నిన్నటి పేజీలు

జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని

28-జూన్-2013


జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని

(1988 లో ‘ఆంధ్ర జ్యోతి’ సాహిత్య వేదికలో ప్రచురితమైన ఇస్మాయిల్ గారి నేపధ్యం.. ఇప్పటికీ కవిత్వం గురించి ఇందులో ఇస్మాయిల్ గారు చెప్పిన విషయాలు మనకి అవసరమే అనిపించి మళ్ళీ మీకు అందిస్తున్నాం)

 

1944 లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపలా బయటా అశాంతి. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి.అప్పుడే వికసిస్తున్న మా మనసులలో అసంతృప్తి మేల్కొంది. ఏదో తెలుసుకోవాలనే ఆరాటం, దేన్నో సాధించాలనే తపన, సాంఘికమైనవీ, మానసికమైనవీ సంకెళ్ళని తెంచుకోవాలనే ఆవేశం.లోనా పైనా చెలరేగిన ఈ అశాంతికి మార్కిసిజం ఒక కాయకల్ప చికిత్సగా మా ఎదగని మనస్సుకు తోచింది.

కానీ కమ్యూనిస్ట్ పార్టీలో అడుగు…
పూర్తిగా »