ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – చివరి భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – చివరి భాగం

ఎవరికీ మనసు బాగోలేదు. ఆకళ్లు లేవని తిండితిప్పలు వద్దన్నారు సరోజగారు, భవానిగారు. రూంలో ఒక టవల్‌తో మొహాన్ని కప్పుకుని మంచంమీద వాలిపోయారు సరోజగారు. అప్పుడప్పుడూ వచ్చే ఎక్కిళ్ల వల్ల ఆవిడ నిద్రపోవట్లేదని తెలుస్తూనే వున్నది. ఆ మంచంమీదే భవానిగారు ఒకపక్క తన రెండు చేతులతో ఆమె కుడిచేతిని పట్టుకుని కూర్చున్నారు. హమీర్ ఆమె పాదాల చెంత కూర్చుని తనక్కడే వున్నానని చెప్పడాని కన్నట్టు ఆ పాదాలను పట్టుకున్నాడు. తన బాధని పంచుకోవడానికీ, తన తలని మెడవంపులో ఆనించుకుని  జుట్టులో వేళ్లుపెట్టి దువ్వడానికీ ఎవరూ లేరన్న వెలితి అతనికి స్పష్టంగా తెలిసివచ్చింది.
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – పదవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – పదవ భాగం

తన దగ్గర వున్నది ఒక్క అమానీ కాంటాక్ట్ మాత్రమేనని కూడా అతనికి గుర్తుంది. ఆమె లాస్ట్ నేమే తనకి తెలియదు! ఆమె చెప్పిన వేటినీ అతను వెరిఫై చెయ్యడానికి కావలసిన వివరాలు అతని దగ్గర లేవని మాత్రం తెలుసు. ఇంక పోలీసుల దగ్గరకి వెళ్లి ఏం చెబుతాడు? ఒకవేళ ఆమె చెప్పినవన్నీ కట్టు కథలేమో? తనమీద సానుభూతిని అతని వద్దనుంచీ సంపాదించుకోవడానికి వేసిన నాటక మేమోనన్న సందేహం కూడా అతనికి వచ్చింది. కానీ, ఆమె బోట్ రైడ్‌లో ఇచ్చిన ముద్దూ, తన శరీరంతో పంచుకున్న క్షణాలని స్పష్టంగా ఆనందించినట్లు కనబడడం అతనికి గుర్తొచ్చి ఆమెని అనవసరంగా అనుమానిస్తున్నానని కూడా అతనికి అనిపించి సిగ్గుపడ్డాడు.
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – తొమ్మిదవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – తొమ్మిదవ భాగం

9

“రండి, రండి. ఈ దసరాల సమయంలో మీ రాక మా కెంతో ఆనందాన్నిస్తోంది,” అన్నారు మూర్తిగారు. ముందుగా వనజగారు, ఆవిడ వెనక రావుగారు, చివరగా మీనా మూర్తిగారింట్లోకి ప్రవేశించారు. లివింగ్ రూమ్‌లో అప్పటికే ఆయన కుటుంబ సభ్యులుండడం చూసి అటువైపు అడుగేశారు.

“మా ఆవిడ భవాని, అమ్మాయి విదుషి, అబ్బాయి రోహిత్, హమీర్ వాళ్లమ్మగారు సరోజ గారు!” మూర్తిగారు పరిచయం చేశారు.

“మీకీపాటికి తెలిసేవుంటుంది గానీ, నౌ యు కెన్ పుట్ ది ఫేసెస్ టు ది నేమ్స్ – నా భార్య వనజ, ఏకైక పుత్రిక మీనా,” రావుగారు తనవంతు పరిచయం చేశారు.

అప్పటికే రెడీగా వున్న స్నాక్స్‌ని…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఎనిమిదవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఎనిమిదవ భాగం

8

యూనివర్సిటీ డైనింగ్ హాల్‌లో మేడ్ టు ఆర్డర్ శాండ్‌విచ్ కోసం లైన్లో నిలబడ్డ హమీర్ తన ముందు నిలబడ్డ ఆమెను చాలాసేపే చూశాడు. తన శాండ్‌విచ్ ట్రేని తీసుకుని, ఆమె ఒక్కతే టేబుల్ దగ్గర కూర్చుని వుండడాన్ని చూసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి, “ఐ హాడ్ ఎ గ్రేట్ వ్యూ!” అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. వినబడలేదేమో అనుకుని ఆ లైన్‌ని రిపీట్ చేసి, “ఐ వజ్ స్టాండింగ్ బిహైండ్ యు ఇన్ ది లైన్,” అన్నాడు.

“వాటెబవుట్ దిస్ వ్యూ?” అనడిగింది లేవకుండానే.

“హార్డ్ టు టెల్. ది టేబుల్ ఈజ్ హైడింగ్ పార్ట్ ఆఫిట్,” అన్నాడు…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఏడవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఏడవ భాగం

ఆరోజు పొద్దున్న అమాని టెక్స్ట్ పంపింది సాయంత్రం కలవాలంటూ - అతని అపార్ట్‌మెంట్లో. కాలికి కట్టు విప్పినాగానీ అతను తల్లితోబాటు ఇంకా మూర్తిగారింట్లోనే వుంటున్నాడు - వాళ్లు తమకీ కాలక్షేపంగా వుంటోందని బలవంతం చెయ్యడంవల్ల. రోహిత్ ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టిన తరువాత అపార్ట్‌మెంట్ తీసుకుని వెళ్లిపోయాడు. అందుకని భవానిగారికి కూడా సరోజగారు అక్కడ వుండడం మంచి కాలక్షేపాన్నిస్తోంది.
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఆరవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఆరవ భాగం

"నాలాగా కూడా! ఐ లవ్యూ," అన్నది విదుషి పాసెంజర్ సీట్లోంచే అతని మెడమీద చెయివేసి నిమురుతూ. "మీనామీద ఇంటరెస్టే లేనట్టు మాట్లాడాడు గానీ, హమీర్ ఈజ్ కుకింగప్ సంథింగ్. అంత వద్దని వెళ్లిపోయిన ఆమెని అంత తొందరగా క్షమించేస్తావా అని అంటారేమోనని వాడి భయమనుకుంటా! ఇఫ్ మై సస్పిషన్ ఈజ్ కరక్ట్, డెన్వర్ ట్రిప్ తరువాత మీనా, హమీరూ పాచప్ అయ్యుండాలీపాటికి. అమ్మాయి తనంతట తానే వెదుక్కుంటూ వస్తే కాదనే మగాళ్లెవరుంటారు?"
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఐదవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఐదవ భాగం

5

ఆ “యాక్సిడెంట్ ఇంపాక్ట్ డ్రైవర్ సైడ్ డోర్ ముందర అవడం చాలా అదృష్టం. అదే కొన్ని క్షణాల తరువాత అయ్యుంటే నిన్ను వంటినిండా గాయాల్తో చూడాల్సొచ్చేది!” అన్నారు మూర్తిగారు హాస్పిటల్లో హమీర్‌ని చూడ్డానికి వచ్చి.

రాత్రి పదకొండు గంటలప్పుడు జరిగిన ఆ యాక్సిడెంట్ స్థలానికి పోలీసులూ, ఆంబులెన్సూ, ఫైర్ ట్రక్కూ అయిదు నిముషాల్లోనే వచ్చినా, హమీర్‌ని బయటకు లాగడానికి గంటసేపు పట్టింది. ఆ ఇంపాక్ట్‌ని డోర్ హింజ్ వున్నచోట కారు ఫ్రేమే ఎక్కువ భరించినా, డోర్ కూడా వంకరపోయినందువల్ల అది తెరవడానికి సాధ్యమవలేదు. పైగా, అతని ఎడమ కాలు ఆ వంకర తిరిగిన కారు ఫ్రేములో ఇరుక్కుపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – నాలుగవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – నాలుగవ భాగం

4

“లెట్స్ గో ఫర్ ఎ బోట్‌రైడ్ ఆన్ ది పొటోమాక్ రివర్! దట్ వే యు డోంట్ హావ్ టు టీచ్ మి ఎనీథింగ్!” హమీర్‌కి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అమాని నుంచి డిసెంబర్ మొదటివారంలో. ఆమెకి వీలయినప్పుడే, ఆమె సూచనలని పాటిస్తూనే వుండాలి ఆమెతో తిరగాలంటే అని అతనికి ఎప్పుడో అర్థమైంది. మనిషి కనిపించకపోయినా గానీ కనీసం ఆమె గొంతు వినాలని అతనికి ఎంతవున్నా గానీ ఆమె అనుగ్రహిస్తేగా!

“ఎండాకాలంలోనో, స్ప్రింగ్‌లోనో, లేక ఫాల్‌లోనో అంటే అర్థముంది గానీ, ఈ చలిలోనా? పైగా, నీళ్లమీద ఇంకా చలిగా వుంటుంది,” జవాబిచ్చాడు.

“వాళ్లు బోట్లు నడుపుతూనే వున్నారుగా! అన్లెస్ యు…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – మూడవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – మూడవ భాగం

హమీర్ డెన్వర్‌నించీ వచ్చిన తరువాత అమానితో తరచుగా కలుస్తాననే అనుకున్నాడు. అయితే, అమాని అతని ఫోన్ కాల్స్‌ని ఎప్పుడూ ఆన్సర్ చెయ్యలేదు. అతనికి విసుగొచ్చి ఆమె గూర్చి ఆలోచించడం మానేద్దా మనుకున్నంతలో అక్టోబర్లో ఆమెనుంచీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది – “డూ యు వాంట్ టు డేట్?” అని.
“డేట్ హూ?” అని కోపంగా రిప్లై ఇద్దా మనుకున్నాడు గానీ, కొంచెం శాంతించి, “డోన్ట్ నో మచ్ అబవుట్ డేటింగ్!” అని జవాబిచ్చాడు.
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – రెండవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – రెండవ భాగం

2

డెన్వర్‌లో విమానం ఎక్కేముందూ, ఎక్కిన తరువాతా కూడా మీనా ఎయిర్‌పోర్ట్‌లో కనబడడం గూర్చి హమీర్ ఆలోచిస్తూనే వున్నాడు. కళ్లు మూసుకుంటే – యూనివర్సిటీ డైనింగ్ హాల్లో లైన్లో ఆమె వెనుక అతను … తరువాత ట్రేలో పిజ్జా పట్టుకుని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న ఆమె ముందు నిలబడి… డాన్స్‌లో ఆమెని రెండు చేతులతోటీ నడుము దగ్గర పట్టుకుని గాలిలో ఎగరేస్తూ, తిప్పుతూ… మెడ వెనుక ఆమె జుట్టుని చేత్తో పక్కకు తోసి చెవి వెనుక ముద్దు పెడుతూ …

లాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని అతను పనిచేస్తుంటే అతని జుట్టుని చేత్తో చెరిపేస్తూ ఆ ఒళ్లోనే వాలుతూ … కిచెన్…
పూర్తిగా »