లోపలి మాట

కవిత్వం నిరంతర సాధన ఫలం. ప్రతి కవికీ తనదయిన వాక్యసాధన కోసం అహోరాత్రాలు తపించాల్సి వుంటుంది. కేవలం పొగడ్తలే ఈ సాధనలో పనికి రావు. వాక్య రహస్యం చెప్పే విమర్శ కవిని ముందుకు నడిపిస్తుంది. ఇంకా పదునయిన కవిత దిశగా నడిపిస్తుంది. అలాంటి దారిదీపం ఈ ‘లోపలి మాట’ శీర్షిక. వొక కవిత తీసుకుని అందులోని లోటుపాట్లని వివరించే శీర్షిక.

రోజు వారీ భాషకి దూరమవుతున్నామా?

రోజు వారీ భాషకి దూరమవుతున్నామా?

లోపలి మాట రాయాలనుకున్నప్పుడు అది నెగటి”వ్‌ షేడ్‌ లోనే వుండాలా? చెత్త కవితనే ఎన్నుకోవాలా? అట్లా కాకుండా ఒక మంచి కవితను తీసుకొని, అది అంతకంటె మంచిగ వుండే అవకాశాల్ని చూడొచ్చా? అనేది ఒక సందేహం. తెలుగు సాహిత్యంలో ఇప్పటికే విమర్శని అంగీకరించని వాతావరణం రాజ్యమేలుతున్న సందర్భంలో అది ఎట్లాంటి సంబంధాలకు దారితీస్తుంది. లబ్దప్రతిస్టులైన, అతి దగ్గరి వ్యక్తిగత సంబంధాలు గల వాళ్ళ రచనల పట్ల నా నిజమైన లోపలి మాటను బయటపెట్టడంలో నాకు ఒకింత అసౌకర్యం వుంది.అనుభవజ్ఞులు ఇప్పటికే ,నన్ను విమర్శా రంగంలోకి వెళ్ళవద్దనే సలహా ఇచ్చియున్నరు. ”ఇరువాలు” దున్నడం అలవాటైన వాన్ని కనుక ఇష్టమైన కవిత మీద ‘లోపలి మాట’ రాయడానికి సిద్దపడ్డాను.…
పూర్తిగా »

వేదన పలచ బడిన గీతం

29-మార్చి-2013


వేదన పలచ బడిన గీతం

కవిత్వానికి”లోపలి మాట” ను చెప్పడమంటే ఒక విధంగా చాలా కష్ట సాధ్యమే. కవిత ఎంపిక దగ్గర్నించి కవిత్వపు సారాంశం నమిలి మింగే వరకూ.

అసలు ఏ కవితని ఎలా ఎంచుకోవాలి? చదివిన ప్రతి కవితలోనూ కొన్ని లోపాలు, కొన్ని అద్భుతాలూ కనిపిస్తూంటే-ఒకోసారి అయ్యో మనిమిలా రాయలేకపోయామే అని దిగులు, ఆశ్చర్యం! ఎంత బాగా రాసారన్న ఆనందం! కవితలు చదూకుంటూ పోతూ, కవిత్వమే నిబిడాంధకారాన్ని తొలగించే రాత్రి చేతి దీపమై నడచుకుంటూ పోతూంటే ఎక్కడో ఒక ముల్లు కాలికి గుచ్చుకున్నట్లు ఒక కవిత వ్యధ పెడితే అది నిన్ను వదలకుండా వేధిస్తే అది నిజంగా ఒక కవిత-

అయినా కొన్ని కవితలు విసిగిస్తే ఆ కవితకున్న పేరు…
పూర్తిగా »

మానస వెతుక్కున్న చిలకల చెట్టు!

మానస వెతుక్కున్న చిలకల చెట్టు!

“లోపలి మాట” కొత్త శీర్షిక ప్రారంభం
కవిత్వం నిరంతర సాధన ఫలం. ప్రతి కవికీ తనదయిన వాక్యసాధన కోసం అహోరాత్రాలు తపించాల్సి వుంటుంది. కేవలం పొగడ్తలే ఈ సాధనలో పనికి రావు. వాక్య రహస్యం చెప్పే విమర్శ కవిని ముందుకు నడిపిస్తుంది. ఇంకా పదునయిన కవిత దిశగా నడిపిస్తుంది. అలాంటి దారిదీపం ఈ ‘లోపలి మాట’ శీర్షిక. ఒక కవిత తీసుకుని అందులోని లోటుపాట్లని వివరించే శీర్షిక. ప్రతి రెండో శుక్రవారం మీ కోసం!


———————————————————————————————————————–

భావుకత్వపు పందిరి కింద ప్రేమ, ప్రకృతి, జ్ఞాపకాలు, వియోగం అనే నాలుగు స్తంభాలాటలో తమ అనుభూతులను కవిత్వంతో దాగుడుమూతలాడించిడం చాలామంది కవుల్లాగే మానసకూ ఇష్టమైన…
పూర్తిగా »