుకో నచ్చదు. అలాగని ఆ రోజుల్నిప్రేమించొద్దని,వాటికి విలువలేదనీ నేననను. ప్రస్తుతావస్థని ప్రేమించలేనివారు గతాన్ని ఏం ప్రేమిస్తారని నా వాదన! ఎప్పుడూ జరిగిపోయినవే మనకు అపూర్వంగా తోయటం, వర్తమానాన్ని యాంత్రికంగా భావించటం!! ఆలోచనలను జరిగిపోయిన విషయాలపైనే సంధించి, వాటిని మధురక్షణాలుగా భావించి(నిజానికి వాటిని ఆ సమయం లో ఎంతో నిర్లిప్తంగా అనుభవించి వుంటాం!) ..నేటి జీవితాన్ని ఆనందించక పోవటం మనం చేస్తున్న పని! ఈ విషయాన్ని తెలుసుకోటానికి కొంతమందికి ఓ జీవితకాలం పడుతుందనుకుంటా! అందులో నేనూ ఒకర్ననిపిస్తోంది. అందుకే మీకిప్పుడు నా కబుర్లు చెప్పాలనిపించింది.

పూర్తిగా »

పాపం

పాపం

“నారిగా, ఇంకా ఎంతసేపు రా, అర ప్యాక్ సిగరెట్లు బూడిదయ్యాయిప్పటికే, చిక్కడపల్లీ S.V కార్నర్ కేఫ్ కొచ్చెయ్,
హీరోయిన్ దొరికిందా, రాత్రిలోగా షూటింగ్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ఎల్లుండి వరకు ఐపోతేనే మనకు డబ్బులిస్తాట్ట..”

“అన్నా, వొస్తున్నా, పాత హీరోయిన్కి కడుపట, వేరేవాళ్ళను వెతికేసరికి ఇలా, బాబాయ్ ఫోన్చేసాడు నువ్ మొబైల్ ఆన్సర్ చేయట్లేదని, ఫైనాన్స్ వాడు ఇంటికొచ్చి గొడవేసుకున్నాడట, ఇంతకీ హీరోయినెవరో తెలుసా, నీ ఫ్రెండ్ సుధీర్ వైఫ్..సుధీర్ కస్టాల్లో ఉన్నాడని తెల్సుగానీ, మరీ ఇంతా..”

“సర్లే, వొచ్చాక మాట్లాడదాం, లత ముందు ఇవేం వాగకు, కార్లోనే గా, జాగర్తగా డ్రైవ్ చెయ్”
వాడి మాటలతో ఆలోచనలెటు పరిగెడ్తున్నాయో తెలీక సంభాషణని…
పూర్తిగా »

సౌభాగ్యం రోడ్డున పడింది . (దానికి మనవేం చేస్తాం !)

లోకం తెలీని ఆరేడేళ్ళ పసిపిల్ల , ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకున్న రోగిష్టి మొగుడు , నాలుగు సంచుల్లో కుక్కిన గుడ్డలు -చిన్నా చితకా సామాను, చెంబూ తపేలాలతో సహా భాగ్యం రోడ్డున పడింది. దానికి సాయం బక్కచిన్నిన ఆవొకటి కాళ్ళకీ మెడకీ బంధాలు వేసుంది , ఒక్క గడ్డిపరకయినా దొరక్కపోతుందా అని ఆబగా నేల నాకుతుంది .

ఉన్నపళంగా ఇలా జరగడంతో మతిపోయినట్టూ పిచ్చిగా అరుస్తుంది భాగ్యం .కన్నోళ్ళనీ కట్టుకున్నోడినీ ఆడిపోసుకోటం అయిపోయాకా , కనిపించినోళ్ళందర్నీ తిట్టడం పట్టింది. ఇదివరకెప్పుడూ భాగ్యం అంతలా ఆవేశపడటం , ఆక్రోశించడం నేను చూళ్ళేదు.

” కులకండి బాబూ….బాగా కులకండి . మీరంతా పెట్టిపుట్టినోళ్ళు , ఒకటికి నాలుగు మేడలు…
పూర్తిగా »

దోషి

ఇంటికి తాళం పెట్టి ఉంది. వాకిట్లో ముగ్గు లేదు. ఏమయ్యిందో రమణకు. తమ ఊరెళ్ళి పోయి ఉంటుందా. ఆమె తల్లీదండ్రీ వచ్చి తీసుకెళ్ళిపోయుంటారా? అమ్మో తనమీదే ప్రాణాలు రమణకు అనుకుంటూ ఇంటి వెనక వేపువెళ్ళి వెతికాడు. అక్కడా లేదు.

దణ్ణెం మీద బట్టలారేస్తూ పక్కింటి పద్మ కనిపించింది.

“రమణ ఏది?”

“దొరగారింటికెల్లింది.”

“ఇంట్లో పని చెయ్యడానికెల్లుంటది.”

పద్మ బదులు చెప్పలేదు.

బరువుగా ఉన్న సంచీతోనే యజమాని ఇంటివేపు పరుగు లాంటి నడకతో వెళ్ళాడు.

గేటులోంచి చూస్తే ఇంటి బూజు దులుపుతున్న రమణ కనిపించింది.

గేటులో నారాయణ ను చూడగానే బూజు కర్ర ఒద్దికగా పక్కన పెట్టి చీర కుచ్చిళ్ళు సరి చేసుకుని దగ్గరకొచ్చింది.

దొర ఇంట్లో,…
పూర్తిగా »

మైధిలి

ఏప్రిల్ 2013


మైధిలి

“ఏంటీ, మీ ఆవిడ కనపడ లేదు ప్రొద్దుటి నించీ? ఓ సారి చూడందే నాకు పొద్దు పోదని చెప్పరాదె”, జంకు ఛాయలు ఏ మాత్రం లేకుండా అడిగేశాడు రాణా. హద్దులు కట్టుకున్న సహనం ఒక్క సారిగా ఆవిరైపోయింది రఘులో. వెనక ఉన్న పటాలాన్ని కూడా పట్టిచ్చుకోకుండా, ఒక్క దూకుతో రాణాతో కలబడ్డాడు. ఎక్కువ సేపు పోరాటానికి ఆస్కారం లేకుండా అందరూ కలసికట్టుగా రఘూ ని చితక్కొట్టేశారు.

శరీరం పైన తగిలిన గాయాలకన్నా, మైధిలి నోట వినాల్సివచ్చే శూలాల లాంటి మాటల పోట్ల వల్ల కలగబోయే బాధను ఉహించుకుంటూ, ఆలోచనలు ఎంత వెనక్కి లాగుతున్నా, ఇంటి వైపు కాళ్ళీడ్చటం మొదలెట్టాడు రఘు.

రఘు, మైధిలి, హైదరాబాద్ వదిలి,…
పూర్తిగా »