కడిమిచెట్టు

మంచు కొండలో మొలిచిన చల్లని బంగారు తీవె

మంచు కొండలో మొలిచిన చల్లని బంగారు తీవె

“అమ్మా, మీ పెళ్ళి లో నాన్న అలిగాడా?” అడిగాడు కొడుకు, కొంత వయసూ వ్యక్తతా వచ్చినవాడు… ఆ నాన్నకి కోపదారి అన్న పేరు ఉండిపోయిఉంది కనుక.

” పెళ్ళి లో అయితే పెద్దలేదు గానీ, ఆ ముందర ఆయన అల్లరి అంతా ఇంతానా తండ్రీ ” ఉత్తి పుణ్యానికి తన మేనల్లుడి మీద మండి పడిన తీరు గుర్తుకొచ్చి నొచ్చుకుంది ఆ ఇల్లాలు.

” అయితే నిన్ను ఇష్టం లేకుండా కట్టుకున్నాడంటావా ? ” చనువుగల కొడుకు అడిగేసి వెంటనే నాలుక కరుచుకున్నాడు.

అమ్మ ఏమీ అనుకున్నట్లు లేదు, ” ఏమోరా ” అని ఊరుకుంది …నిష్టూరపు బిగువు లోంచి తరుముకొచ్చే మురిపెం తో.


పూర్తిగా »

ఉత్తరసీతాచరితం- హృదయాహ్లాదిని కుందమాల

ఉత్తరసీతాచరితం- హృదయాహ్లాదిని కుందమాల

ఈ మల్లెపూలదండ చల్లటి ఉపశమనాన్ని ఇస్తుంది- ఆ ప్రేమికులతోబాటు, వారి విరహం దహించే మన మనసులకి కూడా… తాత్కాలికంగా కాదు, ఎప్పటికీ. దయలేని మనుషుల వలన పడిన అన్ని ఇడుములూ ఈ ముగింపులో విచ్చిపోతాయి. అమ్మా నాన్నా కలుసుకోవటమే – కుశలవులకి లాగే మనకీ , రాజ్యాభిషేకం.

ఉత్తరకాండ చివరలో సీత విరక్త అయి తల్లి దగ్గరికి వెళ్ళిపోవటం, ఎంత కాదనుకున్నా , విషాదాంతమే- మనుష్యలోకపు కథగా చదువుతున్నప్పుడు . మానవాతీతమైన భాష్యాలు ఎన్ని వెతకబోయినా, ఆ మర్యాదా పురుషోత్తముడి చరిత్ర పురుషార్థాని కి కూడా సంబంధించినది కాదా?

అసలు వాల్మీకి రచన యుద్ధకాండ వరకేననీ, తర్వాతి కథ చాలా కాలం తర్వా త…
పూర్తిగా »

రక్షణను రచించిన భద్రమహిళ అగాథా క్రిస్టీ

డిసెంబర్ 2014


రక్షణను రచించిన భద్రమహిళ అగాథా క్రిస్టీ

‘జనముద్దు’ సాహిత్యాన్నీ తతిమా కళారూపాలనీ   మొహం చిట్లించి చూడటం మేధావులకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది. అందరికన్నా తాము ఎక్కువ అనే భావన వారి ఉనికికి అత్యవసరమైన సంగతి. జ్ఞానం ఉన్నవారి జనాభా తక్కువ కనుక ఎక్కువమందికి నచ్చేదానిలో ఖచ్చితంగా గొప్ప ఉండదనే ఆ నమ్మకానికి ఎదురు వాదన- నిజం చెప్పాలంటే , ఏమీ లేదు.

ప్రేమలూ కన్నీళ్ళూ రాసినవారికే అంతంతమాత్రం గౌరవం ఉంటుంటే నేరపరిశోధన రాసినవారి సంగతి చెప్పాలా ?  కాని , కనీసం కొందరి గురించి మాట్లాడేటప్పుడు- ఇదంతా అప్రస్తుతం. ఏ భేషజమూ లేకుండా తనను తానొక వినోదకారిణిగా మాత్రమే చెప్పుకున్నవారు అగాథా క్రిస్టీ. అయితే,  ఆమె రాసినదాన్ని ఇష్టంగా చదివేవారిలో ’…
పూర్తిగా »

స్వప్నప్రపంచాల సౌందర్య దీపం- రవీంద్రుల ‘చిత్ర’

అక్టోబర్ 2014


స్వప్నప్రపంచాల సౌందర్య దీపం- రవీంద్రుల ‘చిత్ర’

పూర్ణా నదీ తీరంలో ఆ సాంద్రమైన అరణ్యం. పరుగెత్తే జింక కోసం- లోలోపలికి , మెలికలు తిరిగే కాలి బాట వెంట నేను . నా మృగయా వినోదం మృగం ఆ పొద కిందన ముగిసింది. ఎండుటాకుల పైన శయనించి అతను అక్కడ. అడ్డు తప్పుకొమ్మన్నాను, లక్ష్యపెడితేనా ! నా వింటి అంచుతో పొడిచాను చిరాకుగా. నివురు నుంచి భగ్గుమన్న జ్వాల లాగా అతను దిగ్గున లేచాడు...నా పురుష వేషాన్ని చూసో ఏమో, వచ్చే నవ్వుని ఆపుకున్నాడు. అప్పుడు, ఆ ముహూర్తం లో- నేను స్త్రీనని నాకు తెలిసింది.
పూర్తిగా »

మూడవ భాగం- సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ

సెప్టెంబర్ 2014


మూడవ భాగం- సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ

‘ నాటకాంతహి సాహిత్యం ‘ – ఈ మాట ఈ విధంగా కూడా  అవును – సాహిత్యపు పరమప్రయోజనం ఏదో దాన్ని సాధారణ స్థాయి వ్యక్తులకి కూడా  నేరుగా  చేరవేయటం నాటకం యొక్క శక్తి.  ఆ ప్రయోజనం స్థూలంగా  ఇలాగ-  కదలిక, లోపలికి తీసుకోవటం, విచ్చుకుని విశాలమవటం. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు సాహిత్యం లో  చివరి రచన అని చెబుతారు.  అంతకు ముందు ఆయన మహాకావ్యాలు రాశారు, కొన్ని మంచి  నాటకాలనూ తీర్చారు. ఇది కావ్యమైన నాటకం. తన రచనలన్నింటి వెనకా ఉండిన  ఉపజ్ఞ, ప్రజ్ఞ అంతా ఒక్కటై వెలిగిన శాంతదీధితి  శాకుంతలం

కాళిదాసు కు పరమభక్తులైన పాతతరం సాహితీవేత్త జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి…
పూర్తిగా »

సహృదయ ప్రమాణం [శాకుంతలం] – రెండవ భాగం

సహృదయ ప్రమాణం [శాకుంతలం] – రెండవ భాగం

భద్రమైన తన  ఆకుపసుపు  లోకం నుండి ఆతురయై నడచి నడచి పూర్తి అపరిచిత ప్రపంచం లోకి వస్తున్నది శకుంతల. శాంతమైన మునివాటిక నుంచి  విపణి వీధుల ,సౌధాల,  శకటాల  కోలాహలం  లోకి….. స్వచ్ఛం నుంచిసమ్మిశ్రితం  లోకి, నిసర్గసిద్ధం నుంచి నాగరికత లోకి.

దుష్యంతుడి మనసంతా  శాపం తో శూన్యమైంది. స్వతహా  సత్పురుషుడు కనుక- అంతశ్చేతన  మాత్రం సత్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. అక్కడెక్కడో  అడుగున ,  గతం-  తెలిసీ తెలియని గీతిగా….. స్మృతీ విస్మృతీ పెనుగులాడే ఈ అయిదో అంకాన్ని [నాలుగో అంకం గొప్పదనే బహుధా ప్రశంస ] శాకుంతలం లో  ఉత్తమమైనదిగా అనుకునే రసహృదయులు ఉన్నారు.

” లోతునకు దిగి విచారించినచో శాకుంతలమునకు…
పూర్తిగా »

సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]

సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]

”ఎవరు ఏ ఆత్మీయులను కోల్పోయినా ఆ స్థానాన్ని నేను భర్తీ చే స్తాను . పవిత్రమైన ధర్మబద్ధమైన ఎటువంటి బాంధవ్యాన్నైనా  స్వయంగా వారితో నెరపుతాను’

దుఃఖం లో మునిగి తేలి మొత్తమంతా మెత్తనై పోయిన  మహా రాజు ఒకరు తన ప్రజలను ఉద్దేశించి ప్రకటిస్తాడు. ప్రేమించటం అంటే ఏమిటో, పోగొట్టుకోవటం ఎలా ఉంటుందోతెలుసుకున్న తర్వాతి  కారుణ్యం  అది .  గ్రహపాటు వలన విస్మరించిన ప్రియురాలిని ఎట్టకేలకు కనుగొన్నప్పుడు అక్షరాలా ఆమె పాదాల మీద పడతాడు [ఏకాంతంగా కూడా కాదు, ఆ సన్నివేశం లో ఇతరులు ఉండే అవకాశం ఉంది ] ఆ పాత్రను సృష్టించినది పరమ సహృదయుడైన కవి, కాళిదాసు. ఆ కృతి అభిజ్ఞాన…
పూర్తిగా »

రససిద్ధుని ప్రస్థానం

ఏప్రిల్ 2014


రససిద్ధుని  ప్రస్థానం

నా వ్యక్తిగత  దృక్పథం లోంచి ఆయన శాపగ్రస్తుడై జన్మించిన కిన్నరుడో , విద్యాధరుడో. పూర్వ జ్ఞానం లేదు, లేకనూ పోలేదు. ఆకాశ గంగా నిర్మల ధారలు, దేవ పారిజాత వృక్ష ఛాయలు, మానవ కంఠాలలో పలకని దివ్యతరమైన సంగీతం , ఇవన్నీ స్ఫురించీ స్పష్టమవని అయోమయం , కొన్ని మధుర కటుత్వాలు, , కొన్ని జ్వరిత స్వప్నాలు, మరి కొన్ని భ్రాంతులూ సాక్షాత్కారాలూ. .. వాటిలోంచి పుట్టిన కవిత్వ సౌందర్యం.

ఇంద్రజాలపు గవాక్షాలలోంచి ఆ  నిషిద్ధ సముద్రాల పొంగే నురగలు, చేరరాని గంధర్వలోకాలు.

ఇరవై ఐదేళ్ళ జీవితవ్యవధిలో కిక్కిరిసిపోయిన శోకాలూ తీవ్రతలూ స్నేహాలూ అనురాగం…. కొన్ని దోసిళ్ళ సన్నజాజులూ కొన్ని గుప్పెళ్ళ…
పూర్తిగా »

నృత్య నాట్య తాండవ వేదిక -నర్తనశాల

నృత్య నాట్య తాండవ వేదిక -నర్తనశాల

కొన్ని ఏళ్ల కిందట, అప్పుడే విశ్వనాథ వారి నవలలు చదువుకుంటూ సంభ్రమంతో తల మునకలవుతూ ఉన్నప్పుడు, స్నేహితురాలయిన రచయిత్రి అన్నారు ‘ ఆయన నాటకం నర్తనశాల చదవండి, అది చలం గారు రాసినట్లు ఉంటుంది ‘ అని. సంపాదించి చదివినప్పుడునాకు అలా అనిపించలేదు . అసలు చలం గారి సాహిత్యం తో ఏమైనా సంబంధం ఉందనీ అనుకోలేకపోయాను. దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలకి ఆ వైపుని చూపే ప్రయత్నం చేసినవారు విశ్వనాథ అని ఎందరికో తెలియదు. అదీ అటువంటిదేననిపించింది.

ఆ తర్వాత చాలా కాలానికి అర్థ తాత్పర్య సహితంగా తిక్కన గారి విరాటపర్వాన్ని గ్రహించే ప్రయత్నం చేశాను .…
పూర్తిగా »

ప్రజ్ఞా పారమిత – జేన్ ఆస్టిన్

ఫిబ్రవరి-2014


ప్రజ్ఞా పారమిత – జేన్ ఆస్టిన్

చార్లొటి బ్రాంటి లాగా ఆమె ఉద్వేగం నిండిన రచన చేయలేదు. జార్జ్ ఇలియట్ లాగా దిగంతాలను చూడలేదు. తనకు తెలిసిన, తాను మెలిగిన మనుషుల గురించే, పైపైన చూస్తే పైపైనిదనిపించే పద్ధతి లో చెప్పారు . ఆమె నాయికా నాయకులు ఉదాత్తతకో విజ్ఞానానికో పేరు మోసినవారు కానే కారు. మరి ఆమె ఏమి రాశారు?

హృదయానికీ మేధస్సుకీ సమన్వయం కుదిరేలా చేసుకోవటం ఆలోచించగలవారందరికీ అందీ అందక వేధించేదే. బ్రతకటం లో కళ ఎంత , శాస్త్రం ఎంత, రెండిటినీ కలిపిఉంచగల వీలెంత? గొప్ప కళాకారిణి జేన్ఆస్టిన్ రెండు వందల ఏళ్ల క్రితం చెప్పినదే ఇది అంతా.

పరిమితమైన పరిధిలో ఆమెకనబరచినది అపరిమితమైన ప్రజ్ఞ .…
పూర్తిగా »