ముషాయిరా

కవిత్వానికి స్వరాన్నిస్తే…
అపురూపమైన అక్షరాలను శబ్దతరంగాలుగా మార్చగలిగితే
కలం.. గళం.. ఉప్పొంగే హృదయం.. “ముషాయిరా”
ప్రతినెలా ఓ అందమైన కవితను వినిపించే సరికొత్త కాలమ్..

దిల్ హూ హూ కరే – అఫ్సర్

జనవరి 2018


కవిత: దిల్ హూ హూ కరే… (‘ఇంటివైపు’ సంపుటి నుండి)
కవి: అఫ్సర్

Audio


పూర్తిగా »

నాన్న – ఎండ్లూరి సుధాకర్

అక్టోబర్ 2017


నేను తండ్రినయ్యాకే తెలిసింది
నా తండ్రి ప్రేమేమిటో
నాన్న లేనప్పుడే తెలిసింది
నాన్న లేనితనమేమిటో
నా కళ్లల్లోంచి నాన్న కదలాడుతూ
నా కోసం కన్నీళ్లు కారుస్తున్న దృశ్యం ముందు
నాన్న చనిపోయాడని నాకెప్పుడూ అనిపించదు...
పూర్తిగా »

తూనీగ – స్మైల్

జూలై 2017


తూనీగ – స్మైల్

కవిత: తూనీగ
కవి: స్మైల్
సంకలనం: ‘ఖాళీ సీసాలు’ (1995 లో ప్రచురితం).
మొదటి ముద్రణ: ఆంధ్రజ్యోతి 4.7.1980.

పూర్తిగా »

ఎర్రని జ్ఞాపకం

ఫిబ్రవరి 2017


ఎర్రని జ్ఞాపకం


“కొందరి జ్ఞాపకం ఎప్పుడూ అంతే
దేహాన్ని నీట్లో ముంచి
ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టే..
లోపల నీరంతా ఎవరో బయటకు తోడేస్తున్నట్టే…
రక్తదాన కేంద్రాల్లాగా
కన్నీటిదాన కేంద్రాలున్నాయేమో చూడాలి…”

ఈ నెల ముషాయిరాలో కవిత ‘అరుణ్ సాగర్’ స్మృతిలో, ‘ఎర్రని జ్ఞాపకం’, డా. ప్రసాదమూర్తి కవితా సంపుటి “చేనుగట్టు పియానో” నుంచి.

Audio

ఎర్రని జ్ఞాపకం

కొందరి జ్ఞాపకం ఎప్పుడూ అంతే
దేహాన్ని నీట్లో ముంచి
ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టే
లోపల నీరంతా ఎవరో బయటకు తోడేస్తున్నట్టే-
రక్తదాన కేంద్రాల్లాగా
కన్నీటి దానకేంద్రాలున్నాయేమో
చూడాలి..…
పూర్తిగా »

అగ్ని స్పర్శ -అజంతా

జనవరి 2017


అగ్ని స్పర్శ -అజంతా

Audio

బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్నప్పుడే
క్షణాల మధ్య అగాధంలో స్వప్న చక్షువులకు నిషా
ఖడ్గ ధారల మధ్య క్షతగాత్రుడైనా అప్పుడు ఉజ్వలంగానే ఉంటాడు
వైరుధ్యాలను వెన్నెముకగా ధరించిన నేను
ఎడారిలో వానజల్లుల రహస్యాన్ని ఏనాడో మౌనంగా స్వీకరించాను

కాలం మరెవరో కాదు నేనే

క్షణక్షణ సంహార క్రీడలో గతం, వర్తమానం, ఉదయాస్తమయాలు
ఉన్మత్త క్షేత్రాలలో రాక్షసుల ఉచ్చ్వాస నిశ్వాసాలు
జీవన కుడ్యాలలో ఆకలి ఆకర్ణాంత నేత్రాలు
కన్నీళ్ళలో ప్రేమికుల ప్రతిబింబాలు
అన్నీ ఒకే దృశ్యం వెనుక చీకటి భాస్మరాసులే!

కంటక చతురస్రాల మధ్య నిరీక్షణ అసహ్యం నాకు
నిరాశ,…
పూర్తిగా »

నా కోసం వేచిచూడు -శివసాగర్

నవంబర్ 2016


ఉరితీయబడ్డ పాట నుండి
చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి,
వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను.
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
పూర్తిగా »

నువ్వు లేవు నీ పాట ఉంది…

సెప్టెంబర్ 2016


కవిత్వానికి స్వరాన్నిస్తే...
అపురూపమైన అక్షరాలను శబ్దతరంగాలుగా మార్చగలిగితే
కలం.. గళం.. ఉప్పొంగే హృదయం.. "ముషాయిరా"
ప్రతినెలా ఓ అందమైన కవితను వినిపించే సరికొత్త కాలమ్..

పూర్తిగా »