కిటికీలో ఆకాశం

హృదయాన్ని జయించే స్మృతి – రామా చంద్రమౌళి కవిత

హృదయాన్ని జయించే స్మృతి – రామా చంద్రమౌళి కవిత

ఒక్కో సారి జీవిత పర్యంతం వెంటాడే ఒక జ్ఞాపకం చాలు, వేనవేల నక్షత్ర కాంతుల నడుమ నిలబడి వున్నా ఒక భయానక చీకటి ఊబిలో చిక్కుకుపోయినంత నిరాశను నింపడానికి, లోకమంతా చీకటి గుడారంలో చిక్కుబడి వున్నా హృదయాంతరాలంలో చిరు దివ్వెలా వెలిగే ఆ జ్ఞాపకం వెలుగులో సంతోషంగా ముందుకు సాగిపోవడానికి!ఒకానొక కాలంలో పెను దుఃఖంగా హృదయాన్ని మెలిపెట్టినా, తదనంతర జీవిత కాలంలో హృదయతలం పైన నక్షత్ర కాంతిలా మిగిలే ఒక అందమైన జ్ఞాపకాన్ని మించిన గొప్ప బహుమతి ఏముంటుంది జీవితంలో?

జిడ్డు కృష్ణముర్తి అంటాడు – ‘the moment you have in your heart this extraordinary thing called love and…
పూర్తిగా »

ఎగరేసిన ఆత్మ గౌరవ పతాక – కలేకూరి కవిత

ఎగరేసిన ఆత్మ గౌరవ పతాక – కలేకూరి కవిత

కొన్ని కవితలు చదవడానికి, చదివి కవిత లోని ఆర్తిని అనుభవం లోనికి తెచ్చుకోవడానికి కేవలం సాహిత్య విద్యార్థులం అయితే సరిపోదు. మరీ ముఖ్యంగా, శక్తివంతమైన గొంతుక వున్న ఒక దళిత కవి రాసిన కవితనీ, అతడి గొంతు లోని బాధనీ, ఆగ్రహాన్నీ సహానుభూతితో అర్థం చేసుకోవడానికి వేల సంవత్సరాలుగా ఈ దేశం వర్ణ వ్యవస్థ కుంపటి పైన ఎట్లా తగలబడి పోతున్నదో, ఆ కుంపటిని రాజేస్తూ వున్న పురాణాలు ఏమిటో, స్మృతులేమితో విశ్లేషించుకుని అర్థం చేసుకునే హృదయం కావాలి. ప్రపంచం ఆధునిక కాలంలోకీ, అత్యాధునిక కాలంలోకీ వెళ్లిందని సంబరాలు జరుపుకునే కాలంలో కూడా గ్రామాలలోనూ, నగరాల లోనూ, చివరికి ఘనత వహించిన విశ్వవిద్యాలయాల లోనూ…
పూర్తిగా »

‘అతడే ఆమెలో సగం’ అన్న ఎండ్లూరి పద్యం

‘అతడే ఆమెలో సగం’ అన్న ఎండ్లూరి పద్యం

కని పెంచిన తల్లుల గురించీ, ప్రేమలో ముంచిన లేక మునిగాక వొదిలి వెళ్ళిన ప్రియురాళ్ళ గురించీ ఇబ్బడి ముబ్బడిగా కవితలు రాసిన కవి, తనను నమ్మి తనతో జీవితాన్ని పంచుకోవడానికి వొచ్చిన స్త్రీ గురించి కవితలు అల్లడంలో ఎందుకు వెనుక పడ్డాడు?

ప్రేమలో పూర్తిగా మునిగి పోయిన తరువాత నిర్దయగా వొదిలి వెళ్ళిన స్త్రీనే తలుచుకుంటూ కవితలు అల్లితే ‘ఆహా – ఓహో‘ అనే లోకం, ఇంటి పట్టునే వుండి, పురుషుడి పిల్లలకు తల్లై, అతడికి ఒక కుటుంబాన్ని అపురూపమైన బహుమతిగా ఇచ్చే స్త్రీ గురించి కైతలు కడితే వెక్కిరిస్తుందని భయపడ్డాడా? లేక, ఎంత ప్రేమాస్పదురాలైన స్త్రీ అయినా భార్యగా వొచ్చాక, ఇక ఆమె తన…
పూర్తిగా »

సంకెళ్ళలో ధ్వనించిన స్వేచ్చాగీతం

సంకెళ్ళలో ధ్వనించిన స్వేచ్చాగీతం

ప్రజలను దోపిడీ సంకెలల నుండి విముక్తం చేసేందుకు కవిత్వమై పుష్పించే అక్షరాలు తారసపడినపుడు రాజ్యం ఏం చేస్తుంది?
ఏం చేస్తుంది- దోపిడీని నిరంతరాయంగా కొనసాగించేందుకు తనకు అవసరమైన భద్రత కోసం తాను నిర్మించుకున్న జైలు గోడల నడుమ ఆ అక్షరాలను బందీగా చేస్తుంది!పీడన పీడ కలల నడుమ జీవితాలను గడిపే పేదవాళ్ళ గుండెలకు యింత సాంత్వన యిచ్చే ధైర్య వచనాలు ఎదురు పడినపుడు సింహాసనాలు ఏం చేస్తాయి?
ఏం చేస్తాయి – లోకం ఆదమరిచి నిద్రపోయే ఒక కాళ రాత్రి ధైర్య వచనాలను గాలిలో కలిపేసి, ఉదయమే ఒక వికృతమైన కట్టు కథ చెప్పి, ‘నమ్మి తీరవలసిందే’ అని లోకాన్ని దబాయిస్తుంది!


పూర్తిగా »

దళిత తల్లుల దుఃఖం – తెరేష్ బాబు “మట్టి బలపం”

దళిత తల్లుల దుఃఖం – తెరేష్ బాబు “మట్టి బలపం”

అమ్మల మీద పద్యాలు, కవిత్వాలూ తెలుగు సాహిత్యానికి కొత్త కాదు. ప్రాచీన సాహిత్యం మొదలుకుని, ఆధునిక సాహిత్యం దాకా అమ్మల మీద కవులు సృజించిన కవితలు కొల్లలుగా కనిపిస్తాయి. అందులో చాలా కవితలు అమ్మను దేవుడికి ప్రతిరూపంగా వర్ణిస్తాయి. బహుశా, ఒకప్పటి సాహిత్య సృజన అంతా బ్రాహ్మణీయ భావజాలంతో నిండిపోయివుండడం వలన ఆ రచనలలో అమ్మకు ‘దేవునికి ప్రతిరూపం’ అనే స్థానం లభించి వుంటుంది.

మరి, అట్టడుగు కులాల లోని తల్లుల పరిస్థితి ఏమిటి?

మొగుళ్ళు, మత్తు పదార్థాలకు బానిసలై ఇళ్ళను వొదిలేసి బలాదూర్లు తిరిగితే, పిల్లల్ని సాకడం కోసం భూస్వాముల పొలాలలో కూలీ పనులకు వెళ్లి అవమానాల పాలైన తల్లుల దుఃఖం, ఫ్యాక్టరీల…
పూర్తిగా »

రొట్టె సృజించిన ఎన్ గోపి పద్యం

రొట్టె సృజించిన ఎన్ గోపి పద్యం

లోకం నిండా ఇందరు దేవుళ్ళనీ, ఇన్ని మతాలనీ సృష్టించిన మనిషికి అనాది దైవం ఎవరు? బహుశా, ఆ అనాది దైవం ఒక రొట్టె ముక్క అయివుంటుంది. లేక వొక అన్నం మెతుకు!

బహుశా, అనంతర కాలంలోని ఈ వేలాది దేవుళ్ళు, లోకంలోని సంపదనంతా తమ వద్దే పోగేసుకున్న అతి కొద్ది మంది సృష్టి అయి వుంటుంది. లేక, ఆ కొద్ది మంది పోషణలో శ్రమ భారం తెలియక విశ్రాంత జీవులుగా మిగిలిన మరి కొద్ది మంది సృష్టి అయి వుంటుంది. అట్లా అని, లోకం లోని మెజారిటీ ఐన శ్రమ జీవులు తమ అనాది దైవాన్ని మరిచిపోయారా?
లేదు…
లేదు కాబట్టే, భారతీయ…
పూర్తిగా »

‘సుస్తీ’ స్థితిలో అంతరంగ ఆవిష్కరణ – శ్రీకాంత శర్మ పద్యం

సెప్టెంబర్ 2015


‘సుస్తీ’ స్థితిలో అంతరంగ ఆవిష్కరణ – శ్రీకాంత శర్మ పద్యం

చిన్న విరామం అన్నది కూడా ఎరుగక, జీవితమంతా ఒక ఉరుకుల పరుగులమయంగా మారిన కాలం ఎంత దుర్భరంగా వుంటుంది! ఉరుకులు పరుగులతో విసిగిపోయినపుడు ‘జ్వరం లాంటిది వొచ్చినా బాగుండును – ఒక రెండు రోజులు ఇంటి పట్టున ఉండ వొచ్చును’ అని కూడా అనిపిస్తుంది కదా!

మరి, అకస్మాత్తుగా జబ్బు పడి, ఇంట్లోని ఒక గదికీ, ఆ గది లోని మంచానికీ పరిమితం కావలసిన ఒక అగత్యం లోనికి నెట్టబడినపుడు ఆ స్థితి ఇంకెంత దుర్భరంగా వుంటుంది?

అట్లాంటి ఒక స్థితిలో మనిషి- ఒక దిగులు దిగుడు బావిలోకి జారిపోతాడా? తాను నడిచి వొచ్చిన దారులను పునర్మూల్యాంకనం చేసుకుంటాడా? లేక, తన గది కిటికీలో నుండే…
పూర్తిగా »

‘మనిషి వేళ’కై తపించిన సిద్దారెడ్డి పద్యం

‘మనిషి వేళ’కై తపించిన సిద్దారెడ్డి పద్యం

సమర్థుడైన కవికి తెలుసు – తన ధర్మాగ్రహాన్ని కవిత్వ ఫిరంగిలో ఎట్లా దట్టించి కుళ్ళిన వ్యవస్థ పైకి వదలాలో! అందులోనూ, ఒక తెలంగాణ జానపదుని భాషతో తెలుగు కవిత్వాన్ని శుద్ధి చేసిన సిద్దారెడ్డి లాంటి కవికి అది మరింత బాగా తెలుసు. అందుకే, చుట్టూ వున్న సమాజంలోని ఒకానొక దౌర్జన్యాన్ని ఆయన తన కవిత్వంలో మన ముందు పరిచినపుడు, అదంతా ‘కేవల రాజకీయ సంభాషణ‘ లాగా వుండదు. ఒక తెలంగాణ ఊరి మనిషి తన సహజాతమైన ఒక లయాత్మక భాషలో తన బాధనూ, కోపాన్నీ మన ముందు ఏకరువు పెడుతున్నట్టు వుంటుంది. బహుశా, సిద్దారెడ్డి మొత్తం కవిత్వ తాత్వికతని ఆయన ఈ కవితా వాక్యాలు…
పూర్తిగా »

కులం లక్ష్మణ రేఖ రహస్యం విప్పిన పద్యం

కులం లక్ష్మణ రేఖ రహస్యం విప్పిన పద్యం

జీవితం లోని తీరిక సమయాలలోని వ్యాపకంలానో, లేక, వ్యక్తిగత విషాదాలను గానం చేసుకునే వాహిక లానో, కవిత్వాన్ని స్వీకరించిన వాళ్లకు, సమాజంలో తన చుట్టూ వున్న సంక్షోభాలను, అసమానతలను, అవకతవకలను పలికిన కవిత్వం పెద్దగా నచ్చక పోవొచ్చు. ఆ మాటకొస్తే, అసలది కవిత్వమే కాదని దబాయించనూ వొచ్చు ! కానీ, కవి సున్నిత మనస్కుడైన మనిషి కదా ! తన లోపలి ప్రపంచపు సంక్షోభాలని గానం చేసే కవి, తన బయటి ప్రపంచపు సంక్షోభాలని గానం చేయకుండా ఎట్లా వుండగలడు ? ‘కవిత్వ కళ ‘ నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు తక్కువైనాయని పండితులు హాహాకారాలు చేసినా సరే – ఆగ్రహ ప్రకటన చేయకుండా ఎట్లా వుండగలడు…
పూర్తిగా »

జీవితం… తిరిగి మొదలు పెట్టవలసిన పద్యం!

జీవితం… తిరిగి మొదలు పెట్టవలసిన పద్యం!

తప్పిపోతాం మనం. లోకం లోకి వొచ్చి, అమ్మ చేతి గోరుముద్దల కాలం దాటి, ఇంటి నుండి విశాల వీధుల లోకి అడుగు పెట్టాక, మన చిన్నప్పటి అమాయక వెన్నెల నవ్వులని, ఎదురుపడిన మనిషిలోకి అట్లా అనాయాసంగా వెళ్లిపోగలిగిన స్వచ్చ అద్దం లాంటి మనసున్న అప్పటి రోజులని కాలగమనంలో మనకు తెలీకుండానే పోగొట్టుకుంటాం!

ఇక అక్కడి నుండీ మనం ఎట్లా మారిపోతాము? కరచాలనం దాకా వొచ్చిన మనిషి కూడా మనల్ని కదిలించడు. ఎదురయ్యే ఏ దృశ్యమూ మనల్ని అబ్బుర పరచదు. రోజులు గడిచే కొద్దీ మనం చాలా ముందుకు వెళ్ళి పోతున్నామన్న ఒక భ్రమ ఏదో మనల్ని ఆవరించి వుంటుంది గానీ, మనల్ని మనం సజీవంగానే ఒక…
పూర్తిగా »