గల్పిక

కృష్ణాష్టమి

అక్టోబర్ 2015


కృష్ణాష్టమి

'ఉన్న పళంగా ఇంటికి రండి.' 'అదేవిటి, ఇంకా ఇక్కడ బిల్లేయించాలి, పిండి మరలో బియ్యం పట్టించాలి. ఉన్న పళంగా ఎలా?' సూపర్ మార్కెట్ లోంచి శంకర్. 'ఆ బిల్లూ గిల్లూ, గిర్నీ వొద్దు. ఇంకేవీ కొనద్దు. వొచ్చేయండి.' ఫోనులో జమున హడావుడి వింటే శంకర్ కి ఏం కొంప ములిగిందోనని ఓ క్షణం ఏం అర్ధం అవలేదు. "కాశీ లో అమ్మా నాన్నా ఏమైనా… ఏమైందిప్పటికిప్పటికి? ఇంతవరకూ కృష్ణాష్టమీ, పూజా, అరిసెలూ, అప్పాలూ, పోకుండలూ అని నన్ను పరిగెట్టించి… ఈ జమునకి ఆ పేరెవరు పెట్టేరో కానీ, అందాన్నటుంచితే, అట్టహాసానికేం తక్కువ లేదు."
పూర్తిగా »

కాకిలోకం!

జూన్ 2015


కాకిలోకం!

నాతో పాటు ఆర్ట్ కాలేజీలో చదువుకున్న నా ఫ్రెండ్ రాం ప్రసాద్ సినిమాల్లో ఆర్టిస్్ట గా చేరి వేగంగా ఆకాశపథంలోకి దూసుకుపోతున్నాడు. నేనేమో మా ఆవిడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో కూర్చుని బొమ్మలు వేసుకుంటుంటాను. అప్పుడప్పుడూ - అప్పుడప్పుడూ కాదులే బాగానే పత్రికల్లో కనపడుతుంటాయి నా బొమ్మలు.
పూర్తిగా »

సహదేవుడికో ఉత్తరం

సెప్టెంబర్ 2013


సహదేవుడికో ఉత్తరం

సహదేవుడికి,

నీకు ఉత్తరం రాయాలనిపించాక నీపేరు గుర్తు చేసుకోడానికి మొదలుపెట్టిన ప్రయత్నం ఎన్నసార్లు విసుగొచ్చినా ఆపలేకపోయాను.

మీ దుకాణం నుంచి దొంగిలించి తెచ్చిన మిఠాయిలో (నువ్వు ఒప్పుకునేవాడివికాదు నాన్నకుతెలియకుండా మిఠాయితేవడం దొంగతనం కాదని డబ్బులు తెస్తేనే దొంగతనమౌతుందని డబాయించేవాడివి) ఆ తీపి ఇప్పుడు కూడా నానోటికి అనుభవమౌతున్నట్టే వుంది.

టీచరుగారు వచ్చేలోపల నువ్వు మొదలుపెట్టిన కథ, ఔటు బెల్లులోనూ, అన్నం బెల్లు అయ్యాక మధ్యాహ్నం ఫస్టుబెల్లు లోపలా అవగొట్టేసేవాడివి. పలకమీద బొమ్మగీసి, కథచెబుతూ, ఉమ్మితో పలకతుడిచి, కథచెబుతూ, కొత్తబొమ్మగీసి, కథచెబుతూ సినిమా చూపించేవాడివి.

లవకుశలో లక్ష్మణ స్వామి సీతమ్మోరి ని అడవిలో వదలటానికి వెళ్ళేటప్పుడు నీనోటితో వినిపించిన గుర్రపు డెక్కల చప్పుడు ఇంకావినిపిస్తూనేవుంది.

వజ్రాలవేటకు వెళ్ళిన…
పూర్తిగా »

పరామర్శ

సెప్టెంబర్ 2013


పరామర్శ

“ఏం బాబు బాగున్నావా?”

“ఎవరూ!… ఎం.ఎల్.ఎ.గారా!..”

“కులాసే గదా బాబూ!… మీనాన్న నాకు బాగా తెలుసు బాబూ .ఆయన అప్పట్లో నాకోసం చాలాసార్లు తిరిగాడు పాపం!.ఏం చెస్తాం..నేనైతే పదవిలోనే ఉన్నాను గాని ప్రభుత్వం మనది కాదుగదా!,అంచేత కొంచెం యిబ్బంది పడ్డాడు….”

” అంతా అయిపోయింది లెండి.తనమీద లేనిపోని ఆరోపన్లు వచ్చాయని,తనసర్వీసులో అపనిందపడాల్సివచ్చిందని బాధపడ్డారు , ఎవరో ఒక నాయకుడుట.. అతను చేసిన తప్పును తనమీదకు తోసేసాడని బాధపడి….ఆవిషయమై మీదగ్గరకు చాలాసార్లు తిరిగారు.ఏమి చేయలేక మనోవ్యాధితో చని పోయారు.”

“అదే బాబు చెప్పాను గదా!,నేనైతే పదవిలోనే ఉన్నాను గాని….”

“ప్రభుత్వం మనది కాదు అంటారు…”

“అంతేబాబు..అంతే..అంతే…”

“సరేలెండి,యింతకీ తమరు యిప్పుడెందుకొచ్చినట్టో!.. చెప్పలేదు.”

“అదేమిటి బాబు అలా అంటావు.…
పూర్తిగా »

రాజకీయం

రాజకీయం

మంత్రి గారి కేంప్ కార్యాలయం.జనం తొ రద్దీ గా ఉంది.అంతకు ముందు ఎవరినీ కలవడానికి యిష్ట పడని మంత్రి గారు ఈమధ్యన కనిపించిన ప్రతివారిని పలుకరిస్తున్నారు.భుజాన చెయి వేసి మాట్లాడుతున్నారు.

“మా మంత్రిగారు ప్రజల మనిషి. ప్రజానాయకుడుగా చరిత్రలో నిలిచిపోతారు”. అని అతని అనుచరులు ప్రచారం చేస్తుంటే

“అంతలేదు.. ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి కదా!..అదీ సంగతి” అని ప్రత్యర్ధులు పెదవి విరుస్తున్నారు.

ఎవరు ఎలా అనుకున్నా మంత్రిగారు మాత్రం ఏ భేషజము లేకుండా అందరి తోనూ మంచిగా మాట్లాడుతున్నారన్నది మాత్రం నిజం.

***

“నమస్కారం సార్..నాపేరు బంగారం.అంబారం గ్రామ సర్పంచిని”.

“ఆ..ఆ..రావయ్య..రా..రా నువ్వు తెలియక పోవడమేమిటి!?చెప్పు..చెప్పు..ఏం పనిమీదొచ్చావ్”?

” సార్ ఈకుర్రాడు బాగా చదువు…
పూర్తిగా »