కథన కుతూహలం

కథలకి ఇది కొత్త ఋతువు. మీరు చదివిన మంచి కథల్ని, మీ అనుభవంగా మార్చుకొని మీ ప్రతిస్పందన రాయండి.

హొగినేకల్ – మధురాంతకం మహేంద్ర

సెప్టెంబర్ 2017


హొగినేకల్ – మధురాంతకం మహేంద్ర

ఒక్కొకటిగా రాలుతున్న ఆకులతో అడవి మొత్తం బోడితలతో దర్శనమిస్తోంది. ఉక్కబోతలో గడ్డకట్టిన నిశ్శబ్దంలో ఒక మూలనుంచీ కనిపించని కోయిలొకటి విచారంగా కూస్తోంది.
పూర్తిగా »

కర్తవ్యపాలనలోనే సత్యదర్శనం ఉందంటున్న విరాట్

ఫిబ్రవరి-2014


కర్తవ్యపాలనలోనే సత్యదర్శనం ఉందంటున్న విరాట్

అశాంతికి కారణమైన అహాన్ని చంపుకోవడానికి అన్నింటినీ త్యజించి ఏకాకులుగా జీవించే ఋషులు, మహర్షులు నడిచిన బాటలో నడవాలని మనం తపన పడతాం. అయితే ఇలా ఏకాంతవాసులుగా మారిన వారికంటే కర్తవ్య నిర్వహణ గావిస్తూ తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండే వారికే ఎక్కువగా సత్యదర్శనం లభిస్తుందని తెలియచేస్తుంది స్టీఫన్ త్సయిక్ కథ (నవలిక) ‘విరాట్’.

అన్ని బంధాలకు దూరంగా తనను తాను పోషించుకుంటూ స్వేచ్ఛగా ఉన్నాననుకుంటున్న వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నట్లు కాదు. ఇతరులకు సేవ చేసేవాడు, తన మన: శ్శక్తిని, శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసి ఫలితాన్ని భగవంతుని చేతికిచ్చేవాడే నిజమైన స్వతుంత్రుడని విరాట్ పాత్ర ద్వారా మనకి విశదపరిచిన త్సయిక్ ఆస్ట్రియా వాసి. యూదు జాతీయుడు. ఈయన…
పూర్తిగా »

దాంపత్యం

జనవరి 2014


దాంపత్యం

రాజేశ్వరి భావుకురాలు. సగటు ఇల్లాలు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. భర్త అభిప్రాయాలకు అనుగుణం గా నడుచుకోవాలని , ఇల్లు భర్త కు నచ్చినట్లుగా నడవాలనీ తెలుసు.అలాగే నడుచుకుంటుంది కూడాను. రాజేశ్వరి భర్త రమేష్ మంచివాడే దుర్మార్గుడేమీ కాదు. కాకపోతే ఆడవారికి స్పందించే గుణం వుంటుందని తెలీనివాడు. చీరలు నగల కోసం తపించిపోతూవుంటారని అనుకుంటాడు.అవి అమరుస్తే చాలు అనుకుంటాడు.రాజేశ్వరి అలాగే అనుగుణంగా నడుచుకునేది కూడా.కాని భర్త నోటిని భరించలేక పోయేది.అలాగే ఇద్దరు పిల్లలకు తల్లైంది. పిల్లలు చంద్రం, సరోజ కూడా తల్లికే చేరిక అయ్యారు. భర్త నుంచి ఏమాత్రం ఆప్యాయత పొందని రాజేశ్వరి పిల్లలే లోకంగా గడిపింది.అడుగడుగునా తండ్రి పరుషవాక్యాలు, ఎప్పుడేమి వినవలసి వస్తుందోనని తల్లి…
పూర్తిగా »

వెంటాడి వేటాడే వెన్నెల దారి

వెంటాడి వేటాడే  వెన్నెల దారి

అవధాని డిగ్రీలో చేరబోతున్న పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు, అతని వేలువిడిచిన మేనమేమ భూషణం బాగా చదువుకుని సంఘంలో పేరు ప్రతిష్టలున్న పెద్దమనిషి. భూషణం బావ రామచంద్రం టెన్నిస్ ఛాంపియన్, ఆస్థి భార్య తరఫున వచ్చినదే అయినా ఆస్థిపరుడు మరియూ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. వీరు ముగ్గురూ ఏలూరులో ఉన్న పని చూసుకుని పొద్దుపోయే వేళకు రామచంద్రం సెకండ్ హాండ్ ఫోర్డ్ కారులో తణుకు బయలుదేరుతారు. బయలుదేరిన ఆరుమైళ్ళలోపే ఆగిపోయిన కారు మరి రెండు చోట్ల ట్రబుల్ ఇచ్చి ముందుకు కదిలినా తణుకుకు పదిహేను మైళ్ళదూరంలో నల్లజర్ల అడవిలోకి అడుగుపెట్టాక పూర్తిగా మొరాయించి ఆగిపోతుంది.

అడవిలో ఒంటరిగా రాత్రిగడపలేక పైగా తణుకులో పొద్దున్నే కలెక్టర్ గారింట పెళ్ళికి…
పూర్తిగా »

వెన్నెలరాత్రి వణికించిన అనుభవం

అక్టోబర్ 2013


వెన్నెలరాత్రి వణికించిన అనుభవం

కథను చక్కని శిల్పంగా చెక్కుతాడనీ, ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో నిర్దుష్టంగా మలుస్తాడనీ పేరు పొందిన రచయిత చాగంటి సోమయాజులు (చాసో) . ఆయన రాసిన కథల్లోనే విభిన్నమైనది ‘దుమ్ములగొండె’. అప్పటికే కుంకుడాకు, ఏలూరెళ్లాలి లాంటి రచనలతో పేరు తెచ్చుకున్న చాసో్ ఈ కథను ఆసక్తికరమైన నేపథ్యంతో అల్లాడు.

ఈ కథ మొట్టమొదట సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో 1943 జులైలో వచ్చింది. 70 సంవత్సరాల క్రితం రాసిందైనా ఇప్పటికీ వన్నె తరగలేదు. మానవ స్వభావంలోని ఒక వాస్తవాన్ని వెన్నెల వెలుగులో చూపించిన కథ ఇది!

కథాంశం చిన్నదే. ముగ్గురు జతగాళ్ళు సరదాగా కుమిలీ ఘాటీకి అర్థరాత్రి షికారుకు బయలుదేరటం, ఆ అనుభవం చివరికెలా పరిణమించిందీ అన్నది-…
పూర్తిగా »

మందులేని వైరస్ “జెలసీ”

ఆగస్ట్ 2013


మందులేని వైరస్ “జెలసీ”

పొసెసివ్నెస్ , నిజానికి ఈ మాటకు సరైన తెలుగు మాట లేదు. మనది అనుకున్న దాన్ని ఇంకెవరూ తాకి ఉండకూడదు , మనకే సొంతం కావలనే ఫీలింగ్. ఇది ప్రేమలో కొంత వరకు బాపు రమణ చెప్పినట్టు “ అసూయ ప్రేమకు ఘాటైన ధర్మామీటర్” అంటే ఒప్పుకోవచ్చు కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇది జెలసీ గా రూపాంతరం చెందిందా చచ్చామన్న మాటే . పాపం ఇలా ఒకరి జెలసీ కి బలై పోయిన వ్యక్తులెందరో . అలాంటి ఒక కధ చలం “జెలసీ” . ఇందులో చలపతి రావు చాలా ఆదర్శవంతుడు. పెళ్ళయి మొగుడు పోయిన విధవనే పెళ్ళాడుతానని తలంచి అలాగే తన…
పూర్తిగా »

వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు

జూన్ 2013


వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు

‘రయిక ముడి ఎరుగని బతుకు’ మీద పుస్తక పరిచయం

కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన ‘రయిక ముడి ఎరుగని బతుకు’ కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన ‘మొగుడు చచ్చిన’ ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే…
పూర్తిగా »

మరపురాని కథ… రావిశాస్త్రి ‘మాయ’!

మరపురాని కథ…  రావిశాస్త్రి ‘మాయ’!

రా.వి.శాస్త్రి గారి ‘ఆరు సారా కథల’ను ఇరవై ఏళ్ళ కిందట మొదటిసారి చదివాను. అప్పటికే అవి రాసి 30 సంవత్సరాలు దాటింది.
రెండక్షరాల సారా చుట్టూ అల్లిన ఈ కథల శీర్షికల్లోనూ రెండక్షరాలే. (పాపి, మాయ, న్యాయం, మోసం, పుణ్యం, మోక్షం).

వీటిలో… ఇన్నేళ్ళలో నేను మర్చిపోని కథానికల్లో ‘మాయ’ ఒకటి. సారా వ్యాపారం చేసుకునే ముత్యాలమ్మను పోలీసు హెడ్డు అక్రమంగా జైల్లో పెట్టటం, కేసు కోర్టు విచారణ, వాదనల తర్వాత ఆమె ఎలా బయటికి వచ్చిందన్నది స్థూలంగా కథ.

కథ ఇంతే! కానీ కథనం గురించి చెప్పాలంటే ఎంతో ఉంది!

ఈ ‘మాయ’ కథానికను ఈ లింకులో చదవొచ్చు: http://www.scribd.com/doc/135355638/Maaya
ఇలాంటి…
పూర్తిగా »

స్లోగన్లు లేని విప్లవం కథ మన్నం సింధు మాధురి “కాళావు”

స్లోగన్లు లేని విప్లవం కథ మన్నం సింధు మాధురి “కాళావు”

కొన్ని కథలు జీవితాల్ని పరిచయం చేస్తాయి. ‘అసలు ఇలాక్కూడా ఉంటాయా జీవితాలు’ అని సామాన్యులు ఆశ్చర్యపోయే నిస్సహాయమైన,అసాధారణమైన,అద్భుతమైన అభాగ్యుల జీవితాల గురించి కొందరే తమ రచనల ద్వారా పరిచయం చేస్తారు. అలాంటి ఒక కథ ‘కాళావు’. అలాంటి ఒక సాహసి మన్నం సింధు మాధురి.

మొట్టమొదటిసారిగా కథ చదివినప్పుడు ఒకరకమైన గగుర్పాటుకి లోనయ్యాను. మళ్ళీ చదివినప్పుడు మరింత ఎక్కువయ్యింది. ఎంచుకున్న నేపధ్యం, వాడిన శైలి, వాడైన శిల్పం, వొడుపు ఉన్న యాస, జానపదసాహిత్యాన్ని పోలిన కథనగుణం అన్నీ కలగలిపి ఒక క్లాసిక్ కథగా నిలపగలిగిన తీవ్రత ఉంది ఈ కథలో అనిపించింది.

“జీవితం అంటే ఏంటి? మనస్సంటే? శరీరం అంటే ఏంటి? ఈ మూడిటికీ ఉన్న…
పూర్తిగా »

ఎండిన జీవితంలో ఓ నీటి చుక్క అలజడి!

ఫిబ్రవరి 2013


ఎండిన జీవితంలో ఓ నీటి చుక్క అలజడి!

“మన సమాజం మహా క్రూరమయినది….కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది కథలో వాచ్యంగా ఉండకపోవడం దాని బలహీనత కాదు-బలమే!” అని నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో విమర్శకులకు జవాబు చెప్పగల మేటి కథకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. కథా రచయితగా అమిత అనుభవజ్ఞుడు. ఈయన కథల్లోని కథా వస్తువు మన చుట్టు జరిగే సంఘటనలే. మనం నిత్యం వాడే వస్తువులే. కళ్ళజోడు, ఇంగువ, ముసురు, మబ్బు విడిచిన ఎండ ఇలాంటివన్నీ ఆయన కథా వస్తువులే. మధ్యతరగతి బతుకు బాధల్ని విన్నంత, కన్నంత అక్షరీకరించారు. సుబ్బరామయ్యగారి కథలు మధ్య తరగతి జీవితాలలో సమస్యలకు అద్దాలు. అలాంటి ఒక అద్దమే “నీళ్ళు”. కరువు ప్రాంతాలనుండి నీళ్ళు…
పూర్తిగా »