కిటికీలో ఆకాశం

సంస్కారం మరిచిపోతున్న లోకం కోసం రాజేసిన అగ్గి- దర్భశయనం ‘అగ్ని సంస్కారం కోసం’

సంస్కారం మరిచిపోతున్న లోకం కోసం రాజేసిన అగ్గి- దర్భశయనం ‘అగ్ని సంస్కారం కోసం’

ఉదయం నిద్ర లేచి బయటికి వెళ్ళినపుడు, మన వీధి అవతలి వీధిలో రాత్రి ఒక ఆడపిల్ల మీద జరిగిన యాసిడ్ దాడి గురించి ఎవరో మనకొక వార్త చేరవేస్తారు. ఒక్క క్షణం నిట్టూర్చి, మనం తిరిగి మన రోజువారీ నడకలో ముందుకు వెళ్లి పోతాం.

ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ వార్తా పేపరు తెరిస్తే, వరకట్నం తేలేదన్న కోపంతో భార్యను కాల్చి చంపిన ఒక కిరాతక భర్త గురించిన వార్త కనిపిస్తుంది. మరొక నిట్టూర్పు విడిచి, పేజీ తిరిగేసి సినిమా పేజీ లోకి వెళ్లి పోతాం.

ఎందుకంటే, మనం చల్లబడిన వాళ్ళం. ఒంట్లోని వేడి చల్లారిపోయిన వాళ్ళం.

కానీ, సున్నిత మనస్కుడైన కవి అట్లా…
పూర్తిగా »

కూలిన విశ్వాసాల పైన ఎగిరేసిన నిరసన పద్యం

కూలిన విశ్వాసాల పైన ఎగిరేసిన నిరసన పద్యం

కాళ్ళకింది భూమి కదిలిపోయే భూకంపం ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా?

నీడలా కొమ్ముకాసే ఆకాశం భళ్ళున ముక్కలై పోయి శరీరాన్ని గాయాల కూడలి చేయడం ఎన్నడైనా అనుభవం లోకి వచ్చిందా? ఒక గుడ్డి నమ్మకంతో పీల్చే ప్రాణ వాయువు మరుక్షణంలో విష పూరితమై నాసికల్ని భగ్గున మండించడం ఏ రోజైనా అనుభవం లోకి వచ్చిందా?

1992వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఒక సంఘటన ఈ దేశం లోని ముస్లింలకు అట్లాంటి గగుర్పొడిచే అనుభవాన్ని మిగిల్చింది. ఈ దేశాన్ని లౌకిక రాజ్యంగా నడుపుకుందామని ఈ దేశ ప్రజలు చేసుకున్న ఒక చారిత్రక ఒడంబడిక ఇచ్చిన విశ్వాసానికి ప్రమాదం సంభవించిన చీకటి రోజు అది. అది ఎంతటి చీకటి…
పూర్తిగా »

ఒక తీయని ప్రణయ ప్రయాణం – సీతారాం పద్యం

ఒక తీయని ప్రణయ ప్రయాణం – సీతారాం పద్యం

ప్రేమలో ఉన్నప్పటి స్థితి బహు విచిత్రమైనది. మరీ ముఖ్యంగా, ఎదుటి మనిషి కూడా తన పట్ల ఒక ఇష్టాన్ని ఏదో కలిగి వున్నారని ఒక ఊహలాంటిదేదో మనసులో కదలాడినపుడు ఇక ఆ ఊహ ఆ మనిషిని భూమికి కొన్ని అడుగుల ఎత్తున నడిపిస్తుంది.

ప్రేమలో వున్నపుడు లోకం లోని కాలమంతా తన సొంతమై పోవాలనీ, సొంతమైన ఆ కాలమంతా నిరంతరం ఆమె సమక్షం లోనే గడిచి పోవాలనీ, ఎన్నెన్ని ఊహలో కదలాడి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి కదా!

అలాంటి స్థితిలో, ఆమెతో కలిసి చేసిన ఒక చిన్ని బస్సు ప్రయాణ అనుభవాన్ని కూడా కవి సీతారాం ఒక అందమైన పద్యంగా ఎట్లా మనతో పంచుకుంటున్నాడో చూడండి!

ఆమె…
పూర్తిగా »

మనిషి పతన కథను విప్పిన జింబో పద్యం

మనిషి పతన కథను విప్పిన జింబో పద్యం

“Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash” -Leonard Cohen

‘నువ్వు జీవించి వున్నావనడానికి కవిత్వమే సాక్ష్యం. నీ జీవితం దగ్ధమవుతున్నపుడు, రాలిపడే బూడిదే కవిత్వం’ అంటాడు ‘లియోనార్డ్ కోహెన్’ అనే కవి.

కొందరు కవులు తమ జీవితం దుఃఖ పూరితమైనపుడు, తమ జీవితం దగ్ధమవుతున్నపుడు మాత్రమే కవిత్వంగా రాలి ఆగిపోరు. అటువంటి కవులకు చుట్టూ వున్న మనుషులూ, వాళ్ళు నివసించే సమాజం, ప్రకృతీ ఇవన్నీ వేర్వేరు అంశాలు కావు. ఒక అంశంలో పతనానికి మరొక అంశం పతనంతో కార్యకారణ సంబంధం వుంటుందనీ, అట్లాంటి విడి…
పూర్తిగా »

తోడుని కోల్పోయిన మనిషి దుఃఖం – దేవరాజు మహారాజు పద్యం

తోడుని కోల్పోయిన మనిషి దుఃఖం – దేవరాజు మహారాజు పద్యం

భూమినీ, సముద్రాన్నీ, చెట్లనూ, పశు పక్ష్యాదులను సృష్టించిన తరువాత, దేవుడు పురుషుడిని సృష్టించాడట! ఆ ఒంటరి పురుషుడు దిగాలుగా వుండడం చూసి, చలించిపోయిన దేవుడు, మాట్లాడుకోవదానికైనా, పోట్లాడుకోవదానికైనా అతడికి ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి ఒక స్త్రీని సృష్టించాడట దేవుడు.

ఎంతో సానుభూతితో, కరుణతో అతడికి ఒక తోడుని ఇచ్చిన ఆ దేవుడే అర్థాంతరంగా అతడి నుండి ఆమెను వేరు చేసి, ఆమెను తన వద్దకు తిరిగి తీసుకు వెళ్ళిపోతే ఎంత దుఃఖం? సంక్లిష్ట నగర జీవన విధానంలో భారంగా రోజులు గడిపే, వయసు పైబడిన మగ వాడికి ఆ కష్టం ఎంత దుర్భరం?

ఎంతో భారమైన ఆ దుఃఖాన్ని కవిత్వం చేసి,…
పూర్తిగా »

లోపలి అంతరాలను ప్రశ్నించిన కవి యాకూబ్ గళం – అవ్వల్ కల్మ

సెప్టెంబర్ 2016


లోపలి అంతరాలను ప్రశ్నించిన కవి యాకూబ్ గళం – అవ్వల్ కల్మ

పీడనకు గురవుతున్న సమాజం నుండి కొన్ని బలమైన నిరసన గళాలు వినిపించినపుడు, ఆ మొత్తం సమాజం గాయాలని ఆ గళాలు గానం చేస్తున్నాయనీ, పీడనకు గురవుతున్న ఆ సమాజం మొత్తానికి బలమైన ఆ కొన్ని గళాలే ప్రాతినిథ్యం వహిస్తున్నాయనీ ఆ సమాజం అవతలి వాళ్ళు భావిస్తారు. కానీ, క్రమక్రమంగా ఈ బలమైన గళాల వలన అవమానాలకూ, పీడనకూ గురైన ఆ సమాజం లోపలి అట్టడుగు గళాలు, మరి ఈ సమాజం లోలోపల పీడనకు గురవుతున్న మా సంగతేమిటని ప్రశ్నల్ని సంధిస్తాయి. పీడనకు గురి అయ్యే ఏ సమాజమైనా తన దుస్థితికి కారణమైన మహా బలమైన వ్యవస్థతో తలపడే ముందు అంతర్గతంగా పరిష్కరించుకోవలసిన అంతరాలను ఈ…
పూర్తిగా »

దయనీయ వృద్ధాప్యాన్ని కళ్ళకు కట్టిన శివారెడ్డి పద్యం

దయనీయ వృద్ధాప్యాన్ని కళ్ళకు కట్టిన శివారెడ్డి పద్యం

మనిషి జీవితానికి సంబంధించిన బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశలలో అత్యంత దయనీయమైన దశ ఏదంటే, అది నిస్సందేహంగా వృద్ధాప్యమే!

చూస్తూ వుండగానే, ఖడ్గ ఖచితంగా భ్రమింపజేసిన దేహం పటుత్వం తప్పి కదలికలను కట్టడి చేస్తుంది. విశాల లోకాన్ని చుట్టి వచ్చిన జ్ఞాపకాలు ఒక చిన్ని గదికి పరిమితమైన స్థితిని చూసి భోరున విలపిస్తాయి. చూస్తూ వుండగానే కనీస పలకరింపులు కూడా కరువయే అస్తిత్వం మరింతగా భయపెడుతుంది!

మ్యాథ్యూ ఆర్నాల్డ్ అంటాడు -

It is to spend long days
And not once feel that we were ever young;
It is to add, immured

పూర్తిగా »

కనుపాప లోని కరుణ – శిఖామణి పద్యం

కనుపాప లోని కరుణ – శిఖామణి పద్యం

కవిత్వాన్ని ఎందుకు ఇష్టపడతాము?

బహుశా, మనలో అడుగంటి పోతున్న కొన్ని సున్నిత భావాలను తట్టి లేపే గుణమేదో కవిత్వంలో వుండడం వలన అనుకుంటాను.

బహుశా, మనిషిగా సాటి మనుషుల పట్ల ఇంత ప్రేమా, ఇంత దయా కలిగి వుండ వలసిన కనీస ధర్మాన్ని మనకు జ్ఞాపకం చేసే లక్షణమేదో కవిత్వంలో వుండడం వలన అనుకుంటాను.

మన రోజు వారీ యాంత్రిక జీవితంలో సరిగా చూడని, పట్టించుకోని కొన్ని దృశ్యాలను, కొందరు మనుషులను కవి దర్శిస్తాడు అనుకుంటాను.
పై పై చూపులతో, ఉపరితల స్పర్శలతో మనం సరి పెట్టిన అనేక దృశ్యాల, మానవుల, మనుషుల సంబంధాల, రాజకీయాల, ఇతరత్రా అనేక అంశాల లోలోపలికి వెళ్లి…
పూర్తిగా »

ముక్కలైన గుండెలో వికసించిన ప్రేమ పద్యం పెన్నా శివరామకృష్ణ కవిత

ముక్కలైన గుండెలో వికసించిన ప్రేమ పద్యం పెన్నా శివరామకృష్ణ కవిత

విఫల ప్రేమని వర్ణిస్తూ రాగయుక్త ద్విపదలలో సాగే గజల్ లో గొప్ప సౌందర్యం వుంటుంది. అది ఏక కాలంలో విఫల ప్రేమ లోని బాధనీ, జయాపజయాలతో సంబంధం లేని ప్రేమ లోని మాధుర్యాన్నీ మన అనుభవం లోకి తెస్తుంది. గజల్ శకలాలు శకలాలుగా కనిపించినా, రంగుల పూసలను కలిపే దారం వలె దాని అంతః సౌందర్యం వుంటుంది. స్త్రీ మెడ లోని హారం చివరన మెరిసే లాకెట్ వలె ప్రతిభావంతుడైన కవి వ్రాసిన గజల్ చిట్ట చివరి పంక్తులు మనల్ని కాసేపు దుఃఖం లాంటి ఒక అలౌకిక ఆనందం లోకి నెట్టి వేస్తాయి. ఇంతా చేసి, ఆ గొప్పదనం గజల్ ప్రక్రియదా, లేక ప్రేమదా?


పూర్తిగా »

జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.

జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.

జీవితంలో నిజమైన సౌందర్యం ఎక్కడ దాగి వుంది? బహుశా, దాని సరళత్వంలోనే వుంది!
దేనినీ హెచ్చవేసి చూపించకుండా, దేనినీ తక్కువ చేసి చూపకుండా, ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, వున్నది ఉన్నట్లుగా చూడగలిగే హృదయం వుంటే జీవితంలోని అనేక మలుపుల్లో గొప్ప సౌందర్యం దాగి వుంది.
పూర్తిగా »