స్మరణిక

పొద్దున్నే తలచుకోవాల్సిన మన అక్షరజీవులు కొందరి జ్ఞాపకాలు.

పరిమళాలు మిగిల్చిన మాలతి

23-ఆగస్ట్-2013


పరిమళాలు మిగిల్చిన మాలతి

ఒక యుగం ముగిసిపోయింది . ఒక రచనా కురువృద్ధు రాలు తెరమరుగయిపోయారు. 84 సంవత్సరాలు సాహితీ ప్రపంచపు సామ్రాజ్ఞి చాలిక సెలవంటూ తరలిపోయారు.

బాల్యంలోనే ప్రమదావనాలు చదివి వ్యక్తిత్వాన్ని దిద్దుకున్న నేను ఆవిడ శిష్యురాలిని. నిన్నటి వరకూ కూడా ఆవిడ పాత కెరటాల్లో ఓలలాడటం, నన్ను అడగండి అంటూ చెప్పే జవాబుల్లో లోకాన్ని దర్శించటం ఇప్పుడిప్పుడు జరుగుతున్నట్టే ఉంది. ఆవిడ ప్రతి నవలా ఎన్నిసార్లో చదివి ఉంటాను .

“అమ్మాయ్ , నేర్చుకుంటూ నలుగురికీ చెప్పడమే నేను చేస్తున్న పని. నీ చుట్టున్న ప్రపంచానికి నీ రచన ఒక మార్గదర్శి కావాలి, ఒక దీపం కావాలి . ఒక చేతి కర్ర కావాలి. ఒక ఊతమవాలి”…
పూర్తిగా »

మాటల ఐంద్రజాలికుడు శేషేంద్ర

మాటల ఐంద్రజాలికుడు శేషేంద్ర

(గుంటూరు శేషేంద్ర శర్మ వర్థంతి సందర్భంగా)

శేషేంద్ర వచన కవితా కళను గురించి చాల తక్కువే పరిశోధన జరిగిందని చెప్పాలి. శేషేంద్ర పద్యరచనా సామర్థ్యం గురించి నేను కాదు నన్నయకన్నా ప్రాచీనుడైన విశ్వనాథ సత్యనారాయణ అంతటి ప్రాచీన కవే చెప్పాడు. శేషేంద్ర లాగా పద్యం రాయగలిగిన వాడు తెలుగు దేశంలో నలుగురైదుగురు కూడా లేరని అన్నాడు. ఆయన ఋతు ఘోష పద్య కావ్యం నాకు చాలా కాలం పారాయణ గ్రంథంలా ఉండేది. అంతటి పద్యరచనా కళను సొంత చేసుకున్న శేషేంద్ర వచన కవితలో కూడా చాలా మంచి ప్రయోగాలు చేశాడు. అంతే కాదు నేను ఎప్పుడూ అంటుంటాను అదేమంటే మామూలు వచనాన్ని అంటే కేవలం కమ్యూనికేషన్…
పూర్తిగా »

బాధాగ్ని కుసుమం: కలల కళ్ల నిషా

జనవరి 2013


బాధాగ్ని కుసుమం: కలల కళ్ల నిషా

‘బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్న… క్షణాల మధ్య అగాథంలో స్వప్న చక్షువుల నిషా’ ను రుచి చూపించించిన కవి అజంతా.  పువ్వులు, అగ్నుల భాష కలిసిపోతే ఎలా వుంటుందో వాసన చూయించిన కవి. ‘కాంతా సమ్మితత్వా’న్ని వదులుకోకుండానే ‘అగ్నిసమ్మితమై’న కవిత అజంతాది.

తెలుగు అజంత భాష. తెలుగు పదాలు హల్లులతో కాకుండా అచ్చులతో అంతమవుతాయి. అందుకే తెలుగుకు ఇంతటి సంగీత శక్తి. తెలుగుదనాన్నే కాదు, తెలుగు సంగీతాన్ని వచన కవితలో అందించిన కవి అజంతా.

చిన్న చిన్న వాక్యాలు చుదువుకోడానికి బాగుంటాయి. వాటికి కాస్త పద మైత్రి కలిస్తే వచనం వేగంగా వెళ్లిపోతుంది. ఎక్కడున్నామో తెలిసే లోగా రైలు స్టేషన్ కు చేరుతుంది. చదవీ…
పూర్తిగా »

సమ్మోహన మీ మోహన గీతం..

జనవరి 2013


సమ్మోహన మీ మోహన గీతం..

కవిత్వంలో నిరంతరం నవ్యత కోసమే అన్వేషణ సాగినట్లు కవిత్వచరిత్ర నిరూపిస్తుంది. ఆ రహస్యాన్ని జీర్ణించుకుని, తెలుగు నాట సాహిత్యాభిమానులను తన కవిత్వంతో  ఉర్రూతలూపిన కవి మో! తన సమ్మోహనకరమైన శైలితో స్వీయముద్రను ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా చూపెట్టిన అతి తక్కువ మంది కవుల్లో, ‘మో’ ముందు వరుసలో ఉంటారు. మో రాసిన ప్రతీ కవితా విలక్షణమైనదే! అది అనుసరణనూ అనుకరణనూ దరి చేరనీయని అనన్యమైన మార్గము.

ఇతని కవిత్వమంతా వైయక్తిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కవిత్వానికి ముసుగులుండవు, నటనలుండవు. స్వచ్ఛమైన భావాలతో తరగని స్వేచ్ఛాకాంక్షతో స్పష్టాస్పష్టంగా కనపడే తాత్విక చింతనతో మో రాసిన మొట్టమొదటి సంపుటి – “చితి-చింత”.

కవితా వస్తువు కవిత్వంలో…
పూర్తిగా »