డైరీ

సావిరహే!

మే 2016


సావిరహే!

నువ్వు నిశ్చలంగా, నేను గమనంలో... అంతేగా? అందుకేనేమో నా కళ్ళు మూతపడగానే దాగుడు మూతలలో నువ్వు! ఎన్ని గంటలు గడిపావు నువ్వు నా మనసులో? రాత్రి ముసుగులో, పగటి వెలుతురులో! నేనొక్కదాన్నే ఉన్న ప్రతిసారీ ..నువ్వు ...నీ జ్ఞాపకం! నేలరాలిన పారిజాతాలను ఏరకుండా చూస్తూనే ఉండాలన్న అనుభూతి! విరగబూసిన జాజిమల్లెల్ని చెట్టుకే ఉంచి వాసన పీలుస్తూ ఉండాలన్న కోరిక! కొబ్బరాకుల మధ్యనుండి వెన్నెల కోణాల్ని కొలుస్తూ రాత్రంతా కాపలా కాయాలన్న పిచ్చితనం! రాలే వర్షపు చినుకుల్ని దోసిట్లో పట్టుకుని ముఖం పై చల్లుకుంటూ మురిసిపోవాలన్న ఆరాటం! సంజ వెలుగులో చల్లటిగాలికి, ఏటిగట్టున రాతిదిమ్మపై వెల్లకిలా పడుకుని ఆకాశంవైపు చూస్తూ మొదటి నక్షత్రాన్ని పట్టేసుకోవాలన్న ప్రయాస.. వీటన్నింటికీ…
పూర్తిగా »

నిర్మోహం

ఏప్రిల్ 2016


నిర్మోహం

జీవితాన్ని నిష్కామంగా, నిర్లిప్తంగా గడిపేస్తున్నానని, గడిపెయ్యాలని అనుకుంటానా..
అవును, రోజూ అనుకుంటూనే ఉంటాను
ఏ సంతోషపు శిఖరాలూ అధిరోహించలేను, ఏ దుఃఖపు గుహలూ దర్శించలేను
నాకొద్దీ మాయామోహపు బంధనాలు
అందుకే ఒక నిమిత్తమాత్రురాలిగా, ఒక ప్రేక్షకురాలిగా మారిపోతూ ఉంటాను
రాత్రి వరండాలో పుస్తకంతో కూర్చుంటానా
నా దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తూ చందమామ నవ్వుతాడు
పైగా అడుగుతాడు కదా
నన్ను చూసి కూడా అలా నిర్మోహంగా జీవితాన్ని ఎలా చూడగలవు అంటూ
నన్ను కాదని తప్పించుకుని లోపలికి వస్తానా
వాకిటి గదిలో కొలువైన ఆ జీవం లేని కబుర్ల పెట్టె…
పూర్తిగా »

కాసిని మరకలు

డిసెంబర్ 2015


కాసిని మరకలు

హాయ్ రా!

నువ్వెలా ఉన్నావో నన్ను చేరుకున్న నీ అక్షరాలు విప్పి చెప్పాయి. నీ అక్షరాలకి ఈ నా లేఖ సమాధానంగా రాసింది కాదు గానీ నువ్వు, నేను, మనలాంటి వాళ్ళందరం ఎలా ఉన్నామో ఆలోచిస్తుంటే కాగితాన్నద్దుకున్న సిరామరకలు ఇవి.

ప్రతి రోజూ కొత్త ఉషస్సు తడిమినప్పుడల్లా ఒక్కొక్కసారి కొత్త ఉత్సాహంలా, మరి కొన్నిసార్లు అదో ఉత్పాతంలా అనిపించటంలోనే మనసు ద్వైదీభావం కనిపిస్తుంది కదా.. ఉత్సాహానికి ఊపిరి వచ్చిన రోజు కాలాన్ని ఎంత త్వరగా పరిగెత్తిస్తుందో, శూన్యాన్నివెంటపెట్టుకొచ్చిన రోజు క్షణం గడవక విలవిల్లాడిపోతుంది.

మనసులోని పదార్ధం అంతా ఖాళీఅయి ఒక్క ఆలోచనా ముందుకు కదలని నీరవ నిశ్శబ్దంలో ఎంత శూన్యం దాగి ఉంటుందో నీకు…
పూర్తిగా »

గడ్డిపరక

గడ్డిపరక

నాకు తెలుసు- నేను రాసేదేది కవిత్వం కాదని(ఇలా చెప్పడం ఈ మధ్య ఫాషన్ కావొచ్చుకాని.. నే నిజాయితీగానే చెప్తున్న), కవిత్వం అంతకన్నా గొప్ప సౌందర్యంతో అలరారుతుందని, అయినా రాస్తూ ఉంటాను. ఇక రాయడం మానుకోమని తోచినప్పుడల్లా, ఇంకొంచెం ప్రయత్నించవచ్చేమోనని లోలోపల తోస్తుంది. ఇక వద్దని మానేయాలనుకున్నప్పుడు- అటువైపు సున్నితంగానో, బలంగానో లాగే విరోధబాస-paradox.

ఎప్పుడు కవిత్వం నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టే ఉంటుంది. మళ్లీ మళ్లీ తిరిగొచ్చి గుండెలోనే తిష్ట వేస్తుంది. పుస్తకాలు చదువుకుంటున్నప్పుడో, జ్ఞానాన్ని, కవిత్వాన్ని ఒంపుకుంటున్నప్పుడో, జ్ఞానంలేని కవిత్వాన్ని నింపుకుంటున్నప్పుడో చిన్న అలికిడి వెంట వస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇంత రాసింతర్వాత మనం రాసిందేది కవిత్వం కాదని తెలియడం చిరాగ్గానే ఉంటుంది. తోచిన భావమల్లా…
పూర్తిగా »

ఒక obese బంధం

ఒక obese బంధం

వాళ్ళిద్దరి మధ్య బంధం నిలిచి ఉన్న నీళ్ళల్లో బాగా నాని, ఉబ్బిపోయిన శరీరంలా ఉంది. కదల్లేకుండా, ఆయాసపడుతూ ఉంది. చాన్నాళ్ళ తర్వాత చూశారేమో, వాళ్ళిద్దరూ మొదట గుర్తుపట్టలేదు దాన్ని.

ఇంతకు ముందు ఇంతిలా ఉండేది కాదుగా! ఇంత లావెక్కిపోయిందేంటి? – అని అవ్వాక్కయ్యారు ఇద్దరూ.

నిజమే, అదలా ఉండేది కాదు. మరీ సైజు జీరో కాకపోయినా, కొద్దో గొప్పో ఫిట్‌గానే ఉండేది వాళ్ళ పరిచమైన కొత్తల్లో. అంటే మరి, వాళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ ఆటపాటల్లో పాల్గొనాల్సి రావడంతో బంధానికి కసరత్తు బాగానే ఉండేది.

అలాగే ఉంటుందని అనుకున్నారు వాళ్ళిద్దరూ. అన్నీ అనుకున్నట్టే ఎక్కడ జరుగుతాయి? ఆఖరికి కథలకి కూడా అనూహ్యాలే ఆయువుపట్టు.…
పూర్తిగా »

మై బంజారన్!

మై బంజారన్!

చెరుకు తోట కోతకొచ్చింది. కోసిన పంట కోసినట్లే బోగీలలో వేసుకుని గూడ్సు బండ్లు ‘కూ…’ అంటూ షుగర్ ఫ్యాక్టరీకేసి పరుగులు తీస్తున్నాయి. బోగీల వెంట పరిగెత్తి టాటాలు చెప్పేవాళ్ళతో… చెరుకులు లాగే పిల్లలతో ఊరికి ఈ చివరంతా అదో సందడిగా వుంది. దూరమవుతున్న బోగీని అనుకరిస్తూ మేమంతా ‘కూ… చుక్..చుక్..చుక్’ మంటూ కొండ పైకి పరిగెత్తాం.

తెచ్చుకున్న చెరుకులని ఆ కొస నుండి ఈ కొస వరకూ చచకా నమిలి తాగేసి ఆటల్లో పడ్డాం. సమయం తెలియటం లేదు. వున్నట్లుండి మాలో ఏవరో గట్టిగా అరిచారు “అదిగదిగదిగో వాళ్ళే!” అంటూ. “అవునవును మన ఊరికే!” అన్నారింకెవరో. “హొ! హొ! హో! వచ్చేస్తున్నారోచ్!” ఉద్వేగం పట్టలేక అరిచారు…
పూర్తిగా »

పతాక సన్నివేశం

ఏప్రిల్ 2015


పతాక సన్నివేశం

నువ్వందరిలా కాదు తెలుసా ?

తెరలు తెరలుగా నవ్వొస్తోంది . ఈమాటతో మనుషులందరూ పడిపోతుంటారు, నాకు మాత్రం దిగులవుతుంది. ఇంకా ఎంత నటించాలి అందరిలా కావాలంటే అని! అందరూ నాటకాన్ని రక్తి కట్టించే పనిలో ఉంటారు, వాళ్ళ శక్తినంతా ధారపోసి మెరుగులు అద్దాలని చూస్తారు, ఎవరి పాత్రలో వాళ్ళు పక్కన వాళ్ళ పాత్రల్ని మెరుగులు దిద్దుతూ ఉంటారు. దుఖం లేని జీవితం, సంతోషం లేని ప్రేమ అన్నీ ఆనందంగా అనుభవిస్తున్నట్లు కనిపిస్తారు .

ఎప్పుడైనా విసుగు పుట్టి నేను రంగు వేసుకోకుండా రంగస్థలానికి వస్తానా… అంతే అందరూ ఒక్కింత గా వెక్కి వెక్కిఏడ్చేస్తారు. ఈ రంగే నీ జీవితం, నువ్వే రంగువి, అది లేని…
పూర్తిగా »

ఓ భావ సంచలన శకలం

ఏప్రిల్ 2015


ఓ భావ సంచలన శకలం

“పోతాయని కాదు ఎక్కడైనా ఉండేవే. కాకపోతే నెమ్మదిగా, ఒంటరిగా వేరే భారాలు లేకుండా నా వంక చూసుకుంటూ రాసుకోగలుగుతాననే వెళ్ళడం. అదే తృప్తి అని తెలుస్తోంది కనుక వెళ్ళడం. ఆలోచనల, జ్ఞాపకాలతో నిర్మించబడ్డ 'నేను'(అహం) రాత వల్ల ఎంత ఎక్కువగా dilute అయిపోతే - ఇక మిగిలి ఉన్న 'అసలు core' బయట పడుతుంది. ప్రతి వాళ్ళకీ అందుబాటులో ఉన్నదిది. అయితే వాంఛలతో నడుస్తున్న – కాదు పరిగెత్తుతున్న మనిషిని ఆగమనో లేదా వెనక్కి చూడమనో అంటే వెర్రివాళ్ళుగా జమకడతారు. ఎవరి వృత్తిలో వారు మునిగి ఉండటం గొప్ప అంతే - ఆగి తమ వంక చూసుకోవడమే అవమానంగా భావిస్తారు. కోరికలు, పుణ్యాలు, శాస్త్రాలు, ఇజాలు…
పూర్తిగా »

తాళం చెవి దొరకడం లేదు!

తాళం చెవి దొరకడం లేదు!

ప్రవేశిస్తున్న ప్రతిసారీ “లాకిన్ పీరియెడ్”గురించి స్పృహ
మూడేళ్ళా.. ఐదేళ్ళా.. అని
తలుపులు తెరుచుకుని.. మళ్ళీ మనమే మూసుకుని.. తాళంకూడా వేసుకుని
లోపల బందీ కావడం ఎంతకాలమో తెలియని అనిశ్చితి
మెడలో తాళి కట్టబడ్డ తర్వాత
“లాకిన్ పీరియెడ్” ఒక జీవితకాలం..ఇద్దరికీ
అప్పుడప్పుడు అనివార్యతలు లాకిన్ పీరియడ్ ను ధ్వంసం చేయమంటాయి
ప్రి-మ్యాచుర్డ్ పెనాల్టీలు భయపెడ్తాయి
ఉల్లంఘనకూ.. విముక్తతకూ సిద్ధపడుతున్నపుడు
తాళం చెవి దొరకదు.. ఎక్కడో పడిపోతుంది..వెదకాలి
ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని తెలుసుకోవడమే తెలియనప్పుడు
రెండు మనసుల మధ్య దూరం అస్సలే అర్థంకాదు
ప్రయాణం…
పూర్తిగా »

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా!

ఫిబ్రవరి 2015


చుట్టూపక్కల చూడరా చిన్నవాడా!

అదే సమస్య. అపరిచితుల మొహాలు అప్రధానమైపోయాయి. ఎక్కడో అందమైన మొహాలు ఎదురైతే తప్ప, మొహాలు చూడ్డం మానేసాం. ముఖ్యం టైము లేదు. ఆగే వీలు లేదు. స్పీడ్. రన్ రాజా రన్. రోడ్లు ఉన్నది సాధ్యమైనంత వేగంగా సాగడానికే. వెళ్తున్నది బండిపైనైనా, కార్లోనైనా. బస్సులోనైనా. మేరే నైనా. ఇదే పరిస్థితి కదా నైనా సెహ్వాల్.

మహా అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిముషాలు. అక్కడా పక్కవాళ్ళ మొహాలు చూసే అదృష్టం లేదు. అందమో, ఆరోగ్యమో, తల కాపాడుకోవడమో, మొహం చాటేయడమో… రీజనేదైనా అందుబాటులో ఉన్న బహుళార్ధసాధక రక్షణ కవచాలు అడ్డు. వాటికి తోడు ఆ కాస్త వ్యవధిలోనే అటెండ్ చెయ్యాల్సిన మొబైల్ కాల్సుంటాయి. కొల్లేరు…
పూర్తిగా »