తలపోత

మాయమైపోయిన నెమలీక

19-జూలై-2013


మాయమైపోయిన నెమలీక

సాహిత్య పరంగా నాకో చెడ్డ అలవాటుంది . అదేమిటంటే కవులు , రచయితల చిరునామాలు రాసి పెట్టుకున్న డైరీ ని ఎప్పుడు తిరగేసినా అప్పటి వరకూ చనిపోయిన వాళ్ళ చిరునామాలపై ఇంటూ గీతలు కొట్టడం. మొన్నటికి మొన్న కె.ఎస్. రమణ గారి చిరునామా కనబడితే ఎందుకో కొట్టి వేయబుద్ది కాలెదు. నా డైరీనిండా ఇలాంటివి ఎన్నో! వాటిలో కాల ధర్మం చెందిన జి.వి.ఎస్., నాగ భైరవ, తొక్కుడు బండ కృష్ణముర్తి, ఇస్మాయిల్, స్మైల్, అజంతా,మో , కొత్తపల్లి, వడలి మందేశ్వరరావు, జ్ఞానానంద కవి, సదాశివ వంటి పెద్దలూ, అకాల ధర్మం చెందిన మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్ బాబు, నాగప్పగారి సుందర్రాజు, నక్కా అమ్మయ్య, నాగపురి…
పూర్తిగా »

లవ్ యూ రా టింకూ

లవ్ యూ రా టింకూ

మనిషికీ కుక్కకూ మధ్య బంధం ఎప్పటి నుంచీ ఏర్పడిందో తెలీదు కానీ.. అవి మనిషికి మంచి మిత్రులవ్వ గలవు. ఇది మనలో ప్రతి ఒక్కరికీ యేదో ఒక స్థాయిలో ఎదురయ్యే నిజం. చిన్నప్పటి రోజులు తరువాతి జీవితపు ఘటనలు కూడా నాకు ఇంట్లోని పెంపుడు కుక్కల ఆశ్చర్య కరమైన అద్భుత ఆత్మీయతకు సాక్షులుగా నిలిచిన జ్ఞాపకాల పేజీలనిచ్చాయి.

టింకూ.. ఇప్పటి తాజ్ కృష్ణ కట్టే సమయంలో.. నాన్నగారికి అనుకోకుండా ఆ సైట్ దగ్గర పరిచయమయ్యింది. తెల్లని బొచ్చు మీద నల్లని మచ్చలు, చురుకైన కళ్ళూ, వయ్యఆరంగా కదిలే నడుమూ, కాంఫిడెంట్గా వూపే తోక.. నాన్నగారికి ఇట్టే నచ్చేసింది. నాన్నగారు సైట్ ఇన్ చార్జి గా పటాన్…
పూర్తిగా »

పిచ్చుకలొచ్చేశాయ్… యాహూ..

ఏప్రిల్ 2013


పిచ్చుకలొచ్చేశాయ్… యాహూ..

సంవత్సరం క్రితం వరకు.. సెల్ ఫోన్లూ, సెల్ఫోన్ టవర్ల దెబ్బకి మన హైద్రాబాద్ నుంచి పిచుకలు శాశ్వతంగా నిష్క్రమించాయన్న బాధలోనే వుండేదాన్ని. నా చిన్నప్పటి హైద్రాబాద్ లో పిచ్చుకల కువకువలతో తెల్లారేది.

పిచ్చుకల గూళ్ళు ఇంట్లో పెట్టకూడదని వాటి గూళ్ళని తీస్తూ అమ్మ మాట కాదనలేక అందులో గుడ్లు వుంటే చిన్నక్క మళ్ళీ వాటిని యధాస్థానం లో పెట్టేయడం, ఒక మంచి ఉదయాన.. పిల్లల కువకువలు వినిపించడం, అది వంటింట్లో వున్న వెంటిలేటర్ లో కావడంతో.. అవెక్కడ కింద పడతాయో అని ఊపిరి బిగపట్టి చూడటం,

నాన్నగారు మురిపెంగా వేసుకున్న ధనియాల మళ్ళల్లో కొత్తిమీర మొక్కలొస్తే.. వాటికి నాలుగు వైపులా చిన్న కర్రలు పాతి ఆ…
పూర్తిగా »

కనీసం నీ పేరైనా అడగలేదు..

ఫిబ్రవరి 2013


ఎలా ఉన్నావో మళ్ళీ నీ నవ్వు నేను చూడగలనో లేదో కనీసం నీ పేరైనా నేనెప్పుడు అడగలేదు.. అమ్మకాలలో ఆపూట తీరిక లేకనో అసలు అమ్మకాలే లేకనో ఇంత తిండైనా తిన్నావో లేదో పొట్ట చేత్తో పట్టుకొని పట్టణానికి బయలెల్లిన నువ్ నీ వాళ్ళను  చూసి ఎన్నాలైందో టీవీలో వార్త చూసి నిన్ను పోల్చుకోవటంలో ఎంతటి క్షోభననుభిస్తున్నారో నీవాళ్ళు నా సాటి మనుషులు .. అవును మనలాగే ఈ ఘటనా రచకుడు మనిషే అంటావా? ఏ రక్తం తో చేసాడో ఏ మట్టి ముద్దలో ఆ వైషమ్యాల ఊపిరిని ఏ విధంగా ఊదాడంటావు ఆ విధాత నిజంగా విధాతే  చేసాడందామా? ఇప్పుడే వచ్చేస్తా ఏం తేను…
పూర్తిగా »

పాపం.. వాడు అమానుషుడు!

ఫిబ్రవరి 2013


మేధో హృదయమా
ఒకసారి అలా నడిచొద్దాం రా..

కరుడుగట్టిన క్రౌర్యంలో
మానవతా రేఖలు వెతుకుతున్న మహోన్నత్వమా..
త్వరగా చెప్పులు తొడుగు
అక్కడ రహదారి నెత్తురోడింది
మానవ దేహాలు ముక్కలయ్యాయి
మానవత్వ తీవ్రవాదికి
ఎరుపులో ఆనందపు మెరుపులు

***

ఎక్కడున్నాడో వెతకండి
పట్తుకుని ఇంత కారుణ్యపు వెన్నముద్దలు తినిపించాలి
కన్నీళ్ళతో చాయ్ చేసి విగత జీవుల దేహాల రొట్టె ముక్కలందించాలి

గ్రద్దలకు హంసల తొడుగు తయరు చేశారా..
మృత్యుహుంకారం లో పెనుగులాడే అమాయకత్వం
భళ్ళున బద్దలై మండిన రావణ కాష్టం
ఎన్ని పదాలు బంధించగలవు
ఆ విహ్వల ఆత్మల…
పూర్తిగా »

మరణం తరవాత తెలుస్తున్న రమణ!

ఫిబ్రవరి 2013


మరణం తరవాత తెలుస్తున్న రమణ!

కొద్ది సార్లు ఆయన్ని యూనివర్సితీలో కలిసాను. పరీక్షల నిర్వహణా విభాగంలో వున్నప్పుడు చాలా చేసేపు ఎదురెదురుగానే పనివత్తిడివల్ల సమయం గడిచిపోయింది. నా కవిత్వం రాయటంలో కొన్ని సూచనలు ఇచ్చారు. 2004 హసీనా – దీర్ఘ కవితగా రాయడం ఆయన ప్రోత్సాహమే.

మాటల్లో ఒకసారి మీరు పిహెచ్ డి ఎందుకు చేయకూడదూ అని అడిగారు. ఎం.ఎ. చెయ్యలేదని చెపాను. ఆయన ప్రోత్సాహంతో 2010-12 ఎం.ఎ. జాయిన్ అయ్యాను. ఇక్కడ ఆయనే అధునిక కవిత్వం అనే అంశాన్ని బోధించారు, కాని నా గుండె ఆపరేషన్ వల్ల ఆయన తరగతులు హాజరు కాలేకపోయాను. అదో అంసృప్తి నాకు. డిశెంబరు 2012లో  యెస్.పి కాలేజిలో చిన్న ఫేర్ వెల్ జరిగింది.…
పూర్తిగా »

చివరి క్షణం వరకు ఆయన యువకుడే

చివరి క్షణం వరకు ఆయన యువకుడే

 

పుట్టుకతో వృద్ధులైన కుర్రవాళ్ళమాటేమోగాని,ఎంత వయసు వచ్చినా మరణించేవరకు యువకులుగా ఉన్న కొందరు విశిష్ట వ్యక్తుల్ని నేను చూసాను. వారిలో పెమ్మరాజు వేణుగోపాలరావుగారు ముఖ్యులు.

అటువంటి స్వభావం ఏర్పడటానికి జీవితంపై ఆయనకున్న ఆశావహమైన దృక్పధమే కారణం. ఆయనతో అనేకసార్లు జరిపిన సంభాషణల్లో ఎప్పుడూ గతంలో జరిగినదాని మీద చింత, గతమంతా గొప్పదన్న నాస్టాల్జియా, ముందేమవుతుందోనన్న ఆందోళన, ఏమీ చెయ్యలేమన్న నిస్పృహ – ఇటువంటివేవీ ఎప్పుడూ కనిపించేవికావు. విశాలమైన జీవితం, అపారమైన అవకాశాలు తన ముందు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరుచుకోవటానికి తనుచెయ్యవలసిన కృషిఏమిటనేదానిమీదే ఆయన దృష్టిఉండేది. నలభైలలో ఉన్న నాకులేని ఇటువంటి ఆశావహమైనదృష్టి,ఎనభైలకి చేరువవుతున్నఆయనకెలా ఏర్పడుతుందోఅని ఆశ్చర్యంకలిగేది. విశ్రాంతిపై ఆయనకున్న…
పూర్తిగా »

పతంజలి లేని ఈ నాలుగేళ్ళు…!

పతంజలి లేని ఈ నాలుగేళ్ళు…!

పతంజలి గారు చనిపోయి రెండేళ్ళు అయిందా, మూడేళ్ళు అయిందా?  ఏదో పుస్తకం చూసో, ఫ్రెండ్ ని అదిగో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అది ఇప్పుడు ఏమంత ముఖ్యం కాదు. ఎందుకంటే, అది doesn’t matter నాకు . ఏదైనా రాస్తున్నపుడో, రాజ్యం దాష్టీకం గా ప్రవర్తించినపుడల్లా, పోలీసులు క్త్రౌర్యంగా ప్రవర్తించినపుడల్లా, మర్యాదలకోసం పేరు కోసం ఎవరైనా నంగిరిపోయినపుడల్లా, కోర్టులు అన్యాయమైన వ్యాఖ్యలు చేసినపుడల్లా, కంపరమెత్తే పనులెవరైనా చేసినపుడల్లా   – రోజు మొత్తం మీద పతంజలి గారు గుర్తు కొచ్చే సంఘటనలు ఎన్నో.
   కొందరిని మరిచిపోవడం అసాధ్యం. జాతి జ్ఞాపకంలో, సామూహిక జ్ఞానంలో  సజీవంగా నిలిచిపోతారు. ఆ కొద్దిమందిలో పతంజలి ఒకరు.…
పూర్తిగా »