సూడో-రామాయణం

సూడో-సూర్పనఖ :: స్టాండ్-బై లవ్

సూడో-సూర్పనఖ :: స్టాండ్-బై లవ్

తెలిసి తెలియని వయసులో పిల్లల్ని, “పెద్దయ్యాక నువ్వేమవుతావు?” అని అడిగే పెద్దాలు, అడగాల్సిన సమయంలో ఆ ప్రశ్న అడక్కుండా వాళ్ళ నిర్ణయాలనే నెత్తిమీద రుద్దేస్తారు. అలా రుద్దించుకున్న సూ.రాముడూ ఏదోలా హెడ్-బాలెన్స్ చేస్తూ చదువుల ప్రహసనాన్ని దాదాపుగా చివరి వరకూ తెచ్చిన రోజుల్లో, ఒక విహార యాత్రలో భాగంగా ఒక అడవి
పూర్తిగా »

రామాన్వేషణ

రామాన్వేషణ

 

“సీతే..సీతే!” అన్న అరుపులు ఎక్కడో అగాధంలోంచి వస్తున్నట్టున్నాయి.

అగాధపు అంచుల్లో ఉన్న సూడో-సీత ఆ అరుపులను లెక్కచేయకుండా, “రామా! రామా!” అని అక్కడక్కడే వెతుకుతుంది.

సూడో-రాముడు అపహరణ గురైయ్యాడన్న వార్త సూడో-సీతకు ఇప్పుడిప్పుడే అందింది. ఆ వార్తను చెప్పుకోడానికి, బాధను పంచుకోడానికి, కలిసి వెతకడానికి లక్ష్మణుడు, హనుమంతుడు వగైరాలెవ్వరూ సూడో-సీతకు అందుబాటులో ఉండరు. వాళ్ళంతా రాముడి పక్షం కదా! వాళ్ళకి సూ.సీత ఉందని కూడా తెలీదు.

సూ.సీత అక్కడక్కడే వెతికి వేసారింది. కట్టుకున్న మనుషులైతే కారడవులు దాటుకొని, ఆనకట్టలు కట్టుకొని వెతుకుతారని మనం విని ఉన్నాం. కానీ, కంటికి ఆనని మనుషులు వెతకాల్సినవచ్చినప్పుడు చాలా టర్మ్స్ ఆండ్ కండీషన్స్ ఉంటాయి.…
పూర్తిగా »