సంపాదకీయం

రైటర్స్ డైరీ

రైటర్స్ డైరీ

తేదీ: కొన్ని అంకెల మధ్య రెండు గీతలు
సమయం: మొట్టమొదటి జలదరింపు లేదా కుదుపు

చెప్పొచ్చేదేమిటంటే, అదొక ఆహ్లాద సమయం, ఒక పుట్టుకని కాస్త ఆలస్యంగా గుర్తించిన లేక కావాలని కాస్త ఆలస్యంగానే పుట్టిన ఒక సందర్భం. ఎక్కణ్ణుంచో గాలి ఆగకుండా పరిగెడుతూ వచ్చి నా పక్కనే గసపోసుకుంటూ ఆగిపోవడంతో మొదలైన ఒక ఆరంభం. ఒకరోజుని రెండు మందపాటి డొల్లలుగా పగలగొట్టుకుని ఆ వేసవి మధ్యాహ్నం చెట్లకొమ్మల్లో చెంపదెబ్బలుగా ఫెళ్ళుమని మోగిన గుర్తు. “అబ్బా! ఒకటే ఉక్కతీస్తుంది” అన్న చుట్టుపక్కల మాటలన్నీ కలిసి ఒకే ఒక్క వడ్రంగి పిట్ట టకటక చప్పుడుగా ఉక్కపోతలా ఆవహించిన వేళ. అంతే- అదొక ముగింపు,…
పూర్తిగా »

సొంతవాక్యం

సెప్టెంబర్ 2014


సొంతవాక్యం

కొండతల్లికి పిల్ల జాలులా పుట్టి, నడక నేర్చుకుని నదిలా మారి, కాసేపు రాళ్ళ కోతలు భరిస్తూ, కాసేపు హాయిగా పల్లాల మీదుగా కూడా పయనిస్తూ, ఎప్పుడూ సముద్రాన్నే పలవరిస్తూ ముందుకే వెళ్ళే నదిలా మనం రాబోయే కష్టాలను బేరీజు వేసుకుంటూ సుఖాలకనుగుణంగా గమనం మార్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాము. కానీ, ఒకడుగు ముందుకు వేస్తే మొల్దారాన్ని పట్టి రెండడుగులు వెనక్కి లాగుతుంది జ్ఞాపకాల కొక్కెం. సాలిడ్ స్టేట్ హార్డ్ డిస్క్ లా చప్పుడు చేయకుండా జ్ఞాపకాలను క్రంచ్ చేస్తూ మెదడు మనల్ని వెనక్కి పంపి ఎదో ఓ పాత ట్రాక్ లోకి తోసేస్తుంది. ఇక ఆ ట్రాక్ లోనే తియ్యగా కూనిరాగం తీస్తూ, తిరుగుతూ, బయటికి…
పూర్తిగా »

వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 2014


వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కల నిజమయి ఎదురుగా నడుచుకుంటూ వస్తే?! అంతకన్నా ఇంకేం కావాలి! కొన్ని కలలు నిజమవుతాయి! సరిగ్గా ఏడాది క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి సగర్వంగా పన్నెండు సాహిత్యపుటడుగులు ముందుకేసి ఈ రోజు వార్షిక సంచికగా మరింత కొత్తగా అలంకరించుకుని మీ ముందుకు వచ్చింది.

వాకిలి లేని ఇల్లును ఊహించుకోలేం! అలాగే సందడి లేని ఇల్లు ఆత్మ లేని దేహం లాంటిది. ఏ ఇంటి వారి అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటి వాకిలి ఉంటుంది. కానీ ఈ ‘వాకిలి’ ఒక్కింటి వాకిలి కాదు. అనేక తెలుగు ముంగిళ్ళను కలిపి కుట్టిన అచ్చమైన స్వచ్ఛమైన సాహిత్య వేదిక. ఎలాంటి అరమరికలు లేని సాహిత్య సంభాషణలను ఆహ్వానిస్తూ,…
పూర్తిగా »

ఒక సామాన్యుడి అసాధారణ విజయం

మే 2013


ఒక సామాన్యుడి అసాధారణ విజయం

ఆకుపచ్చని కాశ్మీరపు తివాచీ మీద మంజరి శరీరం వెల్లికిలా పడి ఉంది. పడక గదిలోకి ఉన్న కిటికీ పూర్తిగా తెరిచివుంది. టెలిఫోను కిందపడి ముక్కలయిపోయింది… అల్లంత దూరంలో పసుపుపచ్చని మందుబిళ్ళలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

మంజరి మరణానికి కారణమేమిటని కాదు నా ప్రశ్న. అసలిలాంటి అమానుషమైన ముగింపు జరగటం నాకిష్టం లేదు. తన సౌందర్య తీవ్రతతో దేశదేశాలను తపింపచేసిన మంజరి శరీరం, నిర్జీవంగా కాశ్మీరపు తివాచీ మీద పడి ఉండటంలో ఏదో అపశృతి ఉన్నదనిపించింది నాకు. ఆమె సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలు, సిరిసంపదలు ఆమె నీ కొసకు తరుముకొచ్చాయనిపించింది.

అనన్యమైన ప్రతిభా సంపదలున్న వ్యక్తి మీద జీవితం ఏదో రూపంలో కసి తీర్చుకొంటుందంటారు.

మంజరి విషయంలోనూ…
పూర్తిగా »

ఏప్రిల్ వొకటి విడుదల!

ఏప్రిల్ 2013


ఏప్రిల్ వొకటి విడుదల!

చార్లీ చాప్లిన్ సినిమా మొట్ట మొదటి సారి ఎప్పుడు చూశానో గుర్తు లేదు.

ఆ మాటకొస్తే,  ఆ తరవాత చాప్లిన్  ఏ సినిమా ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తు లేదు.

అందులో నేను మళ్ళీ అనుభవించలేని పసితనమేదో వుంది, అది నన్ను కవ్విస్తుంది, నవ్విస్తుంది. ఏడ్పిస్తూ నవ్విస్తుంది. నవ్విస్తూ ఏడ్పిస్తుంది. నవ్వుకీ, ఏడ్పుకీ మధ్య వుండే ఈ స్థితేదో నాకు కావాలి, నన్ను కుదురుగా వుండనివ్వడానికి!

నేను కుదురుగా లేను అనుకున్న స్థితిలో చాప్లిన్ ని వెంటనే ఆశ్రయిస్తాను.  వొక్కో సారి తన మూకీ భాషలో, ఇంకో సారి కేవలం చేష్టలే భాష అయిన ఘోషలో నన్ను వెంటనే నిటారుగా నిలబెట్టేస్తాడు చాప్లిన్.

ఇప్పుడు…
పూర్తిగా »

ఆమె: ఆకాశంలో కాదు, ఈ నేలలో సగం!

మార్చి 2013


ఆమె: ఆకాశంలో కాదు, ఈ నేలలో సగం!

“Every writer needs another set of eyes.”

అన్నాడట The Atlantic పత్రిక సంపాదకుడు విలియం విట్ వర్త్ ఒక సందర్భంలో! ఇప్పుడు అదే మాటని తెలుగులో స్త్రీల సాహిత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు గుర్తు చేసుకోక తప్పడం లేదు. తెలుగు సాహిత్యానికి కొత్త చూపునిచ్చి, కొత్త దిగంతాన్ని చూపించిన  స్త్రీల సాహిత్యం నిజానికి 1980ల తరవాతనే మొదలయింది. అప్పటి వరకూ పురుష నేత్రాలతో మాత్రమే అక్షరాల్ని చూడడం అలవాటయిన లోకానికి ఇంకో జత కొత్త కళ్ళు తప్పనిసరయ్యాయి. అయితే, ఇప్పటికీ ఈ కొత్త వాస్తవికతని చూడలేకపోవడమూ, చూసినా చూడనట్టు వుండడమూ అలవాటయిన అంధత్వం లేకపోలేదు. ‘అబ్బే…సాహిత్య వాక్యానికి లింగబేధం ఆపాదించలేమని’ కుటిల వచనాలు పలికే మగదొరలదే ఇంకా…
పూర్తిగా »

ఇదిగిదిగో రెండో అడుగు!

ఫిబ్రవరి 2013


ఇదిగిదిగో రెండో అడుగు!

‘వాకిలి’లో మా మొదటి అడుగు మాకు తృప్తినిచ్చింది. మీ నించి లభించిన ప్రతిస్పందన, మీరు చూపించిన ప్రేమ మాకు కొండంత అండని భరోసాగా ఇచ్చింది. మారుమూల తెలుగు పల్లెల నించి దూరదేశాల దాకా కూడా ఎందరో ‘వాకిలి’ లో తమ ప్రవేశాన్ని అందమయిన/ ఆహ్లాదకరమయిన అనుభవంగా చెప్పారు. ఎందరో రచయితలు మా తొలి అడుగులో అడుగు కలిపి ఇక ముందు వాకిట్లో మనమంతా కలిసే వుంటామని, హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే ఆరోగ్యకరమయిన, స్నేహపూర్వకమయిన వాతావరణం వాకిట్లో కనిపిస్తోందని అన్నారు.

ఇలాంటప్పుడు రెండో అడుగు వేయడానికి కాస్త బెరుకుగా వుంటుంది. మీలో మొలకెత్తిన కొత్త ఆశల్ని నిలబెట్టుకోగలమా,మీలోపల ననలెత్తిన కొత్త అభిరుచి చిగుర్ల వూపిరి కాపాడుకోగలమా…
పూర్తిగా »

జనవరి 2013 సంచిక: మాట్లాడుకుందాం రండి!

జనవరి 2013


జనవరి 2013 సంచిక: మాట్లాడుకుందాం రండి!

ఈ ‘వాకిలి’ ఒక కల.

ప్రతి పత్రికా- అది అచ్చులో అయినా, అంతర్జాలంలోనయినా- అందమయిన కలతోనే పుడుతుంది.

‘వాకిలి’ కల మీతో అరమరికలు లేని సాహిత్య సంభాషణ! ఎలాంటి మొహమాటాలూ లేని, అచ్చంగా సాహిత్య విలువల మీది ప్రేమతో మాట్లాడుకోవడం! విమర్శనీ, ప్రశంసనీ సమహృదయంతో ఆహ్వానించే సహనాన్ని పెంచడం! జీవితంలోని కొత్త కోణాల మీద నిజాయితీతో నిండిన వెలుగుని ప్రసరించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే సాహిత్య సమూహాన్ని సమీకరించడం!

గత ఇరవయ్యేళ్లుగా తెలుగు సాహిత్యం సంశయ యుగంలోంచి నడుస్తోంది. ఏది సాహిత్యం అనేది పెద్ద సంశయం! అనేక రకాల సాహిత్య ధోరణులు కొన్ని సార్లు ఊపిరాడనీయని సందిగ్ధంలోకి  కూడా తోస్తున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ వాద ధోరణులు…
పూర్తిగా »