పక్కన ఐఫోన్లో అలారం మోతకి గబుక్కున మెలకువ వచ్చింది హమీర్‌కి. ఫ్లయిట్‌ని కాచ్ చెయ్యడంకోసం ముందుగా లేవడానికి అలారం పెట్టుకున్నాడన్న మాట నిజమే గానీ, అలా హఠాత్తుగా లేచేసరికి అతనికి తలకాయనెప్పి వచ్చింది. కలవల్లో లేక కంఫర్టర్ని కప్పుకుని వుండడంవల్లో గానీ బనీన్ చెమటతో తడిసిపోయింది. అది కల వల్లనే అనుకోవడానికి బలమైన కారణాలే వున్నాయి. ఎందుకంటే, ఆ కల సామాన్యమైనది కాదు. అది ఎవరి కయినా గానీ మెలకువ రాగానే ఆప్యాయంగా అక్కున చేర్చుకునే స్పర్శని అమితంగా కాంక్షించేలా చేసేది. శరీరంలోని నాడీ, తంత్రులనే గాక వాటికి మూలాలని కూడా గుర్తుచేసేది. అతని విషయంలో ఆ కోరిక మాటల కందనంత బలమైనదే గానీ,…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్