అనువాదం

నైతిక కార్యాచరణ (Moral Activity)

మనం అనునిత్యం మన చర్యల్ని అవి ఇతరులపై చూపే ప్రభావం ఆధారంగా అంచనా వేస్తాము. అది ఎందుకంటే, ఆత్మప్రమాణంలో ఇతరులకి మంచి చెయ్యడమే మంచి, హాని చెయ్యడం కాదు. ఆత్మ ఇతరులకి మంచి చెయ్యడం… ఏదో ప్రయోజనాన్ని ఆశించడం కాకుండా కేవలం మంచి చెయ్యాలన్న తలపు వలననే. కనుక మన చర్యల్ని అవి కలిగించే ఫలితాలబట్టి అంచనా వెయ్యాలి; మనం ఇతరులకి హాని చెయ్యకుండా, మంచి చెయ్యాలంటే ఎలా నడుచుకోవాలన్నదానిగురించి ఆలోచించాలి. మన చర్యల్ని అంచనా వెయ్యడం, మంచి చెయ్యాలన్నఆలోచనా ఇవన్నీ నైతిక కార్యాచరణలో భాగమే; అన్ని ఆ లక్ష్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా చేసే ప్రయత్నానికి ఉపకరణాలు అని గుర్తించాలి. ఆ ఒక్క విధంగా మాత్రమే…
పూర్తిగా »

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 2

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 2

శతాబ్దాల ఆలోచనా స్రవంతితో మానవ స్వభావం గురించీ, విశ్వం స్వభావం గురించీ తత్త్వశాస్త్రం ఒక సత్యాన్ని ప్రకటించింది, ఆ పని ఒక్క తత్త్వశాస్త్రం మాత్రమే చెయ్యగలదు. ఆ సత్యం అందరికీ చెప్పాలి అందరూ తెలుసుకోవాలి. పిల్లలలకి చిన్నప్పటినుండీ క్రమంగా పరిచయం చెయ్యాలి; అది వాళ్ళకి చెబుతున్నకొద్దీ, దానిమీద వాళ్ళు పరిశ్రమ చేస్తున్న కొద్దీ వాళ్ళకి దానిమీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం చదువుని అర్థం అయ్యేలా చేస్తుంది; జీవితం అంటే అవగాహన కలిగిస్తుంది; అది సవ్యంగా ఆలోచించగలిగిన ప్రతి వారూ ఆహ్వానిస్తారు, కారణం అది మానవాళి ఆకాంక్షలకి సమాధానాలు చెబుతుంది.
పూర్తిగా »

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 1

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 1

తత్త్వవేత్త అనగానే, తత్త్వవేత్తలకు మాత్రమే పనికివచ్చే విషయాలగురించి వాళ్ళ పరిభాషలో మాట్లాడేవ్యక్తి అని ఇంగ్లండులో చాలమంది అభిప్రాయం. కాని నిజానికి తత్త్వశాస్త్రం మనుషులందరికీ పనికివచ్చే విషయాలు, మనిషి స్వభావం, ఈ విశ్వం, దాని స్వభావం మొదలైనవాటిని చర్చిస్తుంది. ప్రతి మనిషీ పుట్టుకతోనే తత్త్వవేత్త. కానీ అతనిలోని తత్త్వవేత్తని రెక్కాడితే గాని డొక్కాడని మనుగడకు సంబంధించిన జీవితసమస్యలు అణచివేస్తాయి. పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎక్కువ తాత్త్వికులు. ఉపాధ్యాయునికంటే విద్యార్థులు ఎక్కువ తాత్త్వికులు. వాళ్ళకు తెలియకుండానే విద్యాభ్యాసంలో వాళ్లు కోల్పోతున్నది ఈ తత్త్వచింతనే. ఈ తాత్త్విక చింతన లోపించడం వల్లనే వాళ్ళకి విద్యాభ్యాసం రుచించక దానికి ఎదురుతిరిగే విధంగా వాళ్లను ప్రేరేపిస్తుంది. మంచిగా ఎందుకు ప్రవర్తించాలి, జ్ఞానాన్ని ఎందుకు…
పూర్తిగా »

తత్త్వశాస్త్రం యొక్క ఆవశ్యకత

ఏప్రిల్ 2016


తత్త్వశాస్త్రం యొక్క ఆవశ్యకత

["The Ultimate Belief" by CLUTTON BROCK]

ఉపోద్ఘాతం

ఈ చిన్ని పుస్తకాన్ని ఎప్పుడైనా రాసి ఉండొచ్చు గాని, ఈ ప్రపంచ యుద్ధం దానికి ప్రేరణనిచ్చింది. జర్మన్లు వాళ్ళ పాఠశాలల్లో, అక్కడి జనాభాలో ఎక్కువమంది ఆమోదించే ఒక రకమైన భావజాలాన్ని బోధిస్తారు, దానికి అనుగుణంగానే వాళ్ళు ఇప్పుడు ఆచరిస్తున్నారు. అది వాళ్ళకి ఒక ఐకమత్యాన్నీ, మొండి ధైర్యాన్నీ ఇచ్చింది; అంతే కాదు, మనందరకూ తెలిసిన అనేక నేరాలు చేసేలా ప్రేరేపించింది కూడా. మనం, దానికి విరుద్ధంగా, మన పాఠశాలల్లో ఏ భావజాలాన్నీ బోధించము, కనీసం తత్త్వచింతనగా పిలవదగ్గదేదీ బోధించము; అలా చెప్పనందుకు గర్వపడతాము కూడా. ఒక భావజాలం జర్మన్లు…
పూర్తిగా »