కాయితప్పడవ

పాటలు మన ఇంటి ముందు చిన్ని వానలో మనమే వదులుకునే చిన్ని కాయితప్పడవలు.

ఇజాజత్

ఇజాజత్

గుల్జార్ అంటేనే పాటల వనమాలి. 1986లో విడుదలయిన ‘ఇజాజత్” అనే మరచిపోలేని సినిమాలో మరచిపోలేని పాట ఇది.

నేను నాతో తెచ్చుకోలేని జ్ఞాపకాలు కొన్ని నీకై వదిలేశాను ప్రియా, వాటిని పదిలపరుచుకో.

నా మేలిముసుగు మాటున వుండే సిగ్గును, నీ మది దొంతరల వెనకాలె వదిలేశా, దానిని అనునయించి నీ మదిగది దాటకుండా చూసుకో.

మన అబేధ్యమైన హ్రుదయాలు కన్న కలలన్నీ కలిపి అక్కడే వదిలేశా… వాటిని నీ కనురెప్పల మాటునే పదిలంగ దాచుకుంటావ? నీ అడుగుల మాటున వేసిన అందెల సందడి లో నా మావి చిగురుల వెండి పట్టీ  వొకతి ఆ కలల రహదారులలో పడిపోయింది, నీవు మరలి వెళ్ళి…
పూర్తిగా »