నుడి – 3 (జనవరి, 2016) ఫలితాలు
పాఠకులకు నమస్కారం.
నుడి – 3 (జనవరి, 2016) ను ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచిన వారు:
1.కామేశ్వర రావు
2. రాధ మండువ
3. రవి
4. దీప్తి
5. నాగరాజు రవీందర్
‘నుడి’ పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
వివరణలు:
4 అడ్డం దగ్గర కొందరు తడబడ్డారు. పాత మాపా, పాత పాట, పాత దనా అని నింపారు.
దాని ఆధారం ఇలా ఉంది: పామాటలో తగు సగభాగం కొత్తది కాని నుడుగు (2, 2)
వివరణ: ‘తగు’లో సగభాగమైన ‘త’ను ‘పామాట’లో పా తర్వాత దూర్చితే పాత మాట వస్తుంది.
22 నిలువును కొందరు తప్పుగా నింపారు. పంకకం అని పూరించారు.
ఆధారం ఇలా వుంది: బురదలో చేప తోక పంచుట (3)
వివరణ: బురద = పంకం. చేప తోక = ప. ‘పంకం’లో ‘ప’ను దూర్చితే వచ్చేది పంపకం = పంచుట.
ఈ నెల నుండి Grid pattern ను మార్చుతున్నాం. Link ల సంఖ్యను తగ్గిస్తున్నందున పజిల్ పూరణ కొంచెం కఠినం అనిపించవచ్చు. అయితే ఆల్ కరెక్ట్ ఎంట్రీలు రాకపోయినా పాల్గొన్నవారిలో maximum correct గా నింపినవారి పేర్లను ప్రకటించబోతున్నాం కనుక, నిరాశ చెందక మునుపటిలానే పాల్గొనాలని మనవి. Feedback ను ఇస్తూనే వుండాలని కోరుతున్నాం.
**** (*) ****
ఈ నెల గడి బాగుంది, కొన్ని క్లూలు కొంతసేపు మెదడుకి పదునుబెట్టాయి!
కష్టమైనది కాకపోయినా 20 నిలువు, క్లూ బాగా నచ్చింది.
కామేశ్వరరావు గారు, మీ వ్యాఖ్య నిలువు 10 కి ప్రతిరూపం.
పర్యాయ padaalu
కామేశ్వర రావు గారూ,
ఈ నెల ‘నుడి’ బాగున్నదన్నందుకు సంతోషం, థాంక్స్.
ఈ పజిల్ ను మరింత కఠినం చేయటం పెద్ద కష్టమైన పనేం కాదు. కాని చమత్కారం తాలూకు వినోదాన్నీ, త్రిల్ (thrill) నూ పాఠకులు మిస్ కాకూడదనేది నా కోరిక. మూసిన నా పిడికిట్లో ఏముందో చెప్పుకో అన్నట్టు కాక జాగ్రత్తగా పరిశీలిస్తే, నిశితంగా ఆలోచిస్తే క్లూలోనే సమాధానం దొరికే విధంగా ఉండాలి ఆధారాలు అన్నది నా అభిమతం. అందుకే అక్షర/పద కేళికి (word ప్లే కు) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను నేను. The Hindu పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ ఈ principles మీదనే ఆధారపడి వుంటుంది. అయితే అది మరింత జటిలంగా వుంటుందనుకోండి. అంత జటిలం చేస్తే మన ‘నుడి’ని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశముంది కనుక, అలా చేయదల్చుకోలేదు.
రవి గారూ,
కామేశ్వర రావు గారి వ్యాఖ్యను నిలువు 10కి ప్రతిరూపం అనుకునే అవసరం లేదనుకుంటాను.
అరుణ పప్పు గారూ,
కామెంటులాంటిదాన్ని పెట్టటం పట్ల ఉత్సాహాన్ని కనబరిచినందుకు మీకు నా కృతజ్ఞతలు.
మూసిన నా పిడికిట్లో ఏముందో చెప్పుకో అన్నట్టు కాక జాగ్రత్తగా పరిశీలిస్తే, నిశితంగా ఆలోచిస్తే క్లూలోనే సమాధానం దొరికే విధంగా ఉండాలి ఆధారాలు అన్నది నా అభిమతం. – చాలా మంచి మాట చెప్పారు. లేకపోతే పారిపోతాం
ఎలనాగ గారూ,
నేను మీతో ఏకీభవిస్తాను. జటిలత ఎక్కువైతే జనప్రియత తగ్గిపోతుంది. కాబట్టి ఒకటి రెండు క్లూలు మాత్రం కాస్త ఎక్కువ పట్టుపట్టేట్టుగా ఉంటే సరిపోతుంది.
రవిగారూ,
నా వ్యాఖ్య దేనికి ప్రతిరూపం, 10 నిలువు – క్లూకా లేక సమాధానికా?