పాత పుస్తకం

మంకుతిమ్మ కగ్గ

ఫిబ్రవరి 2018


కన్నడ సాహిత్య చరిత్రలో ఒక గొప్ప రచన మంకుతిమ్మ కగ్గ. దీనిని దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్ప (డి.వి.గుండప్ప) అనే ఆయన 1943లో వ్రాశాడు. మంకుతిమ్మ కగ్గ అంటే ‘మందమతి తిమ్మడి వెఱ్ఱిమాటలు’ అని అర్థం. ఇది నాలుగు పాదాలు కలిగిన 945 పద్యాల సమాహారం. వీటిలో అక్కడక్కడా ప్రాచీన కన్నడ భాష కనిపిస్తుంది. కొన్నింటిలో కవిత్వపు ఛాయలు గోచరిస్తాయి. లోతైన భావాలు కలిగి, కొన్ని పాడడానికి అనువుగా ఉంటాయి.

రచయిత వీటిని ‘మందమతి మాటలు’ అని చెప్పుకున్నా, ఇందులో గొప్ప జీవితానుభవాలు ఇమిడి ఉన్నాయి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో, వాటి ద్వారా ‘సత్య దర్శనము ‘ చేయిస్తూ మారుతున్న దేశకాల పరిస్ఠితుల కనుగుణంగా మానవులు ఎలా…
పూర్తిగా »

జీవిగంజి

జీవిగంజి

చాలా రోజులయింది ఈ పుస్తకం విజయవాడలో పాత పుస్తకాల షాపులో కొని. ఈ రోజు వెతుకులాటలో మరల చేతిలోకి వచ్చి అలా మనసులోకి పయనించింది. జీవిగంజి, ఇది పేరుకు తగ్గ పుస్తకం. మనిషి జీవనక్రమంలో స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని మాతృత్వం నుండి జీవిత వివిధ దశలలో ఆమె యొక్క రూపాన్ని చిత్రీకరించిన విధం సహజంగానూ ఆత్మీయంగాను సాగిన ప్రేమ కావ్యం ఇది.
పూర్తిగా »