కవిత్వం

భ్రూం భ్రూం

మే 2016

కాశం భళ్లున దూసుకుపోతోంది
దిగంతాల మీద ఒక ఎర్రని చారిక

కిటికీలోంచి ఇనుప రెక్క మీదుగా
రెండు కళ్లను మోస్తూ ఒక చూపు

నేను అనుకుంటూనే వుంటాను
బొమ్మను ఫట్మని విరగ్గొడ్దామని

గుప్పున కొన్ని పిట్టలు ఎగుర్తాయి
అంగీ భుజ మ్మీద ఒక బర్డ్ పూప్

పాత పాత మాటలను ఏరుకురా
పాపం, చందమామకు ఇచ్చొద్దాం

ఆకాశ వీధిలో దూది కొండలలోన
సూర్యుని సూదిని వెదుక్కుందాం

భ్రూం భ్రూం భ్రూం భ్రూ-భ్రమణం
బొంగరం భళ్లున పగిలి పోతోంది

ఇంటి పిట్టను ఇచ్చేస్తామన్నారు
అది పాపాయి మాటినడం లేదు

నా క్కూడా ఎగ్గిరి పోవాలనుంది
కొందరు మనుషులంతే, ఎగర్లేరు

కొందరు సూర్యులుదయించరు

*